బహుళ ప్రజాదరణ పొందిన నాటకం చింతామణి. దీనిని వ్రాసిన వారు అలనాటి సంఘ సంస్కర్త, నాటక రచయిత, కవి అయిన శ్రీ కాళ్ళకూరి నారాయణరావు (1871-1927) గారు. వీరి రచనలలో వరకట్నం కు వ్యతిరేకంగా వ్రాసిన "వర విక్రయము", వేశ్యా వృత్తిని ఖండిస్తూ వ్రాసిన "చింతామణి" నాటకాలు పేరెన్నిక గన్నవి. చింతామణి నాటకాన్ని రెండు సార్లు (1933 మరియు 1956) సినిమాగా తీసారు. ఈ చిత్రంలో కవి బిల్వ మంగళుడు గా ఎన్.టి.ఆర్., అతని భార్య గా జమున, చింతామణి అనే వేశ్య పాత్రలో భానుమతి నటించారు. గుణవతియైన భార్యకుండవలసిన లక్షణాలను, అలాగే భార్యలను బాధించే కొందరు భర్తలను గురించి బిల్వ మంగళుడు ఈ విధంగా వివరిస్తాడు.
కృతజ్ఞతలు: యూ ట్యూబ్ వీడియో సమర్పించిన శ్రీ హరీష్ (Bank of Sri Ghantasala, Machilipatnam, A.P.)
చిత్రం: చింతామణి (1956)
మూలం: చింతామణి నాటకము
రచన: కాళ్ళకూరి నారాయణ రావు
గానం: ఘంటసాల వెంకటేశ్వర రావు
గానం: ఘంటసాల వెంకటేశ్వర రావు
సంగీతం: అద్దేపల్లి రామారావు, టి.వి.రాజు
సంగీత పర్యవేక్షణ: పి.భానుమతి
| పద్యం: |
కష్ట భరితంబు బహుళ దుఃఖప్రదంబు
|
సారరహితంబునైన సంసారమందు
| |
భార్యయను స్వర్గమొకటి కల్పనము చేసె
| |
పురుషులనిమిత్తము పురాణ పూరుషుండు
| |
| ఆ.. ఆ.. ఆ.. | |
| వచనం: |
భార్యలను కష్టాల పెట్టె భర్తలు మాత్రం లేరా అని కదూ, యెందుకు లేరు
|
| పద్యం: |
అర్ధాంగ లక్ష్మియైనట్టి యిల్లాలిని తమయింటి దాసిగా తలచువారు
|
| చూడు.. | |
అర్ధాంగ లక్ష్మియైనట్టి యిల్లాలిని తమయింటి దాసిగా తలచువారు
| |
చీటికి మాటికి చిరబురలాడుచు పెండ్లాము నూరక యేడ్పించువారు
| |
పడపుగత్తెల ఇండ్ల బానిసెంచై ధర్మపత్ని యన్నను మండిపడెడివారు
| |
బయట నెల్లరచేత పడివచ్చి యింటను పొలతినూరక తిట్టి పోయువారు
| |
పెట్టుపోతల పట్లగలట్టి లోటు తిట్టుకొట్టులతోడను తీర్చువారు
| |
| ఖలులు, కఠినులు, హీనులు, కలుషమతులు కలరు పురుషులలోన పెక్కండ్రు నిజము |
