చిత్రం: గృహప్రవేశం (1946)
పాట: మారుతుందోయ్ ధర్మము
గానం: ఘంటసాల
సంగీతం: నళినీకాంత్
రచన: బాలాంత్రపు రజనీకాంత రావు
1946 లో విడుదలైన చిత్రం ఇంకా చూడటానికి దొరుకుతున్నదీ అంటే అది అంతర్జాల మహిమ. ఈ చిత్రంలో భానుమతి, ఎల్.వి. ప్రసాద్ లు నాయికా నాయకులుగా నటించారు. సంఘ సంస్కరణల పై తీసిన చిత్రం ఇది. సవతి తల్లి బలవంతంగా నచ్చని వాడితో పెళ్లి జరపడానికి సిద్ధపడితే తన తల్లి చెప్పిన "మన ప్రయత్నం మనం చెయ్యాలి. ఫలితం ఏమైనా సరే" మాటలను స్ఫూర్తిగా తీసుకుని ఇల్లు వదలి ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని ఆఖరులో తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటుంది కధానాయిక. ఇందులో హీరో ఎల్.వి. ప్రసాద్ (అక్కినేని లక్ష్మీ వర ప్రసాద రావు) కాగా, ఊహించలేని పాత్రలో భానుమతి వెంటపడి పెళ్లి చేసుకోమని అల్లరి చేసే తుంటరి సి.ఎస్.ఆర్. ఇందులో ఘంటసాల మాస్టారు పాడినది ఒకటే పాట. అది ఒక బైరాగి పాడతాడు. ఎప్పటికైనా సమాజం మారుతుందనే ఆశాభావంతో "మారుతున్దోయ్ ధర్మమూ" అనే పాటను శ్రీ బాలాంత్రపు రజనీకాంత రావు గారు వ్రాసారు. సంగీతం "నళినీ కాంత్" అని సూచించ బడినా అది కూడా వారి మారు పేరే. ఈ సినిమాను క్రింది లింకులో వీక్షించ వచ్చును.
ప. మారుతుందోయ్ ధర్మము
మారుతుందోయ్ ధర్మము
చ. యుగ యుగమ్ముల లోక వర్తన తగిన రీతిని మారుతుంటే
యుగ యుగమ్ముల లోక వర్తన తగిన రీతిని మారుతుంటే
నీవు నేను సంఘమైతే నియమముగ ఒక సమ్మతైతే
నీవు నేను సంఘమైతే నియమముగ ఒక సమ్మతైతే
మారుతుందోయ్ ధర్మము
చ. కళ్ళు తెరవని నాడె బాలల పెళ్ళియని శాసించు ధర్మం
కళ్ళు తెరవని నాడె బాలల పెళ్ళియని శాసించు ధర్మం
భర్తనెరుగని బాల విధవకు పెళ్ళి తగదను క్రూర ధర్మం
భర్తనెరుగని బాల విధవకు పెళ్ళి తగదను క్రూర ధర్మం
మారుతుందోయ్ ధర్మము
మారుతుందోయ్ ధర్మము