| నిర్మాణం: | జగపతి వారి | |
| చిత్రం: | ఆరాధన (1962) | |
| రచన: | ఆరుద్ర | |
| సంగీతం: | ఎస్.రాజేశ్వర రావు | |
| గానం: | ఘంటసాల, సుశీల | |
| పల్లవి: | సుశీల: | ఒహొహొ మావయ్యా! ఇదేమయ్యా బలెబలె బాగా ఉందయ్యా |
| ఒహొహొ మావయ్యా! ఇదేమయ్యా బలెబలె బాగా ఉందయ్యా | ||
| ఇంటిని విడిచి షికారు కొడితే, ఎంతో హాయి కలదయ్యా | ||
| ఘంటసాల: | ఒహొహొ అమ్మాయీ! ఇది కాలేజీ, బలెబలె బతికిన కాలేజి | |
| ఒహొహొ అమ్మాయీ! ఇది కాలేజీ, బలెబలె బతికిన కాలేజి | ||
| మాటలురాని మృగాలు కొన్ని మనిషికి పాఠం చెబుతాయి | ||
| చరణం: | సుశీల: | పులులూ, చిరుతలు, సింహాలన్ని వెలుపల తిరిగిన ప్రమాదమే |
| ఓ మావయ్యా…మావయ్యా | ||
| ఘంటసాల: | కొందరు ఘరాన మనుషులకన్న కౄరము కావీ జంతువులు | |
| ఓ అమ్మాయీ, అమ్మాయీ | ||
| క్రౌర్యము పెరిగిన మనిషిని మృగాన్ని కటకటాలలో పెడతారు | ||
| సుశీల: | ఒహొహొ మావయ్యా! ఇదేమయ్యా బలెబలె బాగా ఉందయ్యా | |
| చరణం: | ఘంటసాల: | గుఱ్ఱపు హంశం, గాడిద వంశం చారల చారల జీబ్రావి |
| చుక్కల జిరాఫి ఒంటెకు బంధువు, మనిషికి బంధువు చింపంజీ | ||
| మనిషి చేష్టలు కొందరికుంటే | ||
| సుశీల: | కోతి చేష్టలు కొందరివి | |
| ఘంటసాల: | హా… | |
| సుశీల: | హహ్హహ్హహ్హ | |
| ఘంటసాల: | ఒహొహొ అమ్మాయీ! ఇది కాలేజీ, బలెబలె బతికిన కాలేజి | |
| చరణం: | సుశీల: | నీరున తిరిగే, నోరును తెరిచే ఏనుగులాంటిది ఏమిటది? |
| ఓ మావయ్యో మావయ్యా | ||
| ఏనుగు వంటిది నీటి మృగము, దానికి తమ్ముడు ఖడ్గమృగం | ||
| అధికులు పేదల కాల్చుకు తింటే ఇవి ఆకు అలమే తింటాయి | ||
| సుశీల: | ఒహొహొ మావయ్యా! ఇదేమయ్యా బలెబలె బాగా ఉందయ్యా | |
| చరణం: | సుశీల: | రాజులు ఎక్కే అంబారీపై అందరు ఎక్కుట తప్పుకదా! |
| ఘంటసాల: | రోజులు మారాయ్, రాజులు పోయి ప్రజలే ప్రభువులు ఈనాడు | |
| సుశీల: | ఆహా.. | |
| ఘంటసాల: | ప్రజలే ప్రభువులు ఈనాడు | |
| మనుషులపైన సవారి కన్నా ఏనుగు సవారి నయం కదా! | ||
| సుశీల: | ఆ..నిజం నిజం | |
| ఘంటసాల: | అహ మజా మజా | |
| సుశీల: | ఓ మావయ్యా ఇదేమయ్యా, బలె బలె బాగా ఉందయ్యా | |
| ఘంటసాల: | ఒహొహొ అమ్మాయీ! ఇది కాలేజీ, బలెబలె బతికిన కాలేజి | |
గానం గాంధర్వం, గాత్రం అనన్యసాధ్యం, భావం అసాధారణం, భాష అతి సుందరం, ఉచ్చారణ సుస్పష్టం, అనుభూతి చర్విత చర్వణం.
19, జనవరి 2018, శుక్రవారం
ఒహొహొ మావయా ఇదేమయ్యా - ఆరాధన నుంచి ఘంటసాల, సుశీల
16, జనవరి 2018, మంగళవారం
అనాఘ్రాతం పుష్పం - కాళిదాస శ్లోకం శకుంతల చిత్రం నుండి ఘంటసాల గళంలో
| నిర్మాణం: | రాజ్యం వారి | |
| చిత్రం: | శకుంతల (1966) | |
| రచన: | మహాకవి కాళిదాసు | |
| సంగీతం: | ఘంటసాల | |
| గానం: | ఘంటసాల | |
| ఘంటసాల: | అనాఘ్రాతం పుష్పం కిసలయమలూనం కరరుహైః | |
| అనావిద్ధం రత్నం మధు నవమనాస్వాదిత రసమ్ | | ||
| అఖండం పుణ్యానాం ఫలమివ చ తద్రూపమనఘం | ||
| న జానే భోక్తారం కమిహ సముపస్థాస్యతి విధిః ||2-10|| |
ప్రతిపదార్థముః
అనాఘ్రాతం = ఎవరూ వాసన చూడని; పుష్పం = పువ్వు; కరరుహైః = గోళ్లచేత; అలూనం = తుంచబడని / కోయబడని; కిసలయం = లేత చిగురుటాకు; అనావిద్ధం = తొలచబడని / రంధ్రము చేయబడని; రత్నం = మణి (రత్నము); నవం = క్రొత్తదైన; అనాస్వాదిత రసమ్ = రుచి చూడబడని తేనె కలిగిన; మధు = మకరందము (తేనె); అఖండం = ఏ లోటు లేని / పరిపూర్ణమైన; పుణ్యానామ్ = పుణ్యముల యొక్క; ఫలమ్ ఇవ చ = ఫలము వలెనే; అనఘమ్ = పాపము/దోషము లేని పవిత్రమైన; తత్ రూపమ్ = ఆ శకుంతల యొక్క రూపము (సౌందర్యము); ఇహ = ఈ లోకంలో / ఈ విషయంలో; విధిః = బ్రహ్మ (విధాత); కమ్ భోక్తారమ్ = ఏ అనుభవించే వ్యక్తిని; సముపస్థాస్యతి = తెచ్చి ప్రవేశపెడతాడో (ఎవరికి అనుగ్రహిస్తాడో); న జానే = నేను ఎరుగను (నాకు తెలియడం లేదు).
తాత్పర్యముః
ఆ శకుంతల దోషరహితమైన, పవిత్రమైన రూపం
ఎవరూ వాసన చూడని పువ్వు లాంటిది;
గోళ్లతో ఏమాత్రం తుంచబడని లేత చిగురుటాకు లాంటిది; రంధ్రం చేయబడని
అమూల్యమైన రత్నం లాంటిది; రుచి
చూడబడని నూతన మకరందం లాంటిది;
పూర్వజన్మల పరిపూర్ణ పుణ్యఫలం లాంటిది. అటువంటి అత్యంత పవిత్రమైన సౌందర్య
రాశిని అనుభవించే అదృష్టం ఏ పుణ్యాత్ముడికి విధి (దైవం) ప్రసాదిస్తాడో నాకు
తెలియడం లేదు.
15, జనవరి 2018, సోమవారం
స్వార్ధకామాంధులై జగమెల్ల - శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ నుండి ఘంటసాల పద్యం
| శ్రీ శంభు ఫిలింస్ | ||
| చిత్రం: | శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ (1966) | |
| రచన: | పింగళి | |
| సంగీతం: | పెండ్యాల | |
| గానం: | ఘంటసాల | |
| ఘంటసాల: | స్వార్ధకామాంధులై జగమెల్ల కబళించు రాక్షసులవనిపై బ్రతుకజనునే | |
| మతపిశాచావేశ మహిమచే లోకాలపీడించు శతులు జీవించనౌనే | ||
| స్త్రీ, బాల, వృద్ధుల చిత్రహింసలు చేయు ఉన్మత్తులకు ధర ఉనికి తగునే | ||
| దుర్గుణోద్ధతి ప్రజాద్రోహమ్ముగావించు దుండగులీధర నుండుటెటుల | ||
| పరమఘోర కిరాత ముష్కరులు వద్ధులగుట ఎవ్వరు ఒక్క కన్నీటిబొట్టునైన | ||
| విడువగరాని ఆ అధమజాతి ఖలుడు వీనికి దుర్మృతికలిగెనిటుల |

