తెలుగువారు గర్వించదగ్గ విలక్షణమైన నటుడు జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి. కథానాయకుడుగాను క్యారెక్టర్ ఏక్టర్ గాను పలుచిత్రాలలో నటించారు ఆయన. రంగస్థలం మీద గిరీశం గా కన్యాశుల్కం నాటకంలో కీలకమైన పాత్రలో జీవించారు. ఆయన పుట్టినది మా స్వస్థలమైన శ్రీకాకుళం దగ్గర లుకలాం అనే గ్రామం. నాటకరంగంలో ఎంతో ప్రతిభ చూపిన ఈయన 1957 లో ఎం.ఎల్.ఎ. చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. దాదాపు 150 చిత్రాలలో నటించారు. అయితే కె.విశ్వనాథ్ చిత్రాలలో ప్రత్యేక పాత్రలలో రాణించారు. అలాగే తన సోదరులైన సోమయాజులు గారిని ప్రోత్సహించి మనకొక శంకరశాస్త్రిని అందించారు. రమణ మూర్తి వంటి మరొక చక్కని నటుడు మనకు భౌతికంగా దూరమైనా ఆయన సినీకళామతల్లికి చేసిన సేవను ఎన్నటికీ మరచిపోలేము. ఆయన జ్ఞాపకాలు మనతో శాశ్వతంగా నిలచిపోతాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరుగాక! రమణ మూర్తి నటించిన మంచి మనసుకు మంచి రోజులు నుండి మాస్టారి మధుర గీతం విందామా!
చిత్రం: | మంచి మనసుకు మంచి రోజులు (1958) | |
గీతం: | సముద్రాల జూనియర్ | |
స్వరం: | ఘంటసాల | |
గానం: | ఘంటసాల | |
సాకీ: | కోమల కవితా తార.. ప్రేమ సుధా ధారా | |
మనోహర తార.. నా మధుర సితార... ఆ..ఆ.. | ||
పల్లవి: | రావే నా చెలియా రావే నా చెలియా, చెలియా… | |
నా జీవన నవ మాధురి నీవే... | ||
నా జీవన నవ మాధురి నీవే.... | ||
రావే నా చెలియా.. | ||
చరణం: | నీ ఎల నవ్వుల పూచిన వెన్నెల... వెలుగును వేయి చందమామలై | |
నీ ఎల నవ్వుల పూచిన వెన్నెల... వెలుగును వేయి చందమామలై... | ||
నీ చిరు గాజుల చిలిపి మ్రోతలే... | ||
నీ చిరు గాజుల చిలిపి మ్రోతలే... | ||
తోచును అనురాగ గీతాలై... | ||
తోచును అనురాగ గీతాలై... | ||
రావే నా చెలియా.. చెలియా.. రావే నా చెలియా | ||
చరణం: | నీ అందియల సందడిలోన... నా ఈ డెందము చిందులు వేయునే | |
నీ అందియల సందడిలోన... నా ఈ డెందము చిందులు వేయునే.. | ||
నీ కను గీటులె వలపు పాటలే... ఎ..ఆ..ఆ..ఆ..ఆ.. | ||
నీ కను గీటులె వలపు పాటలే... నీ కడ సురలోక భోగాలే... | ||
నీ కడ సురలోక భోగాలే... | ||
రావే నా చెలియా రావే నా చెలియా | ||
చెలియా నా జీవన నవ మాధురి నీవే | ||
రావే.. రావే.. రావే.. రావే.. నా చెలియా |