అందరికీ చిరపరిచితమైన "శమంతకోపాఖ్యానం" ఆధారంగా 1957 లో నిర్మించబడిన చిత్రం "వినాయక చవితి". ఇందులో శ్రీకృష్ణునిగా ఎన్.టి. రామారావు, రుక్మిణిగా కృష్ణ కుమారి, సత్యభామగా జమున, సత్రాజిత్తు గా గుమ్మడి నటించారు. మాటలు, పాటలు, దర్శకత్వం శ్రీ సముద్రాల రాఘవాచార్య (సముద్రాల సీనియర్). ఘంటసాల గారి సంగీత దర్శకత్వంలో తయారైన ఈ చిత్రంలో ముత్తుస్వామి దీక్షితార్ రచించిన, హంసధ్వని రాగంలో కూర్చిన "వాతాపి గణపతిం భజే" టైటిల్స్ వేసే నేపథ్యంలో వినిపిస్తుంది. అయితే దీక్షితార్ గారి కృతిలో "త్రికోణ" కు బదులు "త్రిభువన" అని, "నిటిల" కు బదులు "నిఖిల" అని సినిమా పరంగా స్వల్పమార్పు చేసివుంటారను కుంటాను. బహుళ ప్రచారం పొందిన "దినకరా శుభకరా" కామవర్ధిని రాగంలో మరొక అద్భుతమైన పాట. ఇందులో మాస్టారు పాడిన కొన్ని పద్యాలు సాహిత్యంతో ఇక్కడ పొందుపరచడమైనది. ఈ చిత్రంలో ఇతర గాయనీ గాయకులు - ఎం.ఎస్.రామారావు, పి. లీల, పి. సుశీల, ఎ.పి.కోమల.
చిత్రం: వినాయకచవితి (1957)
సంగీతం: ఘంటసాల
వినాయక చవితి సినిమాను క్రింది లింకులో చూడవచ్చును.
వినాయకచవితి చిత్రంశుక్లాంబరధరం విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్
ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశమ్
అనేక దమ్ తమ్ భక్తానామ్ ఏక దంతముపాస్మహే
ఏక దంతముపాస్మహే
తొండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్!
గణాధిప నీకు మ్రొక్కెదన్!
ఆ...ఆ...ఆ..
ప్రాతఃకాలే భవేత్ బ్రహ్మా
మధ్యాహ్నేతు మహేశ్వరః
సంధ్యాకాలే మహావిష్ణుః
త్రిమూర్తిస్తు దివాకరః
జయాయ జయ భద్రాయ హర్యస్వ్యాయ నమో నమః
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః
ఆ...ఆ..
అరుణాయ శరణ్యాయ కరుణారస సింధవే
అసమాన బలాయ ఆర్త రక్షకాయ నమో నమః నమో నమః
ఆదిత్యాయ ఆదిభూతాయా...
అఖిలాగమ వేదినే అచ్యుతాయ అఖిలజ్ఞాయ
అనంతాయ నమో నమః నమో నమః
ఆ నళినాక్షి అందముల చందము దిద్దెడి బోటి
విద్యలన్ వాణికి ధీటుగా నిలచి పంతములాడెడు మేటి
నీ పద ధ్వానములోన దేవతలకైనను పోటీ
జగత్రయంబునన్ గానము సత్యభామకు ఎనగాదగు భామను నందనందనా
ఆ.ఆ..ఆ..ఆ..
జగదేక రంభయే అగుగాక మగువకు అణకువే మాయని అందమమ్మా
చదువులలోన శారదయైన చెలువకు శీలమే సంస్కృతి చిహ్నమమ్మ
అల కుబేరుని పుత్రియైనను రమణికి పతిసేవయే మహాభాగ్యమమ్మ
దేవాదిదేవుని దేవియైనను స్త్రీకి త్యాగమే తారకయోగమమ్మ
భక్తి, వినయ వివేక సంపత్తి త్యాగశక్తి గల అన్నుమిన్నయే జగములోన
మగని రంజించి ప్రేమ సామ్రాజ్య సీమలేలెనో సత్యభామ భామాలలామ