నిర్మాణం: ఆత్మా ఆర్ట్స్ చిత్రం: చిలకా - గోరింక (1966) సంగీతం: సాలూరు రాజేశ్వరరావు రచన: శ్రీశ్రీ గానం: ఘంటసాల దర్శకత్వం కె. ప్రత్యగాత్మ పల్లవి: నా రాణి కనులలోనే ఆనాటి కలలు దాగే...ఏ నా రాణి కనులలోనే ఆనాటి కలలు దాగే ఊరించు తొలిదినాలే ఈరేయి పిలువసాగే..ఏ..ఏ.. నా రాణి కనులలోనే ఆనాటి కలలు దాగే చరణం: నగుమోము చూడబోయి, నిను చేర నాటి ఈరేయీ..ఈ..ఈ నగుమోము చూడబో...ఓ..యి, నిను చేర నాటి ఈరేయీ..ఈ..ఈ నను క్రీగంటనే, కని ఆవెంటనే, చని దూరాన దాగుంటివే..ఏ..ఏ నా రాణి కనులలోనే ఆనాటి కలలు దాగే చరణం: సిగలోని మల్లెపూల, సవరించబోవు వేళా..ఆ..ఆ సిగలోని మల్లెపూ..ఊ..ల సవరించబోవు వేళ మది గిలిగింతగా, చెయి విదలించగా, ఎద నిను కోరి పులకించెనే..ఏ..ఏ నా రాణి కనులలోనే ఆనాటి కలలు దాగే చరణం: పడకింటిశయ్య చెంతా..ఆ.., నీ మేను తాకినంత పడకింటిశయ్య చెంతా..ఆ.., నీ మేను తాకినంత మన గీతాలలో, జలపాతాలలో మన గీతాలలో, జలపాతాలలో, నవరాగాలు మ్రోగేనులే..ఏ..ఏ నా రాణి కనులలోనే ఆనాటి కలలు దాగే ఊరించు తొలిదినాలే, ఈరేయి పిలువసాగే..ఏ..ఏ.. నా రాణి కనులలోనే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి