1960 లో విడుదలైన జానపద చిత్రం రాజ మకుటం. ఈ చిత్రంలో ఎన్.టి.ఆర్., రాజసులోచనల పై "ఊరేది పేరేది ఓ చందమామా" అనే ఆహ్లాదకరమైన యుగళ గీతాన్ని చిత్రీకరించారు. దీనిని ఘంటసాల, పి.లీల పాడారు. ఈ పాటను చారుకేశి రాగంలో ప్రధానంగా కూర్చి దానిలో మాయామాళవ గౌళ, రేవతి, మరియు సావేరి రాగాల మిశ్రమ ఛాయలు ఏర్పరిచి సంక్లిష్టమైన రాగమాలికగా కూర్చినది శ్రీ బాలాంత్రపు రజనీకాంత రావు గారు. ఆర్కెకెస్ట్రేషన్ సమకూర్చినది సంగీత దర్శకులు శ్రీ మాస్టర్ వేణు. రజనీకాంత్ గారి తండ్రిగారు ఆధునిక కవి ద్వయమైన వెంకట పార్వతీశ కవులలో ఒకరైన శ్రీ బాలాంత్రపు వెంకటరావు గారు. ఈ పాట ఎంతో ఆహ్లాదకరంగా వుంటుంది వినడానికి. చక్కని బాణీలో కూర్చిన ఈ పాట వింటుంటే ఏదో ఊహాలోకాల్లో తేలిపోతున్నట్లనిపిస్తుంది. ఈ పాట దృశ్య, శ్రవణ, సాహిత్యాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను. శ్రీ రజనీ గారిపై శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారు ఈ మాట వెబ్జైన్ కు వ్రాసిన వ్యాసం ఇక్కడ చదవండి.
Thanks to "Kotaonline" for uploading this video.
ఆడియో ఫైలు మూలం: ఘంటసాల గాన చరిత
| సాకీ: | పి.లీల: | ఎందుండి వచ్చేవో! ఏదిక్కు పోయేవో! ఓ...ఓ.. | |
| పల్లవి: | ఊరేది? పేరేది? ఓ చందమామ! (2) | (చారుకేశి) | |
| నిను జూచి నీలి కలువ పులకింపనేల? | |||
| ఊరేది పేరేది ఓ చందమామ! | |||
| ఘంటసాల: | ఓ..ఓ..జాబిల్లి నీలి కలువ విడరాని జంట | ||
| ఊరేల? పేరేల? ఓ కలువ బాల | |||
| ఊగేటి తూగేటి ఓ కలువ బాల | |||
| చరణం: | పి.లీల: | ఆ..ఆ..ఆ.. | |
| విరిసిన రేకుల చెలువనురా..ఆ..ఆ.. | (వకుళాభరణం) | ||
| కురిసే తేనెల కలువనురా | |||
| కలికి వెన్నెలల దొర రారా ఆ..ఆ..ఆ.. | (రేవతి) | ||
| మరుగేలనురా నెలరాజ తెర తీయర చుక్కల ఱేడా | (చారుకేశి) | ||
| రావోయి రావోయి ఓ చందమామ | |||
| చరణం: | ఘంటసాల: | పరువము లొలికే విరిబోణి (2) | (వకుళాభరణం) |
| బృందం: | ఆ..ఆ..ఆ.. | ||
| స్వప్నసరసిలో సుమరాణి ఆ..ఆ.. | (రేవతి) | ||
| కొలనంతా వలపున తూగే అలలై పులకింతలు రేగే | (చారుకేశి) | ||
| నీవాడ నేగానా ఓ కలువ బాల | |||
| చరణం: | పి.లీల: | తరుణ మధుర మొహనా హిమకర | (మాయామాళవ గౌళ) |
| గరళ యవ్వనాంబురాశి కనర | |||
| సురుచిర మదనా నివాళి ఇదిగో (2) | (సావేరి) | ||
| వలచిన నా హృదయమె గైకొన రారా | |||
| పి.లీల: | నీదాననే గానా ఓ కలువ ఱేడా | ||
| ఘంటసాల: | నీవాడనే గానా ఓ కలువ బాల | ||
| ఇద్దరు: | ఊహూ..హు..హూ..హూ..హు. హూ..హూ..హు.. |
కృతజ్ఞతలు: పాట వివరాలను, రాగాల సమాచారాన్ని ఘంటసాల గాన చరిత వెబ్ సైట్ లో పొందుపరచిన శ్రీ నూకల ప్రభాకర్ గారికి. అంతేకాక, పాటలోని సాహిత్యానికి సవరణలు, ఆయా పంక్తులకు నిర్దేశించబడిన రాగాలను సూచించిన శ్రీ శ్రీనివాస్ పరుచూరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

