1959 లో విడుదలైన చిత్రం బండరాముడు. ఈ చిత్రానికి సంగీత దర్సకత్వం సుసర్ల దక్షిణామూర్తి మరియు కె.ప్రసాద రావు. ఇందులో ఘంటసాల మాస్టారు బృందం ఆలపించిన రసవత్తర భక్తీ గీతం రాదా మోహన రాస విహారి". దీనిని చిత్తూరు వి. నాగయ్య గారిపై చిత్రీకరించారు. పాట రచన జంపన (చంద్రశేఖర రావు). ఈయన రచయితే కాక దర్శక-నిర్మాత కూడ. చిత్రానికి దర్సకత్వం పి. పుల్లయ్య. ఈ చిత్రం లో ఎన్.టి.ఆర్., సావిత్రి, రేలంగి, రాజనాల ముఖ్య తారాగణం.
చిత్రం:
బండ రాముడు (1959)
రచన:
జంపన
సంగీతం:
సుసర్ల దక్షిణామూర్తి, కె.ప్రసాదరావు
గానం:
ఘంటసాల, బృందం
బృం:
గోపాలా జయ గోపాలా -2
ప:
ఘం:
రాధా మోహన రాసవిహారీ
యదుకుల పూజిత వనమాలీ
బృం:
గోపాలా జయ గోపాలా -2
మురళీ లోలా మునిజన పాలా
సురగుణ శోభిత గిరిధారీ
బృం:
గోపాలా జయ గోపాలా -2
చ:
ఘం:
మధురం మధురం మాధవ స్మరణం
మధురం మధురం మా..ధవ స్మరణం
ఆత్మ శాంతికది మూల ధనం
సనక సనందన మునిజన వందితా..
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
సనక సనందన మునిజన వందితా..
నంద కుమారుడె దైవమురా-2
రాధా మోహన రాసవిహారీ
యదుకుల పూజిత వనమాలీ
బృం:
గోపాలా జయ గోపాలా -2
చ:
ఘం:
శ్యామ సుందరుని కోమల రూపుని-2
యమునా విహారుని కొలువుమురా..
హరియేరా.. శ్రీహరియేరా…
హరియేరా.. శ్రీహరియేరా…
హరిపద సేవయె చరితార్ధమురా-2
రాధా మోహన రాసవిహారీ
యదుకుల పూజిత వనమాలీ
బృం:
గోపాలా జయ గోపాలా -4
ఘం:
గోపాలా...ఆ..ఆ..
కృతజ్ఞతలు: యూ ట్యూబ్ వీడియో అందించిన శ్రీ బొల్లాప్రగడ సోమేశ్వర రావు గారికి, సమాచారం పొందుపరచిన వికిపీడియా మరియు ఘంటసాల గళామృతము పాటల పాలవెల్లి బ్లాగులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు.
"ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం? నరజాతి సమస్తం పర పీడన పరాయణత్వం" అని అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఏ దేశమో ఎందుకు? మన భారతదేశాన్నే తీసుకుంటే స్వరాజ్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా అవినీతి, బంధుప్రీతి, లంచగొండితనం విచ్చలవిడిగా సాగుతూనే వున్నాయి. ఆ నేపధ్యంలో 1961 లో అన్నపూర్ణ పతాకంపై విడుదలైన ప్రబోధాత్మక, ప్రయోజనాత్మక చిత్రం వెలుగు నీడలు. ఈ చిత్రం కోసం శ్రీశ్రీ వ్రాసిన మహోన్నతమైన రచన "పాడవోయి భారతీయుడా!". నిజానికి ప్రతి స్వాతంత్ర దినోత్సవం నాడు ఈ పాట తలచుకోని తెలుగు వారుండరు. మన ప్రస్తుత దుస్థితి, పరిస్థితి ఆనాడే శ్రీశ్రీ వివరించారు. అది అప్పటికీ, ఇప్పటికీ అలాగే వుంది. కళాశాల వార్షికోత్సవంలో గేయరూపంగా ఈ పాటను నాగేశ్వర్రావు, రాజసులోచలనలపై చిత్రీకరించారు. పాడినది ఘంటసాల, పి.సుశీల, బృందం. ఈ చిత్రానికి సంగీతం పెండ్యాల నాగేశ్వర రావు. మాస్టారు వెలుగు నీడలు చిత్రానికి ఆరు పాటలు పాడారు.
కృతజ్ఞతలు: వెలుగు నీడలు సినిమా పోస్టరు అందించిన బొల్లాప్రగడ సోమేశ్వర రావు గారికి, యూ ట్యూబ్ వీడియో పొందు పరచిన రవి కుమార్ గారికి, సమాచారము పొందు పరచిన వికిపీడియా మరియు ఘంటసాల గళామృతము పాటల పాలవెల్లి వెబ్ సైట్లకు హృదయ పూర్వక ధన్యవాదములు.
ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com