Audio Source: From Video
Thanks to Ramragbir for providing the You Tube video
చిత్రం: | గృహ లక్ష్మి (1967) | ||
రచన: | ఆరుద్ర | ||
సంగీతం: | సాలూరు రాజేశ్వర రావు | ||
గానం: | ఘంటసాల వెంకటేశ్వర రావు, భానుమతీ రామకృష్ణ | ||
పల్లవి: | ఘంటసాల: | మనలో మనకే తెలుసునులే | |
ఈ మధుర మధురమగు ఆనందం | |||
మరపురాని మన కళ్యాణం | |||
మరపురాని మన కళ్యాణం | |||
భానుమతి: | మనలో మనకే తెలుసునులే | ||
ఈ మధుర మధురమగు ఆనందం | |||
మరపురాని మన కళ్యాణం | |||
మరపురాని మన కళ్యాణం | |||
చరణం: | భానుమతి: | మనసే పరిణయ వేదిక | |
మన వలపే మంగళ గీతిక | | మనసే | | ||
ఘంటసాల: | చూపే పిలిచే శుభలేఖ | ||
కనుచూపే పిలిచే శుభలేఖ | |||
భానుమతి: | లేత కోరిక ప్రేమ కానుక ఓ..ఓ..ఓ.. | | మనలో | | |
చరణం: | ఘంటసాల: | ఘన స్వాగతమన్నవి హృదయాలు | |
అభినందన లన్నవి అందాలు | | ఘన | | ||
భానుమతి: | పరువము జల్లే పన్నీరు | | పరువము | | |
కోటి తలపులు కోరి పిలిచెను ఓ..ఓ..ఓ.. | |||
ఘంటసాల: | మనలో మనకే తెలుసునులే | ||
ఈ మధుర మధురమగు ఆనందం | |||
మరపురాని మన కళ్యాణం | |||
చరణం: | భానుమతి: | నవ్వుల పువ్వుల దండలు | |
నవ యవ్వన జ్యోతులె హారతులు | |||
ఘంటసాల: | తొందర చేసే భావాలు | ||
ప్రేమ యాత్రకు సాగమన్నవి | |||
ఇద్దరు: | ఓ..ఓ..ఓ.. | ||
మనలో మనకే తెలుసునులే | |||
ఈ మధుర మధురమగు ఆనందం | |||
మరపురాని మన కళ్యాణం | |||
మరపురాని మన కళ్యాణం |
కృతజ్ఞతలు: సమాచారం పొందుపరచిన ఘంటసాల గళామృతము పాటల పాలవెల్లి మరియు వికి పీడియా బ్లాగులకు, వీడియో యూ ట్యూబ్ లో పొందుపరచిన ramragbir కు ధన్యవాదములు.