1966 సంవత్సరంలో విడుదలైన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన శ్రీకృష్ణతులాభారం చిత్రం నుండి ఘంటసాలపి.సుశీల,బి.వసంత పాడిన "ఓహో మోహనరూపా" అనే ఈ బహుగళం రచన శ్రీశ్రీ, స్వరపరచినది పెండ్యాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు,జమున,కాంతారావు,అంజలీదేవి, పద్మనాభం. ఈ చిత్రానికి నిర్మాత డి. రామానాయుడు మరియు దర్శకుడు కె.కామేశ్వర రావు.
| #000 | పాట: | ఓహో మోహనరూపా |
|---|---|---|
| చిత్రం: | శ్రీకృష్ణ తులాభారం (1969) | |
| రచన: | శ్రీశ్రీ | |
| సంగీతం: | పెండ్యాల | |
| గానం: | ఘంటసాల, పి.సుశీల, బి.వసంత | |
| ఘ: | ఓహో.... మోహనరూపా, | |
| కేళీ... కలాపా కృష్ణా...ఆ..ఆ. | ||
| ఓహో మోహనరూపా కేళీ కలాపా | ||
| కృష్ణా నిను గని మురిసెను నా మనసే | ||
| ఓహో మోహనరూపా కేళీ కలాపా | ||
| కృష్ణా నిను గని మురిసెను నా మనసే | ||
| సు: | ఓఓఓ.ఓఓఓ..ఆఆఅ.... | |
| మధువులు చిందే మందహాసం | ||
| మరులూరించే వేణుగానం | ||
| మధువులు చిందే మందహాసం | ||
| మరులూరించే వేణుగానం | ||
| వినివిని పరవశనైతినిలే - 2 | ||
| బిగిబిగి కౌగిట కరగితిలే | ||
| ఓహో మోహనరూపా కేళీ కలాపా | ||
| కృష్ణా... నిను గని మురిసెను నా మనసే | ||
| ఘ: | ప్రణయారాధన వేళ బాలా | |
| పతిపూజలు నీకేల బేలా | ||
| ప్రణయారాధన వేళ బాలా | ||
| పతిపూజలు నీకేల బేలా | ||
| ఆ...వలపు చిలుకు నీ చూపులు నాపై | ||
| నిలుపవే శుభాంగీ..ఈ.., నిలుపవే లతాంగీ | ||
| వ: | ఓ...ఓహో మోహనరూపా కేళీ కలాపా కృష్ణా... | |
| నిను గని మురిసెను నా మనసే | ||
| సు: | ఓఓఓ....ఆఆఆ.... | |
| మధుర సుధా రాగమే, మదిలో కదిలే తీయగా | ||
| ఘ: | ఓఓఓఓఓ.... | |
| మధుర సుధా రాగమే, మదిలో కదిలే తీయగా | ||
| శిఖిపింఛమౌళీ నన్నేలగా | ||
| తనువే ఊగే హాయిగా | ||
| ఇ: | ఆఆఅ...ఓఓఓ..మ్మ్మ్... | |
| ఘ: | అహో లీలామానుషవేషధారీ మురారీ | |
| తనివార నినుగాంచి ధన్యతనొందితి శౌరీ | ||
| ఓహో మోహనరూపా కేళీ కలాపా | ||
| మోహనరూపా..మోహనరూపా.. |

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి