ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ప్రభ ప్రొడక్షన్సు వారు 1958 లో అంజలీ దేవి, ఎ.ఎన్.ఆర్. నాయికా నాయకులుగా నిర్మించిన చిత్రం ఆడ పెత్తనం. ఈ చిత్రంలో ఘంటసాల మాస్టారు నాలుగు పాటలు పాడారు. ఇది వరకు ఈ చిత్రంలో మహాకవి శ్రీ శ్రీ వ్రాసిన "పసిడి మెరుగుల బాలల్లారా" విన్నారు. మిగిలిన మూడు కొసరాజు గారి రచనలు. చిత్రమేమిటంటే ఈ చిత్రంలోని ఎనిమిది పాటలలో ఆరింటికి సాలూరి రాజేశ్వర రావు, రెండింటికి మాస్టర్ వేణు సంగీత దర్శకత్వం వహించారు. మాస్టారు రేలంగికి పాడిన పాటలు విలక్షణంగా వుండి అతనికే పాడారా అని అనిపిస్తుంది. మాస్టారు, గాన కోకిల సుశీల పాడిన కావు కావుమను కాకయ్యా పాటను రేలంగి, సూర్యకళలపై చిత్రీకరించారు. ఇలాటి హాస్య రస ప్రధానమైన పాటలు వ్రాయడంలో కొసరాజుది పెట్టింది పేరు.
చిత్రం: ఆడ పెత్తనం (1958)
గానం: ఘంటసాల, పి.సుశీల
రచన: కొసరాజు రాఘవయ్య చౌదరి
సంగీతం: ఎస్.రాజేశ్వరరావు
Thanks to VolgaMusicBox for uploading the video to You Tube
సుశీల: కావు కావుమను కాకయ్యా, ఈ గంతులెందుకోయ్ కాకయ్యా
నీ కథలు చెప్పవోయ్ కాకయ్యా, వెతలు తీర్చవోయ్ కాకయ్యా
నా వెతలు తీర్చవోయ్ లోకయ్యా
ఘంటసాల: మ్యావ్ మ్యావ్ మను పిల్లెమ్మా, ఒక మాట చెప్పవే పిల్లెమ్మా
మొగమాటమెందుకే పిల్లెమ్మా, సయ్యాటలెందుకే పిల్లెమ్మా
సయ్యాటలెందుకే పుల్లెమ్మా, మ్యావ్ మ్యావ్ మను
సుశీల: కావ్ కావ్ మను
సుశీల: అమ్మ పురాణం వినేందు కెళ్ళె, అయ్య పొలములో చాకిరి కెళ్ళె
ఘంటసాల: ఓ..ఓ..ఓ..ఓ..
సుశీల: ఆ..ఆ..ఆ..ఆ.. | అమ్మ |
ఒంటి దానినై పోతినిలే, నా ఓళ్ళు వణికి పోతున్నదిలే
కావ్ కావ్ మను
ఘంటసాల: మ్యావ్ మ్యావ్ మను
ఘంటసాల: ఊ అంటే అది రోకలి పోటు, సూక్ష్మంగా నా మనసుకు నాటు
సుశీల: ఓ..ఓ..ఓ..ఓ..
ఘంటసాల: ఆ..ఆ..ఆ..ఆ.. | ఊ అంటే |
మూగనోము నీకెందుకులే, నీ ఆగడమంతా తెలిసెనులే
సుశీల: కావ్ కావ్ మను
ఘంటసాల: మ్యావ్ మ్యావ్ మను
సుశీల: కావ్ కావ్ మను కాకయ్యా, ఈ గంతులెండుకోయ్ కాకయ్యా
నీ కథలు చెప్పవోయ్ కాకయ్యా, వెతలు తీర్చవోయ్ కాకయ్యా
నా వెతలు తీర్చవోయ్ లోకయ్యా
సుశీల: కంటి సైగలతొ కలత పెట్టిన, కోంటె మాటలతొ కొసరి చెప్పిన
ఘంటసాల: ఓ..ఓ..ఓ..ఓ..
సుశీల: ఆ..ఆ..ఆ..ఆ | కంటి |
అసలు రహస్యమ్ తెలియక పోయినా, అనురాగం గుర్తించవటోయ్
సుశీల: కావ్ కావ్ మను
ఘంటసాల: మ్యావ్ మ్యావ్ మను
ఘంటసాల: మన్సులోన కోరికుంది, మల్లె తీగె అడ్డముంది
సుశీల: ఓ..ఓ..ఓ..ఓ..
ఘంటసాల: ఆ..ఆ..ఆ..ఆ.. | మనసులోన |
తెంపు చేసి చూడబోతె దిక్కు తోచకున్నది
ఫక్కుమంటు నవ్వినా చిక్కు తీసి వెయ్యవే
మ్యావ్ మ్యావ్ మను
సుశీల: కావ్ కావ్ మను
ఘంటసాల: మ్యావ్ మ్యావ్ మను పిల్లెమ్మా, ఒక మాట చెప్పవే పిల్లెమ్మా
మొగమాట మెందుకే పిల్లెమ్మా, సయ్యాట లెందుకే బుల్లెమ్మా
సయ్యాట లెందుకే బుల్లెమ్మా
ఘంటసాల: మ్యావ్ మ్యావ్ మను
సుశీల: కావ్ కావ్ మను
ఘంటసాల: మ్యావ్
సుశీల: కావ్
కృతజ్ఞతలు: సమాచారం అందించిన ఘంటసాల గళామృతము - పాటల పాలవెల్లి బ్లాగుకు మరియు వికిపీడియా బ్లాగుకు.
కృతజ్ఞతలు: సమాచారం అందించిన ఘంటసాల గళామృతము - పాటల పాలవెల్లి బ్లాగుకు మరియు వికిపీడియా బ్లాగుకు.