1956 లో విడుదలైన బాల సన్యాసమ్మకథ లో శ్రీ కొంగర జగ్గయ్య, శ్రీమతి కృష్ణకుమారి గార్లు నటించారు. ఆదర్శ ప్రేమికులైన రాధాకృష్ణుల పై శ్రీ సముద్రాల రామానుజాచార్య (సముద్రాల జూనియర్) వ్రాసిన చక్కని పాటకు ర'సాలూరు రాజేశ్వర రావు గారు అద్భుతమైన బాణీని కట్టారు. ఈ చిత్రానికి మాస్టారు పాడింది ఒకే పాట. అదీ యుగళ గీతం. ఈ పాట వింటూ వుంటే మరికొన్ని సాలూరి వారి పాటలు లీలగా స్ఫురిస్తాయి. దీనిని ఘంటసాల మాస్టారు, కోమల గారు గానం చేసారు. ముఖ్యంగా ఒక చరణం అయిన తరువాత వచ్చే మాస్టారి గళం నిజంగా 'కంచుఘంట' లా అనిపిస్తుంది. పాట అందుకున్న ఊపు ఇది నిజంగా స్వరరాజేశ్వరం అని చెబుతుంది.
చిత్రం: బాల సన్యాసమ్మ కథ (1956)
చిత్రం: బాల సన్యాసమ్మ కథ (1956)
రచన: సముద్రాల జూనియర్
సంగీతం: ఎస్.రాజేశ్వరరావు
గానం: ఘంటసాల, ఎ.పి.కోమల
మూలం: ఘంటసాల గాన చరిత.
కోమల: అడుగో.. అడుగో.. అరుదెంచేను
బృందావన మోహనుడు
అడుగో అడుగో అరుదెంచేను
బృందావన మోహనుడు | అడుగో అడుగో |
తొందర పడకే రాధికా! | తొందర పడకే |
నంద కుమారుడు నీ వాడే | నంద కుమారుడు |
అడుగో అడుగో అరుదెంచేను
బృందావన మోహనుడు
ఘంటసాల: ఓ! ఓ..ఒఓ.. ఒఓఓ.. ఓఒఓ.
తెలిసీ తెలియని వలపులు చిలికే..
కలువల చెలువల కన్నులతో
విరిసీ విరియని విరజాజులతో..
సరసములాడె నవ్వులతో..
ఎదురు చూచు రాధా..ఆ..ఆ..
నాకెదురయ్యే రాధా..ఆ..ఆ.. | ఎదురుచూచు |
కోమల: ఎన్నినాళ్ళకు ఈ కనికరము
ఎన్నాళ్ళకు ఈ దరిశనము
ఎన్నో యేళ్ళుగా సలిపిన తపము
ఈనాడే ఫలియించినదే
తొందర పడకే రాధికా.. | తొందర పడకే |
నంద కుమారుడు నీ వాడే.. | నంద కుమారుడు |
ఘంటసాల: ఓ..ఓఓఓ ఓఓఓ
మధురా పురమని పేరేగానీ
మాధురులేమీ లేనే లేవే
మధురతరం మా గోకులమే
మధుర మధురము రాధిక ప్రేమా
ఎదురు చూచు రాధా.. ఆ.. ఆ..
నాకెదురయ్యే రాధా.. ఆ.. ఆ | ఎదురుచూచు |
ఆ.. ఆ.. ఆ.. ఆ..