16, డిసెంబర్ 2011, శుక్రవారం

ఘంటసాల గానం చేసిన శ్రీహరి కేశవ నామా - భక్త అంబరీష చిత్రం నుండి

అయోధ్యకు రాజైన అంబరీషుడు విష్ణు భక్తుడు. శ్రీహరి కృపాకటాక్షంతో లభించిన శ్రీవారి సుదర్శన చక్రాన్ని తన పూజా మందిరంలో నెలకొల్పి నిత్యపూజలు చేస్తుంటాడు. కులగురువు సలహాపై ద్వాదశ వ్రతము నిష్టతో ఆచరిస్తుంటాడు. వ్రత సమయంలో ఏకాదశినాడు ఉపవసించి ద్వాదశ ఘడియలు ప్రారంభమయే తరుణంలో ఆహారం సేవించాలి. అయితే ఆఖరి ఏకాదశి నాడు ముక్కోపిగా ప్రసిద్ధి చెందిన దూర్వాస మహర్షి అంబరీషుని రాజ్యానికి వస్తాడు. రాజు కోరిక మీద ఆతిధ్యం స్వీకరిస్తానని స్నానార్ధం వెళ్లి ఎంతసేపటికీ తిరిగి రాడు. గురువు సలహా పై వ్రత ఫలితం పోకుండా కేవలము మంత్రజలము స్వీకరిస్తాడు అంబరీషుడు. అప్పుడే అక్కడకు వచ్చిన దూర్వాసుడు కోపంతో అంబరీషుని శపించబోగా, పూజా మందిరంలోని సుదర్శన చక్రం అడ్డుకుని దూర్వాసుని వెంబడిస్తుంది. మునిని త్రిమూర్తులు సైతం కాపాడ లేక పోతారు. విష్ణువు సలహాపై దూర్వాసుడు అంబరీషుని శరణు కోరుతాడు. దీనివలన విష్ణువును సేవించిన భక్తులను ఆ మురారి ఎప్పుడూ కాపాడుతాడు అన్నది సారాంశం. ఈ చిత్రంలో "శ్రీహరి కేశవ నామా" పాటలో "మధురిపు" అన్నపదం వాడారు కవి ఆరుద్ర గారు. రిపు అంటే శత్రువు, మధు అన్నవాడు ఒక రాక్షసుడు.  నిజానికి శ్రీహరి నిద్రిస్తుండగా అతని చెవి గులిమి (ear wax) నుండి మధు, కైటభ అను ఇద్దరు రాక్షసులు పుడతారు.  మాస్టారు పాడిన 'ప్రభాతి'లో "మధుకైటభారి (మధు కైటభ + అరి) శ్రీహరి ప్రక్కనుండి ఎల్ల లోకములగన్న మా తల్లీ లక్ష్మీ" అని వినే వుంటారు. అరి అంటే శత్రువు. మాస్టారు పాడిన శ్లోకం, పాట మరియు శ్రీమతి ఉడతా సరోజిని గారు పాడిన శ్లోకం యొక్క దృశ్య, సాహిత్యాలను ఇక్కడ పొందు పరుస్తున్నాను.       .


Thanks to kumarr116 for posting the video to You Tube

చిత్రం:         భక్త అంబరీష (1959)
సంగీతం:      ఎల్.మల్లేశ్వరరావు
గానం:         ఘంటసాల, సరోజిని, బృందం
పాట రచన:   ఆరుద్ర

ఘంటసాల:   ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
                శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
బృందం:       హరి ఓమ్
ఘంటసాల:   విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం
                లక్ష్మీకాంతం కమలనయనం
బృందం:       హరి ఓమ్
                యోగి హృద్యాన గమ్యం
                వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం
బృందం:       హరి ఓమ్

సరోజిని:      ఆ..ఆ..ఆ..ఆ
                లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
                దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం
                శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
                త్వాం త్రైలోక కుటుంబినీం సరసిజాం
                వందే..వందే..వందే.. ముకుంద ప్రియాం

ఘంటసాల:   శ్రీహరి కేశవ నామా (2)
                మధురిపు తారక నామా..
                శ్రీహరి కేశవ నామా

ఘంటసాల:   మాధవ నిన్నే మదిలో తలచి               | మాధవ |
                కాననలోనా కాపురమున్నా                 | కానలలోనా |
                కొలిచెడి వారికి కొరతేమి రాదు              | కొలిచెడి |
                ఖేదములేవీ రానే రావు                     | ఖేదములేవీ |
                కోరిన వరములనన్నీ..
                ఒసగెడి వాడవు కావా
                శ్రీహరి కేశవ నామా (2)

                దారుణమైనా..ఆ..ఆ..
                దారుణమైనా తాపమునైనా
                దునిమెడి బాణము నీ తిరునామమే       | దునిమెడి |
                భాగ్యములందు పెనుబాధలందు            | భాగ్యము |
                దాసుల నీవు వీడవు స్వామీ                        | దాసుల |
                నీ శుభ పదముల సేవా..
                కవచము వంటిది కాదా     
                శ్రీహరి కేశవ నామా
                మధురిపు తారక నామా...
బృందం:       శ్రీహరి కేశవ నామా (4)

                త్వం పితా త్వం చమే మాతా
                త్వం బంధు త్వం చ దేవతా
                త్వమేవ గతి స్సర్వం
                త్వమేవ గురు దేవ దేవ

14, డిసెంబర్ 2011, బుధవారం

అరుదైన ఘంటసాల, జిక్కి పాట - టకు టకు టమకుల బండి, సంసారం చిత్రం నుండి

"సంసారం" 1950 లో విడుదలైన సంసార పక్షమైన కుటుంబ కథా చిత్రం. ఇందులో అగ్రనటులు ఎ.ఎన్.ఆర్., ఎన్.టి.ఆర్. యిద్దరూ నటించారు. అరవై ఒక్క సంవత్సరాల క్రితం పల్లెటూర్లు, పట్టణాల మధ్య రాకపోకలు, పట్నం చదువులు చదివే దొరబిడ్డలు చదువులేని అమాయక పల్లె ప్రజలను చూసి చేసే చీదరింపులు, దానికి ప్రతిగా పల్లెటూరి వాళ్ళు చేసే ఈసడింపులు, ఎత్తిపొడుపులు, ఈ నేపధ్యంలో నాయికా నాయకులమీద చిత్రించిన పాట ఇది. "పట్నపోళ్ళు ఎంగిలి పీసు (english) లో మాట్టాడుతారట గందా!" అని అబ్బురపడే గ్రామీణులు, "పల్లెటూరిబైతులు నాటుబళ్ళలో వెళతారు" అనుకునే సదరు పట్టణపు నాగరీకులు, వీరి మధ్య జరిగిన వెటకారంతో కూడిన సంభాషణను ఒక చక్కని పాటగా రూపకల్పన చేసారు శ్రీ సదాశివ బ్రహ్మం గారు. "టకు టకు టకు టకు టమకుల బండి" అని ఎద్దులబండిని, జెర్రిపోతులాగ దూసుకుపోయే కారుని వర్ణించారు. అంతేకాక, ఊరికే మరమ్మత్తుకు వచ్చే డబ్బాకారుని "మేకు జారితే తోక పీకుడే" అని చక్కగా వర్ణించారు. స్వర బ్రహ్మ శ్రీ సుసర్ల దక్షిణామూర్తి గారు సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి మాస్టారు రెండు సోలోలు, ఒక పద్యం, ఒక యుగళ గీతం పాడారు. ఇక్కడ ఘంటసాల మాస్టారు, జిక్కి (కృష్ణవేణి), బృందం పాడిన ఈ పాట శ్రవణం, సాహిత్యం పొందు పరుస్తున్నాను. తెలుగు వీడియో లభ్యం కాక పోవడం వలన సంసారం హిందీ చిత్రం లోని దృశ్యానికి తెలుగు పాటను డబ్ చేసి ఇక్కడ పొందుపరచారు శ్రీ బొల్లాప్రగడ సోమేశ్వర రావు గారు. వారికి అభినందనలు.

ఘంటసాల      జిక్కి
చిత్రం:         సంసారం (1950)
రచన:         సదాశివ బ్రహ్మం
సంగీతం:      సుసర్ల దక్షిణామూర్తి
గానం:         ఘంటసాల, జిక్కి, బృందం
  
జిక్కి:          టకు టకు టకు టకు టమకుల బండి
                లంఖణాల బండీ, ఎద్దుల బండి, జోడెద్దుల బండి
బృందం:       టకు టకు టకు టకు టమకుల బండి
                లంఖణాల బండీ, యెద్దుల బండి
                జోడెద్దుల బండి, చల్ చల్ చల్
జిక్కి:          నాటు బండి గలగల ఒకటే మోత, కుదుపులు ఒకటే బాధగా
బృందం:       నాటు బండి గలగల ఒకటే మోత, కుదుపులు ఒకటే బాధగా  
బృందం:       టకు టకు టకు టకు టమకుల బండి
                లంఖణాల బండీ, యెద్దుల బండి, జోడెద్దుల బండి
ఘంటసాల:   పాం పాం
                తుర్రుబుర్రు తుర్రుబుర్రు మోటరు కారు
                జెర్రిపోతులాగ దొర్లిపోయావె కార                                  | తుర్రు బుర్రు |
జిక్కి:          కదలదు మెదలదు రధమండి, కూచున్నాడు విగ్రహమండి 
బృందం:       కదలదు మెదలదు రధమండి, కూచున్నాడు విగ్రహమండి
                చల్ చల్ చల్
జిక్కి:          నాటు బండి గలగల ఒకటే మోత, కుదుపులు ఒకటే బాధగా
బృందం:       నాటు బండి గలగల ఒకటే మోత, కుదుపులు ఒకటే బాధగా
                టకు టకు టకు టకు టమకుల బండి
                లంఖణాల బండీ, యెద్దుల బండి, జోడెద్దుల బండి

ఘంటసాల:   పాం పాం
                తినేది గాలి మేసేది నూనె తిరకాసే...ఏ..                   | తినేది గాలి |
                మేకు జారితే తోక పీకుడే                                    | మేకు జారితే |
                తస్సదియ్య దొరబిడ్డ ఎంగిలిపీసె,  
                బుసబుస రొసలూ యెందుకే                               | తస్సదియ్య |
బృందం:       టకు టకు టకు టకు టమకుల బండి
                లంఖణాల బండీ, యెద్దుల బండి, జోడెద్దుల బండి

12, డిసెంబర్ 2011, సోమవారం

నిరత సత్య ప్రౌఢి ధరణినేలిన (పద్యాలు) కృష్ణలీలలు చిత్రం నుండి ఆడియో, సాహిత్యంతో

1959 లో అలనాటి ప్రముఖ సినీ నటి లక్ష్మీ రాజ్యం యొక్క స్వంత నిర్మాణ సంస్థ అయిన రాజ్యం పిక్చర్సు పతాకం పై ఎస్.వి.రంగారావు, లక్ష్మీ రాజ్యం నటించిన చిత్రం కృష్ణ లీలలు. ఈ చిత్రానికి సంగీతం సుసర్ల దక్షిణామూర్తి గారు. ఘంటసాల మాస్టారు మూడు పద్యాలు, ఒక బృంద గీతం పాడారు. ఇక్కడ సదాశివ బ్రహ్మం వ్రాసిన పద్యం పొందు పరుస్తున్నాను.  ఈ పద్యంలో శ్రీకృష్ణుడు తనకు బావ అయిన ధర్మరాజుతో అన్న పద్యమిది. ఈ భూమినుండి పరిపాలించిన రాజులలో నిత్య సత్యవ్రతుడైన హరిశ్చంద్రుడు ఈ భూమిని వదిలి వెళ్ళలేదా!, అన్ని లోకాలు పాలించిన నలుడు తన వెంట భూమిని తీసుకు పోగాలిగేడా!, కృత యుగానికే అలంకారమైన మాంధాత (ఇక్ష్వాకు వంశీయుడు) ఐశ్వర్యాన్ని తనతో తీసుకొని పోగలిగేడా!, త్రేతాయుగ పురుషుడైన శ్రీరాముడు అసలిప్పుడీ భూమి పై వున్నాడా! ఓ! బావా! ఎందఱో రాజులు వచ్చారు, పోయారు గాని ఈ భూతలం నుండి ఏమీ తీసుకుని పోలేదు. నువ్వు మాత్రం ఎలా ఈ రాజ్యాన్ని గాని, సంపదను గాని నీ నెత్తికి కట్టుకుని వెళ్ళ గలవు?" అని దీని తాత్పర్యం. 

చిత్రం:       కృష్ణ లీలలు  (1959)
రచన:       సదాశివ బ్రహ్మం
సంగీతం:   సుసర్ల దక్షిణా మూర్తి
గానం:      ఘంటసాల

ఆడియో మూలం: ఘంటసాల గాన చరిత 

                నిరత సత్య ప్రౌఢి ధరణినేలిన హరిశ్చంద్రుడీ ధరబాసి చనగలేదె
                ఎల్ల లోకములేలి యెసగు శ్రీనలరాజు తనవెంట భూమిని గొనుచు చనెనే
                కృత యుగంబునకు అలంకృతిజేయు మాంధాత సిరిమూట గట్టుక నరుగ గనెనే
                జలధి అలరారు శ్రీరాముడు వుర్విపై యిప్పుడు ఉన్నవాడె

                ఎందరెందరొ రాజులు ఏగినారు! 
                బావా..
                ఎందరెందరో రాజులు ఏగినారు
                ఒక్కరును వెంట గొనిపోవరుర్వితలము
                నీవు మాత్రము రాజ్యంబు నీదు సిరియు
                తలను కట్టుక పోదువో ధర్మ హృదయా 
                ఆ..ఆ..ఆ.. విన్నపము

ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com

మాస్టారు పాడిన నేరు చిత్రాలు

చి- అంతస్తులు -1965 చి-అందం కోసం పందెం-1971 చి-అగ్గి బరాటా-1966 చి-అత్తా ఒకింటి కోడలే-1958 చి-అనగాఅనగా ఒక రాజు (డబ్బింగ్)-1959 చి-అన్నపూర్ణ-1960 చి-అప్పుచేసి పప్పుకూడు-1959 చి-అమరశిల్పి జక్కన్న-1964 చి-అమాయకుడు-1968 చి-ఆడ పెత్తనం-1958 చి-ఆత్మగౌరవం-1966 చి-ఆనందనిలయం-1971 చి-ఆప్తమిత్రులు-1963 చి-ఆరాధన-1962 చి-ఆస్తిపరులు-1966 చి-ఆహుతి-1950 చి-ఇద్దరు పెళ్ళాలు-1954 చి-ఇద్దరు మిత్రులు-1961 చి-ఇద్దరు మిత్రులు-1962 చి-ఉమాసుందరి-1956 చి-ఉయ్యాల జంపాల-1965 చి-ఉషాపరిణయం-1961 చి-ఋష్యశృంగ-1961 చి-ఏకవీర-1969 చి-కనకదుర్గ పూజా మహిమ-1960 చి-కన్నకొడుకు-1973 చి-కన్యాశుల్కం-1955 చి-కలసివుంటే కలదుసుఖం-1961 చి-కాళహస్తి మహత్మ్యం-1954 చి-కీలుగుఱ్ఱం-1949 చి-కుంకుమ రేఖ-1960 చి-కులగౌరవం-1972 చి-కృష్ణ ప్రేమ-1961 చి-కృష్ణ లీలలు-1959 చి-కృష్ణప్రేమ-1961 చి-కోటీశ్వరుడు-1970 చి-గంగా గౌరీ సంవాదము-1958 చి-గాంధారి గర్వభంగం-1959 చి-గాలిమేడలు-1962 చి-గుండమ్మకథ-1962 చి-గుణసుందరి కథ-1949 చి-గులేబకావళి కథ-1962 చి-గృహప్రవేశము-1946 చి-గృహలక్ష్మి-1967 చి-చండీరాణి-1953 చి-చంద్రహారం-1954 చి-చంద్రహాస-1965 చి-చరణదాసి-1956 చి-చింతామణి-1956 చి-చిట్టి తమ్ముడు-1962 చి-చెంచు లక్ష్మి-1958 చి-జగదేకవీరుని కథ-1961 చి-జయం మనదే-1956 చి-జయభేరి-1959 చి-జయసింహ-1955 చి-జరిగిన కథ-1969 చి-జీవన తరంగాలు-1973 చి-జైజవాన్‌-1970 చి-టైగర్ రాముడు-1962 చి-టౌన్‌ బస్-1957 చి-డా.ఆనంద్-1966 చి-తలవంచని వీరుడు-1957 చి-తెనాలి రామకృష్ణ-1956 చి-తేనె మనసులు-1965 చి-తోడికోడళ్ళు-1957 చి-దశావతారములు-1962 చి-దీపావళి-1960 చి-దేవకన్య-1968 చి-దేవత-1965 చి-దేవదాసు-1953 చి-దేవాంతకుడు-1960 చి-దేశద్రోహులు-1964 చి-దొంగనోట్లు (డబ్బింగ్)-1964 చి-దొరికితే దొంగలు చి-ద్రోహి-1948 చి-ధర్మదాత-1970 చి-ధర్మాంగద-1949 చి-నమ్మినబంటు-1960 చి-నర్తనశాల-1963 చి-నలదమయంతి-1957 చి-నవగ్రహపూజా మహిమ-1964 చి-నిర్దోషి-1951 చి-నిర్దోషి-1967 చి-పరమానందయ్య శిష్యుల కథ-1966 చి-పరోపకారం-1953 చి-పల్నాటి యుద్ధం-1947 చి-పల్నాటి యుద్ధం-1966 చి-పల్లెటూరి పిల్ల-1950 చి-పల్లెటూరు-1952 చి-పవిత్ర బంధం-1971 చి-పవిత్ర హృదయాలు-1971 చి-పసుపు కుంకుమ-1955 చి-పాండవ వనవాసం-1965 చి-పాండురంగ మహత్మ్యం-1957 చి-పాతాళ భైరవి-1951 చి-పిచ్చి పుల్లయ్య-1953 చి-పిడుగు రాముడు-1966 చి-పూజాఫలం-1964 చి-పెండ్లి పిలుపు-1961 చి-పెద్ద మనుషులు-1954 చి-పెళ్ళి కాని పిల్లలు-1961 చి-పెళ్ళి చేసి చూడు-1952 చి-పెళ్ళి సందడి-1959 చి-పెళ్ళినాటి ప్రమాణాలు-1958 చి-పేదరాశి పెద్దమ్మ కథ-1968 చి-పొట్టి ప్లీడరు-1966 చి-ప్రపంచం-1950 చి-ప్రమీలార్జునీయం-1965 చి-ప్రాయశ్చిత్తం-1962 చి-ప్రియురాలు-1952 చి-ప్రేమ నగర్-1971 చి-ప్రేమ-1952 చి-బంగారు గాజులు-1968 చి-బండ రాముడు-1959 చి-బందిపోటు-1963 చి-బడి పంతులు-1972 చి-బభ్రువాహన-1964 చి-బలే బావ-1957 చి-బాలనాగమ్మ-1959 చి-బాలభారతం-1972 చి-బాలరాజు కథ-1970 చి-బాలరాజు-1948 చి-బాలసన్యాసమ్మ కథ-1956 చి-బావమరదళ్ళు-1961 చి-బికారి రాముడు-1961 చి-బొబ్బిలి యుద్ధం-1964 చి-బ్రతుకుతెరువు-1953 చి-భక్త అంబరీష-1959 చి-భక్త జయదేవ-1961 చి-భక్త తుకారాం-1973 చి-భక్త రఘునాథ్-1960 చి-భక్త రామదాసు-1964 చి-భక్త శబరి-1960 చి-భట్టి విక్రమార్క-1960 చి-భలే అమ్మాయిలు-1957 చి-భాగ్యదేవత-1959 చి-భాగ్యరేఖ-1957 చి-భాగ్యవంతులు (డబ్బింగ్)-1962 చి-భామా విజయం-1967 చి-భీమాంజనేయ యుద్ధం-1966 చి-భీష్మ-1962 చి-భూకైలాస్-1958 చి-భూలోకంలో యమలోకం-1966 చి-మంచి మనసుకు మంచి రోజులు-1958 చి-మంచిరోజులు వచ్చాయి-1972 చి-మదన మంజరి-1961 చి-మనదేశం-1949 చి-మనుషులు-మమతలు-1965 చి-మరపురాని కథ-1967 చి-మర్మయోగి-1964 చి-మల్లీశ్వరి-1951 చి-మహాకవి కాళిదాదు-1960 చి-మహామంత్రి తిమ్మరుసు-1962 చి-మాయాబజార్-1957 చి-మూగ మనసులు-1964 చి-మోహినీ భస్మాసుర-1966 చి-యశొద కృష్ణ-1975 చి-యోగి వేమన-1947 చి-రంగుల రాట్నం-1967 చి-రక్త సిందూరం-1967 చి-రక్షరేఖ-1949 చి-రణభేరి-1968 చి-రత్నగిరి రహస్యం (డబ్బింగ్)-1957 చి-రహస్యం-1967 చి-రాజ మకుటం-1960 చి-రాజకోట రహస్యం-1971 చి-రాజు పేద-1954 చి-రాము-1968 చి-రుణానుబంధం-1960 చి-రేణుకాదేవి మహాత్మ్యం-1960 చి-రోజులు మారాయి-1955 చి-లక్ష్మమ్మ-1950 చి-లక్ష్మీ కటాక్షం-1970 చి-లవకుశ-1963 చి-వదినగారి గాజులు-1955 చి-వరుడు కావాలి-1957 చి-వాగ్దానం-1961 చి-వారసత్వం-1964 చి-వాల్మీకి-1963 చి-విచిత్ర కుటుంబం-1969 చి-విచిత్ర కుటుంబం-1969. పా-పి.సుశీల తో చి-విజయం మనదే-1970 చి-వినాయక చవితి-1957 చి-విమల-1960 చి-విష్ణుమాయ-1963 చి-వీర కంకణం-1957 చి-వీరఖడ్గము-1958 చి-వీరాంజనేయ-1968 చి-వెలుగు నీడలు-1961 చి-శకుంతల-1966 చి-శభాష్ రాజా-1961 చి-శభాష్ రాముడు-1959 చి-శాంతి నివాసం-1960 చి-శోభ-1958 చి-శ్రీ గౌరీ మహత్మ్యం-1956 చి-శ్రీ వల్లీ కల్యాణం (డ)-1962 చి-శ్రీ వేంకటేశ్వర వైభవం-1971 చి-శ్రీ సత్యనారాయణ మహత్యం-1964 చి-శ్రీ సింహాచలక్షేత్ర మహిమ-1965 చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ-1966 చి-శ్రీకృష్ణ కుచేల-1961 చి-శ్రీకృష్ణ తులాభారం-1966 చి-శ్రీకృష్ణ పాండవీయం-1966 చి-శ్రీకృష్ణ విజయం-1971 చి-శ్రీకృష్ణమాయ-1958 చి-శ్రీకృష్ణార్జున యుద్ధం-1963 చి-శ్రీరామభక్త హనుమాన్ (డబ్బింగ్)-1958 చి-శ్రీవేంకటేశ్వర మహత్మ్యం-1960 చి-శ్రీవేంకటేశ్వర వైభవం-1971 చి-షావుకారు-1950 చి-సంతానం-1955 చి-సంపూర్ణ రామాయణం-1972 చి-సంసారం-1950 చి-సతీ అనసూయ-1957 చి-సతీ సక్కుబాయి-1965 చి-సతీ సులోచన-1961 చి-సత్య హరిశ్చంద్ర-1965 చి-సప్తస్వరాలు-1969 చి-సరస్వతీ శపథం-1967 చి-సర్వర్ సుందరం-1966 చి-సారంగధర-1957 చి-సాహసవీరుడు-1956 (డబ్బింగ్) చి-సీతారామ కల్యాణం-1961 చి-సుమంగళి-1965 చి-స్వప్న సుందరి-1950 చి-స్వర్గసీమ-1945 చి-స్వర్ణ మంజరి-1962 చి-హరిశ్చంద్ర-1956

సహగాయనీ గాయకులు

గా-ఎ.పి.కోమల తో (3) గా-ఎం.వి.రాజమ్మ తో (1) గా-ఎల్.ఆర్.ఈశ్వరి తో (1) గా-ఎస్.జానకి తో (4) గా-గానసరస్వతి తో (1) గా-గోపాలరత్నం తో (1) గా-ఘంటసాల (72) గా-ఘంటసాల-బృందం (3) గా-జమునారాణి తో (2) గా-జి.వరలక్ష్మి తో (1) గా-జిక్కీ తో (4) గా-జిక్కీ-బాలసరస్వతి తో (1) గా-జిక్కీతో (5) గా-పలువురి తో (1) గా-పి.కన్నాంబ తో (1) గా-పి.బి.శ్రీనివాస్ తో (3) గా-పి.భానుమతి తో (10) గా-పి.లీల తో (18) గా-పి.లీలతో (2) గా-పి.సుశీల తో (46) గా-పి.సుశీల-బృందంతో (2) గా-పిఠాపురం తో (1) గా-బాలసరస్వతి తో (3) గా-బృందం తో (35) గా-బృందంతో (1) గా-బెంగుళూరు లత తో (1) గా-బెజవాడ రాజరత్నం తో (2) గా-భానుమతి-పిఠాపురం తో (1) గా-మాధవపెద్ది తో (2) గా-రాధాజయలక్ష్మి తో (2) గా-రేణుక తో (1) గా-లతా మంగేష్కర్ తో (1) గా-వి.జె.వర్మతో (1) గా-వి.సరళ తో (2) గా-శరావతి తో (1) గా-శోభారాణితో (2) గా-శ్రీదేవి తో (1) గా-సరోజిని తో (1) గా-సి.కృష్ణవేణి తో (2) గా-సుందరమ్మ తో (1)

మాస్టారి పాటల సంగీత దర్శకులు

సం-అద్దేపల్లి సం-అశ్వత్థామ సం-అశ్వద్ధామ సం-ఆదినారాయణ రావు సం-ఆర్.గోవర్ధనం సం-ఆర్.సుదర్శనం-ఆర్.గోవర్ధనం సం-ఎం.రంగారావు సం-ఎల్.మల్లేశ్వరరావు సం-ఎస్.పి.కోదండపాణి సం-ఓగిరాల సం-ఓగిరాల-అద్దేపల్లి సం-ఓగిరాల-టి.వి.రాజు సం-గాలి పెంచల సం-ఘంటసాల సం-జె.వి.రాఘవులు సం-జోసెఫ్-విజయాకృష్ణమూర్తి సం-టి.ఎం.ఇబ్రహీం సం-టి.చలపతిరావు సం-టి.జి.లింగప్ప సం-టి.వి.రాజు సం-నాగయ్య-తదితరులు సం-పామర్తి సం-పామర్తి-సుధీర్ ఫడ్కే సం-పి.శ్రీనివాస్ సం-పెండ్యాల సం-బాలాంత్రపు సం-బి.శంకర్ సం-మణి-పూర్ణానంద సం-మల్లేశ్వరరావు సం-మాస్టర్ వేణు సం-ముగ్గురు దర్శకులు సం-రాజన్‌-నాగేంద్ర సం-రాజు-లింగప్ప సం-రామనాథన్‌ సం-విజయా కృష్ణమూర్తి సం-విశ్వనాథన్‌-రామ్మూర్తి సం-వై.రంగారావు సం-సర్దార్ మల్లిక్ - పామర్తి సం-సాలూరు సం-సాలూరు-గోపాలం సం-సుదర్శనం-గోవర్ధనం సం-సుబ్బయ్యనాయుడు సం-సుబ్బరామన్‌ సం-సుబ్బురామన్ సం-సుసర్ల సం-హనుమంతరావు సం-MSV-రామ్మూర్తి-పామర్తి

మాస్టారి పాటల రచయితలు

ర-0 ర-అనిశెట్టి ర-అనిసెట్టి ర-ఆత్రేయ ర-ఆదినారాయణ రావు ర-ఆరుద్ర ర-ఉషశ్రీ ర-ఎ.వేణుగోపాల్ ర-కాళిదాసు ర-కాళ్ళకూరి ర-కొసరాజు ర-గబ్బిట ర-గోపాలరాయ శర్మ ర-ఘంటసాల ర-జంపన ర-జయదేవకవి ర-జాషువా ర-జి.కృష్ణమూర్తి ర-తాండ్ర ర-తాపీ ధర్మారావు ర-తిక్కన ర-తిరుపతివెంకటకవులు ర-తోలేటి ర-దాశరథి ర-దాశరధి ర-దీక్షితార్ ర-దేవులపల్లి ర-నార్ల చిరంజీవి ర-పరశురామ్‌ ర-పాలగుమ్మి పద్మరాజు ర-పింగళి ర-బమ్మెర పోతన ర-బమ్మెఱ పోతన ర-బాలాంత్రపు ర-బైరాగి ర-భాగవతం ర-భావనారాయణ ర-భుజంగరాయ శర్మ ర-మల్లాది ర-ముద్దుకృష్ణ ర-రాజశ్రీ ర-రామదాసు ర-రావులపర్తి ర-రావూరి ర-వారణాసి ర-విజికె చారి ర-వీటూరి ర-వేణు ర-వేములపల్లి ర-శ్రీశ్రీ ర-సదాశివ బ్రహ్మం ర-సముద్రాల జూ. ర-సముద్రాల సీ. ర-సి.నా.రె. ర-సినారె ర-సుంకర-వాసిరెడ్డి ర-సుబ్బారావు రచన-దాశరధి రచన-దేవులపల్లి రచన-పానుగంటి రచన-పింగళి రచన-బలిజేపల్లి