కర్ణాటకను పరిపాలించిన హొయసలుల కాలంలో శిల్పకళలకు, లలిత కళలకు, కన్నడ, సంస్కృత భాషలకు వెరసి భారతీయ సంస్కృతికి విపరీతమైన ఆదరణ లభించింది. బేలూరు, హళిబేడు, సోమనాథపురం వంటి ప్రదేశాలలో అద్భుతమైన శిల్పసంపదను చెక్కడంలో అలనాటి ప్రముఖ శిల్పి జక్కన్న పాత్ర ఎంతో ఉంది. ఈ శిల్పాలతో ప్రముఖమైనవి బేలూరు చెన్నకేశవుని ఆలయం మరియు హళిబేడులోని హొయసలేశ్వర ఆలయం.ఈ జక్కన్న జీవితం ఆధారంగా 1964 లో నిర్మించబడిన రంగుల చిత్రం అమరశిల్పి జక్కన్న. రామానుజాచార్యుల ఆదేశంతో శిలలకు ప్రాణం పోసి వాటిని అపురూపమైన శిల్పాలుగా బేలూరు, హళిబేడు ఆలయ కుడ్యాలపై చెక్కి చరిత్ర ప్రసిద్ధికెక్కాడు జక్కన్న. రామానుజాచార్యుల వారికి జక్కన తన పనితనాన్ని, శిల్పాల హావభావాలను వివరించే సన్నివేశానికి సముద్రాల రాఘవాచార్యులు వ్రాసిన చక్కని గీతం సుమధురంగా గానం చేసారు ఘంటసాల మాస్టారు. రసాలూరు సుస్వరాలను సమకూర్చారు సాలూరు రాజేశ్వర రావు.
చిత్రం: | అమరశిల్పి జక్కన్న (1964) | |||
రచన: | సముద్రాల సీనియర్ | |||
సంగీతం: | సాలూరు రాజేశ్వరరావు | |||
గానం: | ఘంటసాల | |||
పల్లవి: | మురిసేవు విరిసేవు ముకురమ్ము జూచి | |||
మరచేవు తిలకమ్ము ధరియించ నుదుట | ||||
నీ రూపుగన నీకె పారవశ్యాల | ||||
మా రాజు మనసేలు మరుని తంత్రాల | ||||
చరణం: | ఏ కాంతు దరిజేర ఏకాంత వేళ | |||
ఈ కబురు పంపేవె ఓ కీరపాణి | ||||
చిలకమ్మ కనబోవు చెలుని పేరేమె | ||||
చెలియరో నీ స్వామి చెన్న కేశవుడ | ||||
చరణం: | గోపికలు సేవించు గోపాలదేవు | |||
రూపుని మురళిని మోపి కెమ్మోవి | ||||
సరసానురాగాల స్వామిదరిజేరి | ||||
సారూప్య మోక్షమ్ము సాధింతువేమొ | ||||
చరణం: | విలు చేతబూనేవు వీరాలబాల | |||
పలికిరా ఎవరైన పరిహాస లీల | ||||
నవయౌవనము దోచి నమ్మించిరా నీ | ||||
ధవునిపై పగలూని దాడి జేసేవ | ||||
చరణం: | ఆటలను పాటలను హావ భావముల | |||
నీటులో నీసాటి నెఱజాణ నీవె | ||||
అలరింపగా నిన్ను ఆనందలీల | ||||
చెలువెఱుగు కేశవుడు చేరునీవేళ | ||||
చరణం: | కౌశికుని మది గొనిన కలికి మేనకవొ | |||
శ్రీశుకుని దరికులుకు చెలిరంభవేమొ | ||||
సరసలయ గతిచూడ స్వామి రాడమ్మ | ||||
పరమాత్ముగను దారి భక్తియేనమ్మ | ||||