18, నవంబర్ 2018, ఆదివారం

జయ కాశీ విశ్వనాథా - హరిశ్చంద్ర చిత్రం నుండి ఘంటసాల, లీల, సత్యవతి బృందం

రాజ్యం పిక్సర్స్ పతాకంపై లక్ష్మీ రాజ్యం చంద్రమతిగా, ఎస్.వీ.ఆర్. హరిశ్చంద్రునిగా 1956 లో నిర్మించిన అద్భుతమైన చిత్రం హరిశ్చంద్ర. తరువాత ఇదే కథను సత్య హరిశ్చంద్ర గా ఎన్.టి.ఆర్. తో నిర్మించారు. హరిశ్చంద్ర చిత్రంలో విశ్వామిత్రునిగా గుమ్మడి, అతని శిష్యుడు నక్షత్రకునిగా రేలంగి నటించారు. చిత్రం ఆద్యంతము పాటలు పద్యాలో. ఈ పద్యాలకు ప్రాణం పోసారు ఘంటసాల మాస్టారు. ఈ చిత్రం నుండి కాశీ విశ్వేస్వరుని పై ఘంటసాల లీల, సరస్వతి బృందంతో పాడిన పాటను విని ఆనందించండి. 

చిత్రం: హరిశ్చంద్ర (1956)
రచన: జంపన
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
గానం: ఘంటసాల, పి.లీల, సరస్వతి, బృందం
బృందం: సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివా-2
ఓం హరహరమహదేవ, హరహరమహదేవ, శంభో
ఘంటసాల: ప్రభో..ఓ..ఓ..
బృందం: హరహరమహదేవ
ఘంటసాల: దయాకరో
బృందం: హరహరమహదేవ
ఘంటసాల: కృపాళో..ఓ...ఓ.. శంభో మహాదేవ
బృందం: శంభో మహాదేవ 
హరహరమహదేవ్ శంభో హరహరమహదేవ్ -3
పల్లవి: ఘంటసాల: జయ కాశీవిశ్వనాథా..ఆ..ఆ..! మము కాపాడుమా జగన్నాథా!-2
బృందం: హరహరమహదేవ్ శంభో హరహరమహదేవ్ -2
పి.లీల: అమ్మా!..ఆ..ఆ.., అమ్మా..ఆ..ఆ..
చల్లని తల్లివి గౌరీ.ఈ..ఈ. నీ సంతతి నీవే కావకున్న
ఉల్లాకాలలో దారేదమ్మా అమ్మా మా జీవితాలకు నీడేదమ్మా అమ్మా
బృందం: హరహరమహదేవ్ శంభో హరహరమహదేవ్ -2
చరణం: ఘంటసాల: ఆ..ఆ… సదమలానంద తేజోమయా ఆ.ఆ..ఆ..
సకలలోక పాలకా..ఆ.. సర్వేశ్వరా, శంభో..ఓ..ఓ..
నిత్యము సత్యము నిర్మల కర్మము -2 
నెలకొల్పుట నీ విధి కాదా-2
కాశీవిశ్వనాథా..ఆ...! మము కాపాడుమా జగన్నాథా!
మము కాపాడుమా జగన్నాథా
బృందం: హరహరమహదేవ్ శంభో హరహరమహదేవ్ -2
చరణం: పి.లీల: ఆ..ఆ.. అనాథ హృదయమే ఆలయమైతే బాధ యేలనయ్యా
బ్రతుకు భారమౌనటయ్యా
అనాథ హృదయమే ఆలయమైతే బాధ యేలనయ్యా
బ్రతుకు భారమౌనటయ్యా
ఘంటసాల: ఆ..కాశీ విశ్వనాథా!
సరస్వతి: ఆ..కాశీ విశ్వనాథా..ఆ..ఆ మము కాపాడుమా జగన్నాథా
మము కాపాడుమా జగన్నాథా
ముగ్గురు: ఆ..పావనమౌ నీ నామ స్మరణే శాంతినొసంగునుగా ప్రభో
పావనమౌ నీ నామ స్మరణే శాంతినొసంగునుగా ప్రభో
బృందం: హరహరమహదేవ్ శంభో హరహరమహదేవ్ -2
ఘంటసాల: ఆ..ఆ..ఆ..
బృందం: హరహరమహదేవ్ శంభో హరహరమహదేవ్ -2
ఘంటసాల: హే! మాతా, హే! అంబే, హే! ప్రభో..
బృందం: హరహరమహదేవ్ శంభో హరహరమహదేవ్ -2

Thanks to Priyansh Doneparthy for up loading the video to You Tube.

16, నవంబర్ 2018, శుక్రవారం

నాడు తులాభార నాటకమ్మున - కృష్ణప్రేమ నుండి ఘంటసాల, పి.బి.శ్రీనివాస్ సంవాదపద్యాలు


నిర్మాణం: మహేంద్ర పిక్చర్స్
చిత్రం: కృష్ణప్రేమ (1961)
రచన: ఆరుద్ర
సంగీతం: పెండ్యాల
గానం: ఘంటసాల, పి.బి. శ్రీనివాస్ 
పి.బి.శ్రీనివాస్: నాడు తులాభార నాటకమ్మున నన్ను వీధిలో వేలమ్ము వేసినావు
ఘంటసాల: బంగారమునకీవు బరువు తూగవటన్న సత్యమ్ము జగతిలో చాటినాను
పి.బి.శ్రీనివాస్: గయునకు హితభోధగావించి మా బావతో వైరము బడద్రోసినావు
ఘంటసాల: ప్రతినబూనినవేళ పక్షపాతము నీకు లేదను పేరు కల్గించినాను
పి.బి.శ్రీనివాస్: శ్రీదేవికలనాడు చెంచులక్ష్మీ గాధ తెలిపి చిక్కులు మాకు తెచ్చినావు
ఘంటసాల: ఆ విధమ్మునదెల్పిఅడవుల తిరుగాడు నిన్ను వైకుంఠాన నిల్పినాను
పి.బి.శ్రీనివాస్: కలహభోజనా…  కలహభోజన నిను నమ్మి కపటనాటకమున
పాత్ర దాల్చుట కడుకష్టమయ్యా…
ఘంటసాల: కష్టమంతయు నాది విఖ్యాతి నీది కృష్ణా…
కష్టమంతయు నాది విఖ్యాతి నీది
అడ్డు చెప్పక నాటకమాడవయ్యా…

15, నవంబర్ 2018, గురువారం

అడిగానని అనుకోవద్దు - బాలరాజు కథ నుండి ఘంటసాల, సుశీల

లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ సంస్థ 1970 లో బాపు దర్శకత్వంలో అలనాతి బాలనటుడు మాస్టర్ ప్రభాకర్ టైటిల్ పాత్రలో నిర్మించిన చక్కని పిల్లల చిత్రం బాలరాజు కథ. మామ మహదేవన్6 ఈ చిత్రానికి మధురమైన మరపురాని పాటలను స్వరప్రిచారు. నిజజీవితంలో తారసపడే వ్యక్తుల ద్వారా చక్కని సూక్తులను పిల్లలు ఎంత బాగా తెలుసుకుంటారో వాటిని ఎలా పాటించాలో అన్న ఇతివృత్తాన్ని చాల చక్కగా చూపించారు బాపు గారు. ఈ చిత్రం లోని పాటలన్నీ ఆణిముత్యాలె. అందులో మహాబలిపురం మహాబలిపురం అన్న పాట జనమెరిగిన చక్కని పాట. ఎదే చిత్రానికి ఘంటసాల మాస్టారు, సుశీల పాడిన ఒక చక్కని పాటను ఇక్కడ పొందుపరుస్తున్నాను. మనసుకు హత్తుకునేలా చక్కన్ని సాహిత్యాన్ని అందించారు కొసరాజు.


చిత్రం:
బాలరాజు కథ (1970)
సంగీతం:
కె.వి. మహదేవన్
సాహిత్యం:
కొసరాజు
గానం: 
ఘంటసాల, సుశీల
సుశీల:
అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటేయొద్దు
ఏమిటీ రహస్యం స్వామీ ఏమిటీ విచిత్రం
అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటేయొద్దు
ఏమిటీ రహస్యం? స్వామీ ఏమిటీ విచిత్రం?
సుశీల:
ఒక్క రాయిని కాలికిందేసి తొక్కుతు ఉంటారెందుకు?
ఇంకొక్క రాతికి చేతులెత్తుకొని మొక్కుతు ఉంటారెందుకు?
ఒక్క రాయిని కాలికిందేసి తొక్కుతు ఉంటారెందుకు?
ఇంకొక్క రాతికి చేతులెత్తుకొని మొక్కుతు ఉంటారెందుకు?
ఘంటసాల:
అది వీధిలోన పడి ఉన్నందుకు
అది వీధిలోన పడి ఉన్నందుకు
ఇది గుడిలో బొమ్మై కూర్చున్నందుకూ
సుశీల:
అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు
ఏమిటీ రహస్యం స్వామీ ఏమిటీ విచిత్రం
సుశీల:
మనిషికి ఒక పెళ్ళే చాలంటూ దేవుడు కేటేట పెళ్ళేందుకు?
ఊరుమీద పడి చందాలెందుకు
మనిషికి ఒక పెళ్ళే చాలంటూ దేవుడు కేటేట పెళ్ళేందుకు?
ఊరుమీద పడి చందాలెందుకు
ఘంటసాల:
లోకులు చూచి తరించుటకు - 2
పలుగాకుల బొజ్జల పెంచుటకు -2
సుశీల:
మహమ్మదీయులు పిలిచే దేవుడు
క్రైస్తవులంతా కొలిచే దేవుడు
ఏడుకొండల వేంకటేశ్వరుడు గోవిందా గోవిందా
శ్రీశైలంలో మల్లిఖార్జునుడు
వారూ వీరూ ఒకటేనా  వేరువేరుగా ఉన్నారా
శ్రీశైలంలో మల్లిఖార్జునుడు
వారూ వీరూ ఒకటేనా వేరువేరుగా ఉన్నారా
ఘంటసాల:
సర్వవ్యాపి నారాయణుడు..ఊ..
సర్వవ్యాపి నారాయణుడు
ఎక్కడ జూచిన ఉంటాడు
ఆ స్వామి కొరకెనే శోధిస్తున్నా
తీర్ధాలన్నీ తిరుగుతు ఉన్నా
సుశీల:
ఆఁ అట్టా రండి దారికి
అక్కడ ఇక్కడ ఎక్కడ చూచిన దేవుడు ఉంటాడన్నారు
మీరొక్క దెబ్బతో తేల్చారు
అక్కడ ఇక్కడ ఎక్కడ చూచిన దేవుడు ఉంటాడన్నారు
మీరొక్క దెబ్బతో తేల్చారు
ఎక్కడ బడితే అక్కడ ఉంటే ఇక్కడకెందుకు వచ్చారు
ఏ రాతికి మొక్కను వచ్చారు
అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటేయొద్దు
ఏమిటీ రహస్యం? స్వామీ ఏమిటీ విచిత్రం?

9, ఫిబ్రవరి 2018, శుక్రవారం

కనుపించవా వైకుంఠవాసి - ఋష్యశృంగ నుండి ఘంటసాల, కోమల యుగళగీతం

నిర్మాణం: గీతా పిక్చర్స్ వారి 
చిత్రం: ఋష్యశృంగ (1961)
రచన: సముద్రాల జూనియర్ 
సంగీతం: టి.వి.రాజు 
గానం: ఘంటసాల, పి.లీల, ఎ.పి.కోమల
నిర్మాత: పి.ఎస్.శేషాచలం
దర్శకత్వం: ముక్కామల
ఘంటసాల: కనుపించవా వైకుంఠవాసి ననుబాసి పోయేవా
ఆ..ఆ.. నీ బాస మరచేవా | కనుపించవా |
కోమల: మునిబాలుని కనజాలనా నా యతనాలు సాగేనా
ఓ.. అడియాస లాయేనా
లీల: స్వామి కరుణించెలే నేడు అరుదెంచులే
ఇక పండేను నా నోములే
ఓ..ఫలియించు నా ప్రేమలే
ఘంటసాల: వైకుంఠమాసలు చూపి నాలోన ఆశలు రేపి -2
నారాయణ ఈ తీరున మోసాలు చేసేవా ఆ..ఆ..
ననుబాసి పోయేవా ఆ..ఆ.. నీ బాస మరచేవా
కోమల: ఏ మౌన నా శపథాలే, ఇటులాయెనే ఫలితాలే -2
నారాయణ దయపూనవా, దరిచూపవా దేవా ఆ.
యతనాలు సాగేనా, ఓ.. అడియాసలాయేనా
లీల: మాసిపోయేను ఈనాటి క్షామమే
తాండవించేను ఏచోట క్షేమమే | మాసిపోయేను |
జగాలన్ని తేలేను ఆనందాలా..-2
పండేను నా నోములే, ఓ.. ఫలియించు నా ప్రేమలే
ఘంటసాల: కనుపించవా వైకుంఠవాసి ననుబాసి పోయేవా
ఆ..ఆ.. నీ బాస మరచేవా
కృతజ్ఞతలు: చలనచిత్ర వివరాలను సమకూర్చిన ఘంటసాల గళామృతము-పాటల పాలవెల్లి వ్యవస్థాపకులు శ్రీ కొల్లూరు భాస్కరరావు గారికి, యూ ట్యూబ్ లో దృశ్యఖండిక పొందుపరచిన Chitralahari Music గారికి ధన్యవాదములు.

2, ఫిబ్రవరి 2018, శుక్రవారం

ఉలకక పలుకక ఉన్నతీరే తెలియనీక - ఎస్.జానకి, ఘంటసాల

నిర్మాణం: శ్రీ శ్రీనివాస్ వారి 

చిత్రం: టైగర్ రాముడు (1962)

రచన: సముద్రాల జూనియర్ 

సంగీతం: ఘంటసాల

గానం: ఘంటసాల, ఎస్.జానకి పల్లవి: జానకి: ఉలకక, పలుకక, ఉన్నతీరే తెలియనీక 


మనసు దోచినవారే, పగటి దొంగలు కారా?

ఘంటసాల: ఉరుకుతు, కులుకుతు, చేతికందీ దొరకక 


పారిపోయే వారే పగటి దొంగలు కారా?చరణం: జానకి: దారిదోచీ, వీలుచూచీ కొంగులాగే వారో

ఘంటసాల: ఆశచూపి, మనసురేపీ, మాయజేసే వారో

జానకి: అహాహ 

ఘంటసాల: ఒహోహో

జానకి: దారిదోచీ, వీలుచూచీ కొంగులాగే వారో

ఘంటసాల: ఆశచూపి, మనసురేపీ, మాయజేసే వారో

జానకి: తెరచాటు అలవాటు పరిపాటిగా

ఘంటసాల: ఒహో

జానకి: ఉలకక, పలుకక, ఉన్నతీరే తెలియనీక 


మనసు దోచినవారే, పగటి దొంగలు కారా?చరణం: ఘంటసాల: కనుల పిలిచి, కబురులాడి, కలతరేపే వారో

జానకి: తోడులేని ఆడవారి ఉడికిలించే వారో

ఘంటసాల: అహాహ 

జానకి: ఒహోహో

ఘంటసాల: కనుల పిలిచి, కబురులాడి, కలతరేపే వారో

జానకి: తోడులేని ఆడవారి ఉడికిలించే వారో

ఘంటసాల: నవ్వించి, కవ్వించి, ఊరించుచూ


ఓహో

ఘంటసాల: ఉరుకుతు, కులుకుతు, చేతికందీ దొరకక 


పారిపోయే వారే, పగటి దొంగలు కారా?

జానకి: ఆహహా

ఘంటసాల: ఓహొహో

జానకి: ఆహహాహాహహా

ఇద్దరు: ఆహహా


ఓహొహో


ఆహహాహాహహా

26, జనవరి 2018, శుక్రవారం

నీ పేరే నా ప్రాణం - పాయశ్చిత్తం (డబ్బింగ్) నుండి ఘంటసాల, పి.సుశీల

నిర్మాణం: శరవణ ఫిలింస్ వారి 

చిత్రం: ప్రాయశ్చిత్తం (డబ్బింగ్) 1962

రచన: అనిసెట్టి 

సంగీతం: విశ్వనాథన్‌-రామ్మూర్తి-జి.కె.వెంకటేష్ 

గానం: ఘంటసాల, సుశీల పల్లవి: సుశీల: నీ పేరే నా ప్రాణం నీ మాటే వేదం


నీతోటే భువిలోన వెలసేను స్వర్గం, వెలసేను స్వర్గం

ఘంటసాల: ఊ..ఊ..ఊ..


నాకనులు కోరేను నిను గాంచు భాగ్యం, నినుగాంచు భాగ్యం

సుశీల: ఊ..ఊ..ఊ..

ఘంటసాల: నీ చెంత మనసంత విరిసేను సౌఖ్యం, విరిసేను సౌఖ్యం

సుశీల: ఊ..ఊ..ఊ..చరణం: సుశీల: మదిలోన మధురాశలూహించుకొందు, ఊహించుకొందు ఊ..


ముదమార మురిపించు ప్రణయాల విందు, ప్రణయాల విందు


బాధల్లొ ఓదార్చు నీ తల్లి నౌదు నే తల్లి నౌదు 

ఘంటసాల: ఊ..ఊ..ఊ..

సుశీల: ప్రియమార ఒడినాడు చిన్నారివందు, చిన్నారివందు

ఘంటసాల: ఊ..ఊ..ఊ..

సుశీల: నీ పేరే నా ప్రాణం నీ మాటే వేదం


నీతోటే భువిలోన వెలసేను స్వర్గం, వెలసేను స్వర్గం

ఘంటసాల: ఊ..ఊ..ఊ..చరణం: సుశీల: వలపించు ప్రియులల్లె పవనాలు పాడే, పవనాలు పాడే..ఏ


విరులన్ని కన్నెలై కల్లాపమాడే, కల్లాపమాడె 


హృదయాలు వేరైన ఒకటేలే ప్రాణం, ఒకటేలే ప్రాణం

ఘంటసాల: ఊ..ఊ..ఊ..


లోకాన ఈనాడు పొంగేను ప్రణయం, పొంగేను ప్రణయం

ఘంటసాల: ఊ..ఊ..ఊ..

సుశీల: నీ పేరే నా ప్రాణం నీ మాటే వేదం


నీతోటే భువిలోన వెలసేను స్వర్గం, వెలసేను స్వర్గం

సుశీల: ఊ..ఊ..ఊ..22, జనవరి 2018, సోమవారం

దివిజుల్ మౌనులు - కృష్ణప్రేమ నుండి ఘంటసాల పద్యం

చిత్రం: కృష్ణప్రేమ (1961)
రచన: తాపీ ధర్మారావు
సంగీతం: పెండ్యాల
గానం: ఘంటసాల

 
దివిజుల్ మౌనులు జ్ఞానులున్‌ హృదయవీధిన్‌ కృష్ణు బంధింపగా


మివులన్‌ బూనియు చేతగాక తుదిమెమ్మేయంచు కేల్మోర్తురే


ఔనా! నీకునునాకు సాధ్యమది భామారత్నమా భక్రిరజ్జువున్‌


బూనక కట్టగా వసమే కృష్ణున్‌ విష్ణురోచిష్ణునిన్‌


19, జనవరి 2018, శుక్రవారం

ఒహొహొ మావయా ఇదేమయ్యా - ఆరాధన నుంచి ఘంటసాల, సుశీల

నిర్మాణం: జగపతి వారి 

చిత్రం: ఆరాధన (1962)

రచన: ఆరుద్ర 

సంగీతం: ఎస్.రాజేశ్వర రావు 

గానం: ఘంటసాల, సుశీల పల్లవి: సుశీల: ఒహొహొ మావయ్యా! ఇదేమయ్యా బలెబలె బాగా ఉందయ్యా


ఒహొహొ మావయ్యా! ఇదేమయ్యా బలెబలె బాగా ఉందయ్యా


ఇంటిని విడిచి షికారు కొడితే, ఎంతో హాయి కలదయ్యా

ఘంటసాల: ఒహొహొ అమ్మాయీ! ఇది కాలేజీ, బలెబలె బతికిన కాలేజి 


ఒహొహొ అమ్మాయీ! ఇది కాలేజీ, బలెబలె బతికిన కాలేజి 


మాటలురాని మృగాలు కొన్ని మనిషికి పాఠం చెబుతాయి చరణం: సుశీల: పులులూ, చిరుతలు, సింహాలన్ని వెలుపల తిరిగిన ప్రమాదమే


ఓ మావయ్యా…మావయ్యా

ఘంటసాల: కొందరు ఘరాన మనుషులకన్న కౄరము కావీ జంతువులు 


ఓ అమ్మాయీ, అమ్మాయీ


క్రౌర్యము పెరిగిన మనిషిని మృగాన్ని కటకటాలలో పెడతారు

సుశీల: ఒహొహొ మావయ్యా! ఇదేమయ్యా బలెబలె బాగా ఉందయ్యాచరణం: ఘంటసాల: గుఱ్ఱపు హంశం, గాడిద వంశం చారల చారల జీబ్రావి 


చుక్కల జిరాఫి ఒంటెకు బంధువు, మనిషికి బంధువు చింపంజీ


మనిషి చేష్టలు కొందరికుంటే

సుశీల: కోతి చేష్టలు కొందరివి 

ఘంటసాల: హా…

సుశీల: హహ్హహ్హహ్హ

ఘంటసాల: ఒహొహొ అమ్మాయీ! ఇది కాలేజీ, బలెబలె బతికిన కాలేజి చరణం: సుశీల: నీరున తిరిగే, నోరును తెరిచే ఏనుగులాంటిది ఏమిటది?


ఓ మావయ్యో మావయ్యా


ఏనుగు వంటిది నీటి మృగము, దానికి తమ్ముడు ఖడ్గమృగం


అధికులు పేదల కాల్చుకు తింటే ఇవి ఆకు అలమే తింటాయి 

సుశీల: ఒహొహొ మావయ్యా! ఇదేమయ్యా బలెబలె బాగా ఉందయ్యాచరణం: సుశీల: రాజులు ఎక్కే అంబారీపై అందరు ఎక్కుట తప్పుకదా!

ఘంటసాల: రోజులు మారాయ్, రాజులు పోయి ప్రజలే ప్రభువులు ఈనాడు 

సుశీల: ఆహా..

ఘంటసాల: ప్రజలే ప్రభువులు ఈనాడు 


మనుషులపైన సవారి కన్నా ఏనుగు సవారి నయం కదా!

సుశీల: ఆ..నిజం నిజం

ఘంటసాల: అహ మజా మజా

సుశీల: ఓ మావయ్యా ఇదేమయ్యా, బలె బలె బాగా ఉందయ్యా

ఘంటసాల: ఒహొహొ అమ్మాయీ! ఇది కాలేజీ, బలెబలె బతికిన కాలేజి 16, జనవరి 2018, మంగళవారం

అనాఘ్రాతం పుష్పం - కాళిదాస శ్లోకం శకుంతల చిత్రం నుండి ఘంటసాల గళంలోనిర్మాణం: రాజ్యం వారి

చిత్రం: శకుంతల (1966)

రచన: మహాకవి కాళిదాసు

సంగీతం: ఘంటసాల

గానం: ఘంటసాల
ఘంటసాల: అనాఘ్రాతం పుష్పం కిసలయమలూనం కరరుహై


రనావిద్ధం రత్నం మధు నవమనాస్వాదిత రసమ్‌ |


అఖండం పుణ్యానాం ఫలమివ చ తద్రూపమనఘం


న జానే భోక్తారం కమిహ సముపస్థాస్యతి విధిః ||2-10||

अनाघ्रातं पुष्पं किसलयमलूनं कररुहै


रनाविद्धं रत्नं मधु नवमनास्वादितरसम्‌।


अखण्डं पुण्यानां फलमिव च तद्रूपमनघं


न जाने भोक्तारं कमिह समुपस्थास्यति विधि: ॥2-10॥కృతజ్ఞతలు: చలనచిత్ర వివరాలను సమకూర్చిన ఘంటసాల గళామృతము-పాటల పాలవెల్లి వ్యవస్థాపకులు శ్రీ కొల్లూరు భాస్కరరావు గారికి, యూ ట్యూబ్ లో దృశ్యఖండిక పొందుపరచిన Gunner NFDB గారికి ధన్యవాదములు.

15, జనవరి 2018, సోమవారం

స్వార్ధకామాంధులై జగమెల్ల - శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ నుండి ఘంటసాల పద్యంశ్రీ శంభు ఫిలింస్‌

చిత్రం: శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ (1966)

రచన: పింగళి

సంగీతం: పెండ్యాల

గానం: ఘంటసాల
ఘంటసాల: స్వార్ధకామాంధులై జగమెల్ల కబళించు రాక్షసులవనిపై బ్రతుకజనునే


మతపిశాచావేశ మహిమచే లోకాలపీడించు శతులు జీవించనౌనే


స్త్రీ, బాల, వృద్ధుల చిత్రహింసలు చేయు ఉన్మత్తులకు ధర ఉనికి తగునే


దుర్గుణోద్ధతి ప్రజాద్రోహమ్ముగావించు దుండగులీధర నుండుటెటుల 


పరమఘోర కిరాత ముష్కరులు వద్ధులగుట ఎవ్వరు ఒక్క కన్నీటిబొట్టునైన


విడువగరాని ఆ అధమజాతి ఖలుడు వీనికి దుర్మృతికలిగెనిటుల

విన్నపము

ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com

మాస్టారు పాడిన నేరు చిత్రాలు

చి-అంతస్తులు-1965 (2) చి-అంతా మనవాళ్ళే-1954 (1) చి-అందం కోసం పందెం-1971 (2) చి-అగ్గి బరాటా-1966 (1) చి-అత్తా ఒకింటి కోడలే-1958 (1) చి-అన్నపూర్ణ-1960 (1) చి-అప్పుచేసి పప్పుకూడు-1959 (5) చి-అమరశిల్పి జక్కన్న-1964 (2) చి-అమాయకుడు-1968 (1) చి-ఆడ పెత్తనం-1958 (2) చి-ఆత్మగౌరవం-1966 (1) చి-ఆనందనిలయం-1971 (1) చి-ఆప్తమిత్రులు-1963 (1) చి-ఆరాధన-1962 (2) చి-ఆస్తిపరులు-1966 (1) చి-ఇద్దరు పెళ్ళాలు-1954 (1) చి-ఇద్దరు మిత్రులు-1961 (3) చి-ఉమాచండీగౌరీశంకరుల కధ-1968 (1) చి-ఉమాసుందరి-1956 (3) చి-ఉయ్యాల జంపాల-1965 (1) చి-ఉషాపరిణయం-1961 (1) చి-ఋష్యశృంగ-1961 (1) చి-ఏకవీర-1969 (1) చి-కనకదుర్గ పూజా మహిమ-1960 (2) చి-కన్నకొడుకు-1973 (1) చి-కన్యాశుల్కం-1955 (2) చి-కలసివుంటే కలదుసుఖం-1961 (2) చి-కాళహస్తి మహత్మ్యం-1954 (10) చి-కీలుగుఱ్ఱం-1949 (4) చి-కుంకుమ రేఖ-1960 (1) చి-కులగౌరవం-1972 (1) చి-కృష్ణ లీలలు-1959 (3) చి-కృష్ణప్రేమ-1961 (3) చి-కొడుకు కోడలు-1972 (1) చి-గాలిమేడలు-1962 (2) చి-గుండమ్మకథ-1962 (1) చి-గుడిగంటలు-1964 (1) చి-గుణసుందరి కథ-1949 (1) చి-గులేబకావళి కథ-1962 (4) చి-గృహప్రవేశము-1946 (1) చి-గృహలక్ష్మి-1967 (3) చి-చండీరాణి-1953 (1) చి-చంద్రహారం-1954 (3) చి-చంద్రహాస-1965 (1) చి-చరణదాసి-1956 (2) చి-చింతామణి-1956 (1) చి-చిట్టి తమ్ముడు-1962 (1) చి-చిలకా-గోరింక-1966 (1) చి-చివరకు మిగిలేది!-1960 (1) చి-చెంచు లక్ష్మి-1958 (1) చి-జగదేకవీరుని కథ-1961 (3) చి-జయం మనదే-1956 (1) చి-జయభేరి-1959 (3) చి-జయసింహ-1955 (3) చి-జరిగిన కథ-1969 (1) చి-జీవన తరంగాలు-1973 (1) చి-జైజవాన్‌-1970 (1) చి-టైగర్ రాముడు-1962 (1) చి-డా.ఆనంద్-1966 (1) చి-డా.చక్రవర్తి-1964 (1) చి-తెనాలి రామకృష్ణ-1956 (5) చి-తేనె మనసులు-1965 (1) చి-తోడికోడళ్ళు-1957 (1) చి-దీపావళి-1960 (2) చి-దేవకన్య-1968 (1) చి-దేవత-1965 (1) చి-దేవదాసు-1953 (1) చి-దేవాంతకుడు-1960 (1) చి-దేశద్రోహులు-1964 (1) చి-దొరికితే దొంగలు (1) చి-ద్రోహి-1948 (1) చి-ధర్మదాత-1970 (1) చి-ధర్మాంగద-1949 (1) చి-నమ్మినబంటు-1960 (1) చి-నర్తనశాల-1963 (2) చి-నలదమయంతి-1957 (1) చి-నవగ్రహపూజా మహిమ-1964 (1) చి-నాదీ ఆడజన్మే-1965 (1) చి-నిర్దోషి-1951 (1) చి-నిర్దోషి-1967 (1) చి-పరమానందయ్య శిష్యుల కథ-1966 (2) చి-పరోపకారం-1953 (2) చి-పల్నాటి యుద్ధం-1947 (3) చి-పల్నాటి యుద్ధం-1966 (1) చి-పల్లెటూరి పిల్ల-1950 (1) చి-పల్లెటూరు-1952 (3) చి-పవిత్ర బంధం-1971 (1) చి-పవిత్ర హృదయాలు-1971 (1) చి-పసుపు కుంకుమ-1955 (1) చి-పాండవ వనవాసం-1965 (5) చి-పాండురంగ మహత్మ్యం-1957 (1) చి-పాతాళ భైరవి-1951 (1) చి-పిచ్చి పుల్లయ్య-1953 (1) చి-పిడుగు రాముడు-1966 (1) చి-పూజాఫలం-1964 (1) చి-పెండ్లి పిలుపు-1961 (1) చి-పెద్ద మనుషులు-1954 (2) చి-పెళ్ళి కాని పిల్లలు-1961 (2) చి-పెళ్ళి చేసి చూడు-1952 (3) చి-పెళ్ళి సందడి-1959 (1) చి-పెళ్ళినాటి ప్రమాణాలు-1958 (3) చి-పేదరాశి పెద్దమ్మ కథ-1968 (2) చి-పొట్టి ప్లీడరు-1966 (1) చి-ప్రపంచం-1950 (1) చి-ప్రమీలార్జునీయం-1965 (2) చి-ప్రియురాలు-1952 (1) చి-ప్రేమ నగర్-1971 (1) చి-ప్రేమ-1952 (1) చి-బంగారు గాజులు-1968 (1) చి-బండ రాముడు-1959 (1) చి-బందిపోటు-1963 (1) చి-బడి పంతులు-1972 (1) చి-బభ్రువాహన-1964 (3) చి-బలే బావ-1957 (1) చి-బాల భారతం-1972 (1) చి-బాలనాగమ్మ-1959 (4) చి-బాలభారతం-1972 (1) చి-బాలరాజు కథ-1970 (1) చి-బాలరాజు-1948 (2) చి-బాలసన్యాసమ్మ కథ-1956 (1) చి-బావమరదళ్ళు-1961 (1) చి-బికారి రాముడు-1961 (1) చి-బొబ్బిలి యుద్ధం-1964 (1) చి-బ్రతుకుతెరువు-1953 (1) చి-భక్త అంబరీష-1959 (2) చి-భక్త జయదేవ-1961 (1) చి-భక్త తుకారాం-1973 (3) చి-భక్త రఘునాథ్-1960 (2) చి-భక్త రామదాసు-1964 (1) చి-భక్త శబరి-1960 (1) చి-భట్టి విక్రమార్క-1960 (1) చి-భలే అమ్మాయిలు-1957 (1) చి-భాగ్యదేవత-1959 (1) చి-భాగ్యరేఖ-1957 (1) చి-భామా విజయం-1967 (2) చి-భీమాంజనేయ యుద్ధం-1966 (4) చి-భీష్మ-1962 (5) చి-భూకైలాస్-1958 (4) చి-భూలోకంలో యమలోకం-1966 (1) చి-మంచి మనసుకు మంచి రోజులు-1958 (1) చి-మంచి మనసులు-19 (1) చి-మంచిరోజులు వచ్చాయి-1972 (1) చి-మనదేశం-1949 (3) చి-మనసు మమత (1) చి-మనుషులు-మమతలు-1965 (1) చి-మరపురాని కథ-1967 (2) చి-మర్మయోగి-1964 (1) చి-మల్లీశ్వరి-1951 (3) చి-మహాకవి కాళిదాదు-1960 (2) చి-మహామంత్రి తిమ్మరుసు-1962 (3) చి-మాయాబజార్-1957 (3) చి-మూగ మనసులు-1964 (2) చి-మోహినీ భస్మాసుర-1966 (1) చి-యశొద కృష్ణ-1975 (1) చి-యోగి వేమన-1947 (1) చి-రంగుల రాట్నం-1967 (1) చి-రక్త సిందూరం-1967 (1) చి-రక్షరేఖ-1949 (1) చి-రణభేరి-1968 (2) చి-రహస్యం-1967 (2) చి-రాజ మకుటం-1960 (1) చి-రాజకోట రహస్యం-1971 (2) చి-రాజు పేద-1954 (2) చి-రాము-1968 (2) చి-రుణానుబంధం-1960 (1) చి-రేణుకాదేవి మహాత్మ్యం-1960 (1) చి-రోజులు మారాయి-1955 (1) చి-లక్ష్మమ్మ-1950 (2) చి-లక్ష్మీ కటాక్షం-1970 (2) చి-లవకుశ-1963 (1) చి-వదినగారి గాజులు-1955 (1) చి-వరుడు కావాలి-1957 (1) చి-వాగ్దానం-1961 (3) చి-వారసత్వం-1964 (2) చి-వాల్మీకి-1963 (1) చి-విచిత్ర కుటుంబం-1969 (2) చి-విజయం మనదే-1970 (1) చి-వినాయక చవితి-1957 (5) చి-విమల-1960 (2) చి-విష్ణుమాయ-1963 (1) చి-వీర కంకణం-1957 (2) చి-వీరాంజనేయ-1968 (2) చి-వెలుగు నీడలు-1961 (2) చి-వెలుగునీదలు-1961 (1) చి-శకుంతల-1966 (1) చి-శభాష్ రాజా-1961 (1) చి-శభాష్ రాముడు-1959 (1) చి-శాంతి నివాసం-1960 (1) చి-శోభ-1958 (1) చి-శ్రీ గౌరీ మహత్మ్యం-1956 (4) చి-శ్రీ వేంకటేశ్వర వైభవం-1971 (1) చి-శ్రీ సత్యనారాయణ మహత్యం-1964 (2) చి-శ్రీ సింహాచలక్షేత్ర మహిమ-1965 (1) చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ-1966 (1) చి-శ్రీకృష్ణ కుచేల-1961 (2) చి-శ్రీకృష్ణ తులాభారం-1966 (1) చి-శ్రీకృష్ణ పాండవీయం-1966 (3) చి-శ్రీకృష్ణ విజయం-1971 (1) చి-శ్రీకృష్ణమాయ-1958 (2) చి-శ్రీకృష్ణార్జున యుద్ధం-1963 (1) చి-శ్రీవేంకటేశ్వర మహత్మ్యం-1960 (1) చి-శ్రీవేంకటేశ్వర వైభవం-1971 (2) చి-షావుకారు-1950 (2) చి-సంతానం-1955 (5) చి-సంపూర్ణ రామాయణం-1972 (4) చి-సంసారం-1950 (3) చి-సతీ అనసూయ-1957 (2) చి-సతీ సక్కుబాయి-1965 (3) చి-సతీ సులోచన-1961 (2) చి-సత్య హరిశ్చంద్ర-1965 (2) చి-సప్తస్వరాలు-1969 (1) చి-సారంగధర-1957 (2) చి-సీతారామ కల్యాణం-1961 (2) చి-సుమంగళి-1965 (1) చి-స్వప్న సుందరి-1950 (3) చి-స్వర్గసీమ-1945 (1) చి-స్వర్ణ మంజరి-1962 (1) చి-హంతకులొస్తున్నారు జాగ్రత్త-1966 (1) చి-హరిశ్చంద్ర-1956 (2)

సహగాయనీ గాయకులు

గా-ఎ.పి.కోమల తో (3) గా-ఎం.వి.రాజమ్మ తో (1) గా-ఎల్.ఆర్.ఈశ్వరి తో (1) గా-ఎస్.జానకి తో (4) గా-గానసరస్వతి తో (1) గా-గోపాలరత్నం తో (1) గా-ఘంటసాల (79) గా-ఘంటసాల-పి.సుశీల (3) గా-ఘంటసాల-బృందం (5) గా-జమునారాణి తో (2) గా-జి.వరలక్ష్మి తో (1) గా-జిక్కీ తో (4) గా-జిక్కీ-బాలసరస్వతి తో (1) గా-జిక్కీతో (5) గా-పలువురి తో (1) గా-పి.కన్నాంబ తో (1) గా-పి.బి.శ్రీనివాస్ తో (3) గా-పి.భానుమతి తో (11) గా-పి.లీల తో (20) గా-పి.సుశీల తో (46) గా-పి.సుశీల-బృందంతో (2) గా-పిఠాపురం తో (1) గా-బాలసరస్వతి తో (3) గా-బృందం తో (35) గా-బృందంతో (2) గా-బెంగుళూరు లత తో (1) గా-బెజవాడ రాజరత్నం తో (2) గా-భానుమతి-పిఠాపురం తో (1) గా-మాధవపెద్ది (5) గా-రాధాజయలక్ష్మి తో (2) గా-రేణుక తో (1) గా-లతా మంగేష్కర్ తో (1) గా-వి.జె.వర్మతో (1) గా-వి.సరళ తో (2) గా-శరావతి తో (1) గా-శోభారాణితో (2) గా-శ్రీదేవి తో (1) గా-సరోజిని తో (1) గా-సి.కృష్ణవేణి తో (2) గా-సుందరమ్మ తో (1) గా-సుశీల-బృందం తో (1)

మాస్టారి పాటల సంగీత దర్శకులు

స-విజయభాస్కర్ (1) సం -A.M.రాజా (1) సం- ఘంటసాల (1) సం-అద్దేపల్లి (1) సం-అశ్వత్థామ (4) సం-అశ్వద్ధామ (1) సం-ఆదినారాయణ రావు (5) సం-ఆదినారాయణరావు (2) సం-ఆర్.గోవర్ధనం (2) సం-ఆర్.సుదర్శనం (2) సం-ఆర్.సుదర్శనం-ఆర్.గోవర్ధనం (1) సం-ఎం.రంగారావు (1) సం-ఎల్.మల్లేశ్వరరావు (3) సం-ఎస్.పి.కోదండపాణి (11) సం-ఓగిరాల (1) సం-ఓగిరాల-అద్దేపల్లి (2) సం-ఓగిరాల-టి.వి.రాజు (4) సం-కె.ప్రసాదరావు (1) సం-కె.వి. మహదేవన్ (2) సం-కె.వి.మహదేవన్ (15) సం-గాలి పెంచల (6) సం-ఘంటసాల (78) సం-జె.వి.రాఘవులు (1) సం-జోసెఫ్-విజయాకృష్ణమూర్తి (2) సం-జోసెఫ్.వి.కృష్ణమూర్తి (1) సం-టి.ఆర్.పాప (1) సం-టి.ఎం.ఇబ్రహీం (1) సం-టి.చలపతిరావు (9) సం-టి.జి.లింగప్ప (3) సం-టి.వి.రాజు (29) సం-నాగయ్య-ఓగిరాల (1) సం-నాగయ్య-తదితరులు (1) సం-పామర్తి (5) సం-పామర్తి-సుధీర్ ఫడ్కె (1) సం-పామర్తి-సుధీర్ ఫడ్కే (1) సం-పి.శ్రీనివాస్ (1) సం-పెండ్యాల (37) సం-బాబురావు (1) సం-బాలాంత్రపు (1) సం-బి.గోపాలం (2) సం-బి.శంకర్ (1) సం-మణి-పూర్ణానంద (1) సం-మల్లేశ్వరరావు (1) సం-మాస్టర్ వేణు (11) సం-ముగ్గురు దర్శకులు (2) సం-రాజన్‌-నాగేంద్ర (2) సం-రాజు-లింగప్ప (2) సం-రాజేశ్వరరావు-హనుమంతరావు (1) సం-రామనాథన్‌ (3) సం-రామనాథన్‌-పామర్తి (1) సం-విజయా కృష్ణమూర్తి (3) సం-విశ్వనాథన్‌-రాఘవులు (1) సం-విశ్వనాథన్‌-రామ్మూర్తి (5) సం-వై.రంగారావు (1) సం-సర్దార్ మల్లిక్ - పామర్తి (1) సం-సాలూరు (44) సం-సాలూరు-గోపాలం (1) సం-సి. ఆర్. సుబ్బరామన్ (1) సం-సుదర్శనం-గోవర్ధనం (12) సం-సుబ్బయ్యనాయుడు (2) సం-సుబ్బురామన్ (1) సం-సుబ్బురామన్‍-విశ్వనాథన్ (1) సం-సుసర్ల (18) సం-హనుమంతరావు (2) సం-MSV-రామ్మూర్తి-పామర్తి (1)

మాస్టారి పాటల రచయితలు

ర-0 ర-అనిశెట్టి ర-అనిసెట్టి ర-అనిసెట్టి-పినిసెట్టి ర-ఆత్రేయ ర-ఆదినారాయణ రావు ర-ఆరుద్ర ర-ఉషశ్రీ ర-ఎ.వేణుగోపాల్ ర-కాళిదాసు ర-కాళ్ళకూరి ర-కొసరాజు ర-కోపల్లి ర-గబ్బిట ర-గోపాలరాయ శర్మ ర-ఘంటసాల ర-చేమకూర. ర-జంపన ర-జయదేవకవి ర-జాషువా ర-జి.కృష్ణమూర్తి ర-తాండ్ర ర-తాపీ ధర్మారావు ర-తిక్కన ర-తిరుపతివెంకటకవులు ర-తోలేటి ర-దాశరథి ర-దాశరధి ర-దీక్షితార్ ర-దేవులపల్లి ర-నార్ల చిరంజీవి ర-పరశురామ్‌ ర-పాలగుమ్మి పద్మరాజు ర-పింగళి ర-బమ్మెర పోతన ర-బమ్మెఱ పోతన ర-బాబ్జీ ర-బాలాంత్రపు ర-బైరాగి ర-భాగవతం ర-భావనారాయణ ర-భుజంగరాయ శర్మ ర-మల్లాది ర-ముద్దుకృష్ణ ర-రాజశ్రీ ర-రామదాసు ర-రావులపర్తి ర-రావూరి ర-వసంతరావు ర-వారణాసి ర-విజికె చారి ర-వీటూరి ర-వేణు ర-వేములపల్లి ర-శ్రీశ్రీ ర-సదాశివ బ్రహ్మం ర-సముద్రాల జూ. ర-సముద్రాల సీ. ర-సి.నా.రె. ర-సినారె ర-సుంకర-వాసిరెడ్డి ర-సుబ్బారావు రచన-ఘంటసాల రచన-దాశరధి రచన-దేవులపల్లి రచన-పానుగంటి రచన-పింగళి రచన-బలిజేపల్లి రచన-సముద్రాల సీ.