కలియుగదైవమైన శ్రీ వేంకటేశ్వరుడు అర్చావతారమంటారు. లక్ష్మీవిష్ణువులను సనకసనందాదులు స్తుతిస్తున్న తరుణంలో భృగుమహర్షి వైకుంఠానికి రావడం, అతనిని నిర్లక్ష్యం చేసారన్న ఆగ్రహంతో ఆ ముని విష్ణువక్షస్థలాన్ని తన్నడం, అందుకు విష్ణువక్షస్థలవాసినియైన వైష్ణవి అలిగి భూలోకం వెళ్ళిపోవడం జరుగుతాయి. ఆమెను వెతుకుతూ వనజనాభుడు భూమిని చేరి ఒక వల్మీకంలో వసిస్తాడు. శ్రీహరికి శివుడు ధేనురూపియై పాలిస్తూండగా పశులకాపరి కొట్టినదెబ్బ శ్రీహరికి తగులగా అతడు ఆ కాపరిని పిశాచంగ అవ్వమని శపిస్తాడు. తరువాత శ్రీనివాసుడు వకుళమాత గా అవతరించిన యశోద ఇంటిని చేరుతాడు. తదుపరి ఆకాశరాజు తనయయైన పద్మావతిని గాంచి, మోహించిన శ్రీనివాసుడు కుబేరుడు చేసిన ధనసహాయంతో పద్మావతిని పరిణయమాడతాడు. ఆ దంపతులు తదుపరి అగస్త్యముని ఆశ్రమంలో ఆరు మాసములు అతిథులుగా వుంటారు. ఆకాశరాజు అనుజుడైన తొండమాన్ చక్రవర్తి ఆ దంపతుల కోసం శేషాచలంపై అందమైన 'ఆనందనిలయం' అనే భవంతి నిర్మిస్తాడు. ఇంతలో లక్ష్మీదేవి తనన పతిని వెతుక్కుంటూ వచ్చేసరికి శ్రీనివాసుడు శిలారూపుడై శ్రీ వేంకటేశ్వరుడయాడు. స్వామివారు భక్తజనకోటికి పుణ్యఫలంగా వున్నాడు.
ఆ శ్రీనివాసుని చరితాన్ని చక్కని భక్తిగీతంగా మలచారు ఎ. వేణుగోపాల్. ఏడు చరణాలున్న ఈ గీతానికి మొదటి నాలుగు చరణాలు సామ రాగంలోను తరువాతి మూడు చరణాలను మధ్యమావతిలోను ఈ రెంటిమధ్య వచ్చే "ఆనందమానందమాయెనే “ అన్న చిరపరిచితమైన జానపద బాణీని వివాహ సందర్భానికి ఆపాదిస్తూ సాంప్రదాయమైన ఆనందభైరవిలోను స్వరపరచారు ఘంటసాల మాస్టారు. ఈ రసవత్తర గీతానికి హృద్యమైన దృశ్యఖండికలతో సహజ చిత్రదృశ్యమా అన్న నేర్పరితరంతో రూపుదిద్దారు బ్యాంక్ ఆఫ్ ఘంటసాల కు చెందిన హరీష్ గారు, వారికి ధన్యవాదాలు. ఇక ఆస్వాదించండి మాస్టారి అద్భుతమైన భక్తి గీతం "జయజయ జయశ్రీ వేంకటేశా".
Video Source: Bank of Ghantasala
ప. | జయజయ జయశ్రీ వేంకటేశా! | ఆనందమానందమాయెనె | ||||
జయజయ జయ ఓం శ్రితజనపోషా! | |జయ| | పరమానందమానందమాయెనె | ||||
చ1. | సనకాది ఋషులు సన్నుతిసేయ | చ5. | కొండలపైనే తొండమానుడు | |||
లక్ష్మిదేవి నీ పాదములొత్త | ఆలయమొకటి కట్టించెనయ | |||||
భృగు కోపమున వైకుంఠమిడి | స్వర్ణశిఖరపు శేషశైలమున | |||||
భూలోకమునే జేరితివయ్యా | స్థిరనివాసివై వెలసితివయ్యా | |జయ| | ||||
చ2. | వల్మీకమున దాగియుండగా | చ6. | రమాదేవి నిను వదకుచు చేరగ | |||
రుద్రుడె గోవై పాలివ్వ | శిలారూపమున వెలసితివయ్యా | |||||
గొల్లడొకడు నీ శిరమున బాదగ | భక్తకోటికిదె నిత్య దర్శనం | |||||
ఘోర శాపమునె యిచ్చితివయ్యా | |జయ| | పాపవిమోచన పుణ్యఫలమయా | |జయ| | |||
చ3. | కానలలోన ఒంటివాడవై | వచ. | నీ మహాత్మ్యపఠనమే మహాస్తోత్రమయా, నీ | |||
తిరుగుతు వకుళను జేరితివయ్య | దివ్యనామమే కైవల్యమయా, దీనుల మము | |||||
వకుళమాతకు ముద్దుబిడ్డవై | కరుణించవయ, ఓ! వేంకటేశా!..ఆ..ఆ.. | |||||
మురిపెముతోనె పెరిగితివయ్య | |జయ| | |||||
చ7. | నమో వేంకటేశా! నమశ్శ్రీనివాసా! | |||||
వచ. | అంతనొక దినంబున పూదోటలోన ఆకాశరాజు | నమో చిద్విలాసా! నమః పరమపురుషా! | ||||
తనయ శ్రీ పద్మావతీదేవిని గాంచి, వలచి | నమో తిరుమలేశా! నమో కలియుగేశా! | |||||
వలపించితివో మహానుభావా!..ఆ..ఆ.. | నమో వేదవేద్యా! నమోవిశ్వరూపా! | |||||
నమో లక్ష్మీనాథా! నమో జగన్నాథా! | ||||||
చ4. | లోకనాథుని కల్యాణమునకు | నమస్తే, నమస్తే, నమః | ||||
కుబేరపతిని యాచించి | ఏడుకొండలవాడా! వెంకటరమణా! | |||||
ఆ కుబేరధనముతొ నీకల్యాణము | గోవిందా! గోవింద! | |||||
మహోత్సవంబుగ జరిగిందయ్య | |జయ| |