పట్నం చదువులు చదివి, నాగరిక ప్రపంచంలో ఉన్నప్పటికీ పల్లె నదాలన్నా, పల్లె పదాలన్నా ఎంతో ఇష్టపడతారు కొందరు. పల్లెలో ఉంటూ, అక్షర జ్ఞానం లేక పోయినా తమ చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు పరవశించి పాటలు కూర్చి పాడుకునే, కపటమూ, కల్మషమూ లేని భాగ్య జీవులు కొందరు. అభిలాషలు ఒకటే అయినా, మనం మన చుట్టూ కట్టుకున్న కులాల, అంతస్తుల అడ్డుగోడల వలన తమ అభిమానాన్ని ప్రకటించ లేక, అభిప్రాయాన్ని వెలిబుచ్చలేక, చూపులతోనే గుండె లోతులను తరచి చూసి పరస్పరం ఆరాధించుకునే మూగ మనసులు కొందరివి. పల్లె వాతావరణం, నిండుగా పారే గోదావరి, దాని మీద బ్రతుకు తెరువు కోసం పడవ నడిపే వాడు, అందరినీ ఆకర్షించే అమాయకత్వం. ఇవన్నీచూస్తే ఎంతో ఆనందంగా వుంటుంది మనసుకు. ఇది చాల హృద్యమైన వాతావరణం. ఈ నేపధ్యంలో తనకు పాట నేర్పమని పట్నంలో చదివిన రాధ (సావిత్రి) పడవ నడిపే గోపీ (ఎ.ఎన్.ఆర్.) ని అడిగే సన్నివేశానికి, కథానాయికా-నాయకుల మరపురాని నటన, మన'సు'కవి ఆత్రేయ అద్భుత సాహిత్యం, మామ మహదేవన్ మధురమైన బాణీ, యాసను కూడా అనాయాసంగా, సునాయాసంగా పలికించే ఘంటసాల మాస్టారి వాణి, వారికి తగిన స్థాయిలో వంత కలిపిన గాన కోకిల సుశీల గొంతు 'మూగ మనసులు' చిత్రానికి ఎంతో వన్నె తెచ్చాయి. కథాపరంగా పాట ఎంత గొప్పదంటే ఒక జన్మలోని మధురానుభూతులు మరు జన్మవరకు వెంటాడతాయి. ఇదే సినిమాని హిందీలో 'మిలన్'* (నూతన్, సునీల్ దత్) గా నిర్మించారు. మళ్ళీ తిరిగి తెలుగులో అదే కథను 'జానకిరాముడు' (నాగార్జున, విజయశాంతి) గా పునర్నిర్మించారు.
Thanks to Sri Srinivas Bheestty for providing the colorized video clip.
పల్లవి: ఘంటసాల: నా పాట నీ నోట పలకాల శిలకా-2
*ఇదే మూసలో మిలన్ చిత్రంలో ఈ పాటకు ప్రతి యైన సావన్ కా మహీనా పాటను ఇక్కడ చూడవచ్చును.
కృతజ్ఞతలు: పాట వీడియో అందించిన సతీష్ గారికి, సమాచార సయోధ్య కలిగించిన వికీపీడియా వారికి ధన్యవాదాలు.
అంతర్జాలంలో వెతుకుతుంటే అనుకోకుండా ఈ విడియో క్లిప్ తారసిల్లింది. ఇందులో ఒక విషయం ఏమిటంటే ఈ పాటకు రంగులు అద్దడం. అయితే అపూర్వమైన విషయం ఏమిటంటే ఈ పాట ఆలపించే ముందు మాస్టారి హమ్మింగ్ నేను తొలిసారిగా చూస్తున్నాను. బహుశా పలువురు అభిమానులు ముందే చూసి ఉండవచ్చు. నాకున్న అనుభవం స్వల్పం. అయితే అందరూ ఆస్వాదిస్తారని ఈ లభ్యమైన స్వల్ప నిడివి గల దృశ్యాన్ని జతచేస్తున్నాను. దీనిని లభిమ్పజేసిన శ్రీనివాస్ భీశెట్టి గారికి ధన్యవాదాలు.
Thanks to Sri Srinivas Bheestty for providing the colorized video clip.
పల్లవి: ఘంటసాల: నా పాట నీ నోట పలకాల శిలకా-2
నీ బుగ్గలో సిగ్గులొలకాల శిలకా
సుశీల: నా పాట నీ నోట పలకాల చిలకా
ఘంటసాల: పలకాల శిలకా
సుశీల: పలకాల చిలకా
ఎ.ఎన్.ఆర్.: ఎహె, "చి" కాదు. శి, శి, శిలకా
సుశీల: పలకాల శిలకా
ఘంటసాల: ఆ.. నీ బుగ్గలో సిగ్గులొలకాల శిలకా...
సుశీల: నీ బుగ్గలో సిగ్గులొలకాల శిలకా.... || నా పాట ||
చరణం: ఘంటసాల: పాట నువు పాడాల, పడవ నే నడపాల-2
సుశీల: నీటిలో నేను నీ నీడనే సూడాల-2
ఘంటసాల: నా నీడ సూశి నువు కిలకిలా నవ్వాల-2
సుశీల: పరవళ్ళ నురుగుల్ల గోదారి ఉరకాల-2 || నా పాట ||
ఇద్ధరూ: నా పాట నీ నోట పలకాల శిలకా
నీ బుగ్గలో సిగ్గులొలకాల శిలకా
చరణం: ఘంటసాల: కన్నుల్లు కలవాల, యెన్నెల్లు కాయాల-2
సుశీల: యెన్నెలకే మనమంటే కన్నుకుట్టాల-2
ఘంటసాల: నీ పైట నా పడవ తెరసాప కావాల
ఆ...ఆ...ఆ..
సుశీల: ఆ...ఆ...ఆ..
ఇద్ధరూ: ఓ ఓ ఓ
ఘంటసాల: నీ పైట నా పడవ తెరసాప కావాల
సుశీల: నీ సూపె సుక్కానిగా దారి సూపాల-2 || నా పాట ||
ఇద్ధరూ: నా పాట నీ నోట పలకాల శిలకా
నీ బుగ్గలో సిగ్గులొలకాల శిలకా-2
చరణం: సుశీల: మనసున్న మణుసులే మనకు దేవుళ్ళు
మనసు కలిసిననాడె మనకు తిరనాళ్ళు || మనసున్న ||
సూరెచంద్రుల తోటి సుక్క ల్ల తోటి-2
ఆటాడుకుందాము ఆడనే ఉందాము-2
నా పాట నీ నోట పలకాల శిలకా
నీ బుగ్గలో సిగ్గులొలకాల శిలకా
నీ బుగ్గలో సిగ్గులొలకాల శిలకా..*ఇదే మూసలో మిలన్ చిత్రంలో ఈ పాటకు ప్రతి యైన సావన్ కా మహీనా పాటను ఇక్కడ చూడవచ్చును.
కృతజ్ఞతలు: పాట వీడియో అందించిన సతీష్ గారికి, సమాచార సయోధ్య కలిగించిన వికీపీడియా వారికి ధన్యవాదాలు.