సుప్రసిద్ధ రచయిత్రి ఆరెకపూడి (కోడూరి) కౌసల్యాదేవి రచించిన నవల ఆధారంగా సురేష్
మూవీస్ రామానాయుడు తెలుగు, తమిళ, హిందీ భాషలలో నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ప్రేమనగర్.
సినిమా మొత్తం ప్రతి మాటలోను, ప్రతి పాటలోను, వెరసి ప్రతి కోణం లోను ఆత్రేయ కనిపిస్తాడు.
తాగుబోతు నిజమే చెప్తాడన్నట్లు, “పైకి కనిపించే రంగులనీ భ్రమలని, మనచుట్టూ స్నేహితుల
పేరుతో తిరిగే పలువురు అవకాశవాదులని, డబ్బున్నంతకాలమే వారు మనతో వుంటారని, తన చర్యలకు
ప్రతి చర్యలు చేసే లోకంతో పనేముందని” అంటూ జల్సాగా, జులాయిగా తిరిగే జమిందారు బిడ్డ
కళ్యాణ్ నోట పచ్చి నిజాలు పలికిస్తాడు. ఆకాశంలో వుండే తను భూమ్మీదకు నిలకడ కోసం వచ్చానని,
తన చుట్టూ తిరిగే అమ్మాయిలు బొమ్మలని, పాత్రోచితమైన సంభాషణలతో చిత్రం ఆద్యంతము ఇది
ఆత్రేయ డామినేట్ చేసిన చిత్రం ప్రేమనగర్. దానికి తోడు ట్యూనిచ్చి పాట వ్రాయమనే నిబంధనలు
పెట్టక, కవికి స్వేచ్ఛనిచ్చి, మన’సుకవి సాహిత్యానికి విలువనిచ్చి, కవియిచ్చిన సాహిత్యం
కళ్ళకద్దుకుని, అందులో ఆంగ్ల పదాలు వున్నా, విసుగు చెందక, అధైర్య పడక, సంగీత సరిగమలు
సంధించి, అద్భుతమైన బాణీలు కట్టగల సమర్ధుడు మామ మహదేవన్. నవరసాలలో ఏ రసాన్నయినా, సురాపానాన్ని
బాటిల్లో నింపి ఆస్వాదించిన హీరోలాగ, తన గాత్ర వైవిధ్యంతో సులభంగా పలికించి, పండించగలిగిన ఘంటసాల
మాస్టారి వాణి ఈ చిత్రానికి ప్రాణం పోసాయి అంటే అతిశయోక్తి కాదు.
పల్లవి: | నేను పుట్టాను లోకం మెచ్చింది | ||
నేను ఏడ్చాను లోకం నవ్వింది | |||
నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది | |||
నాకింకా లోకంతో పని ఏముంది డోంట్ కేర్ | నేను పుట్టాను | | ||
చరణం: | నేను తాగితే కొందరి కళ్ళు గిరగిర తిరిగాయి | ||
నేను పాడితే అందరి నోళ్ళు వంతలు పాడాయి | నేను తాగితే | | ||
నేను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిసాయి | | నేను ఆడితే | | ||
తెల్లవారితే వెనకనజేరి నవ్వుకుంటాయి డోంట్ కేర్ | |||
హ..హ్హ..హ్హా.. డోంట్ కేర్ | |||
నేను పుట్టాను లోకం మెచ్చింది | |||
నేను ఏడ్చాను లోకం నవ్వింది | |||
నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది | |||
నాకింకా లోకంతో పని ఏముంది | |||
చరణం: | మనసును దాచేటందుకె పైపై నవ్వులు ఉన్నాయి | ||
మనిషికి లేని అందం కోసమే రంగులు ఉన్నాయి | |||
ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికె చేతులు వస్తాయి | | ఎరగక నమ్మిన | | ||
ఎదుటి మనిషికి చెప్పేటందుకె నీతులు ఉన్నాయి డోంట్ కేర్ | |||
నేను పుట్టాను లోకం మెచ్చింది | |||
నేను ఏడ్చాను లోకం నవ్వింది | |||
నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది | |||
నాకింకా లోకంతో పని ఏముంది | |||
చరణం: | మనిషిని మనిషి కలిసేటందుకె పెదవులు ఉన్నాయి | ||
పెదవులు మధురం చేసేటందుకె మధువులు ఉన్నాయి | |||
బాధలన్ని బాటిల్లో నేడే దింపేసెయ్ | | బాధలన్నీ | | ||
అగ్గిపుల్లా గీసేసెయ్ నీలో సైతాన్ తరిమేసెయ్ | |||
డ్రైవ్ ది డెవిల్ ఔట్...హ.హ్హ.. హ్హ.. | |||
ఛీర్స్ .. ఛీర్స్ .. | |||
నేను పుట్టాను లోకం మెచ్చింది | |||
నేను ఏడ్చాను లోకం నవ్వింది | |||
నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది | |||
నాకింకా లోకంతో పని ఏముంది | |||
డోంట్ కేర్ |
Thanks to harshavardhanreddy for providing the you tube video. I think he is excited to repeat the song.