1957 లో విడుదలైన తమిళ చిత్రం "తంగమలై రగస్యం" ను తెలుగులో 'రత్నగిరి రహస్యం' గా డబ్ చేశారు. ఈ చిత్రంలో ప్రముఖులైన శివాజీ గణేశన్, జమునలు నాయికా నాయికలుగా నటించారు. వారిరువురిపై చిత్రీకరించిన ఒక యుగళగీతం ఇహలోకమే ఇది గానమే. ఇది వరలో ఇదే చిత్రం నుండి ఘంటసాల, సుశీల పాడిన 'కల్యాణం రాజ కల్యాణం' గీతాన్ని మీరు విన్నారు. ఈ చిత్రానికి నిర్మాత-దర్శకులు శ్రీ బి. ఆర్. పంతులు, సంగీతం ఎం. ఎస్. రాజు మరియు టి. జి. లింగప్ప, పాట రచన మహాకవి శ్రీశ్రీ. డబ్బింగ్ చిత్రాలకు పాటలు వ్రాయడం కత్తి మీద సాము వంటిది. పెదవుల కదలికకు అనుగుణంగా భావం ప్రకటిస్తూ, సాహిత్యం తో సమరం చేయాలి. అయితే ఈ విద్యలో శ్రీశ్రీ, రాజశ్రీ వంటి వారు నిష్ణాతులు. వారికిది కొట్టిన పిండి. అయితే ఒకోసారి క్లిష్టత వలన కొన్ని పదాలు (ఉ.దా.మానవుల్) తప్పవు. అయినప్పటికీ భావం బాగా పలికింది మాస్టారి, సుశీల గారి గొంతులలో.
చిత్రం: | రత్నగిరి రహస్యం - డబ్బింగ్ చిత్రం (1957) |
రచన: | శ్రీశ్రీ |
గానం: | ఘంటసాల, పి.సుశీల |
సంగీతం: | ఎం.ఎస్.రాజు, టి.జి.లింగప్ప |
పల్లవి: | సుశీల: | ఇహలోకమే ఇది గానమే | | ఇహలోకమే | |
| | నిను జూడ నా మది పాడే | |
| | శోకం ఇక లేదు మోదము నేడే | |
| | | |
చరణం: | సుశీల: | వనరాజ్య శోభన నిధియే సుమా! | |
| | ఇల రమ్యమగు వీణ శృతి చేయుమా | |
| | మదినాటినా, మరుబాణమా! | |
| | మన ప్రేమ గెలిపించు సుమగీతమా! | |
| | ఇహలోకమే ఇది గానమే | |
| | నిను జూడ నా మది పాడే | |
| | శోకం ఇక లేదు మోదము నేడే | |
| | | |
చరణం: | సుశీల: | ఆ..ఆ..ఆ..ఆ.. | |
| | చెలువార పూదోట పదం పాడగా | |
| | ఈ పువ్వులను జూచి కదలాడగా | |
| | పులకించు నా మదే నిను తాకగా | |
| ఇద్దరు: | ఇహలోకమే | |
| ఘంటసాల: | ఇది గానమే | | ఇహలోకమే | |
| | నిను జూడ నా మది పాడే | |
| సుశీల: | శోకం ఇక లేదు మోదము నేడే | |
| | | |
చరణం: | ఘంటసాల: | మానవుల్ కనరాని వనరాణియే | |
| | దేవ.గానమె మరపించు కలవాణియే | |
| | మానవుల్ కనరాని వనరాణియే | |
| | ప్రాణములను లాగ వల వేసెనే..ఏ..ఏ.. | | ప్రాణములను | |
| | నా మానస నిధులెల్ల కొనివేసెనే | |
| | మానస నిధులెల్ల కొనివేసెనే | |
| | ఇది గానమే.. అనుబంధమే..ఏ.ఏ. | | ఇది గానమే | |
| | హృదయాల ముదమార నడయాడుదాం | |
| ఇద్దరు: | ఇహలోకమే ఇది గానమే | | ఇహలోకమే | |
| | నిను జూడ నా మది పాడే | |
| | శోకం ఇక లేదు మోదము నేడే | |
Sincere thanks to Sri B.Someswara Rao garu for providing the You Tube Video.