శ్రీ సారధీ స్టూడియోస్ వారు 1961 లో తాపీ చాణక్య దర్శకత్వంలో నందమూరి తారక రామారావు, సావిత్రి జంటగా నటించిన చిత్రం కలసివుంటే కలదు సుఖం నిర్మించారు. ఈ చిత్రంలో మాస్టారు చాలపాటలు పాడారు. అయితే అందులో 'నావరాల తండ్రీ నీవేల పుడితివి' మరియు 'ముద్దబంతి పూలు పెట్టీ మొగిలి రేకులు జడను చుట్టి' మనం బాగా విన్నవి. ఈ చిత్రానికి సంగీతం మాస్టర్ వేణు (మద్దూరి వేణుగోపాల్) అందించారు. వేణు బొంబాయిలోని స్కూల్ ఆఫ్ మ్యూజిక్ లో హార్మోనియం మరియు ఇతర వాద్యాలు నేర్చుకున్నారు. ఆయనకు ఇచ్చిన డిగ్రీ 'మాస్టర్'. అదే అతని పేరు ముందు చేరి అతను మాస్టర్ వేణు అయ్యారు. ముద్దబంతి పూలు పెట్టి పాటకు ముందువచ్చే తందరాన తాననానా అనే ఆలాపనను ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎస్. విశ్వనాథన్ (మాన్యాంగత్ సుబ్రమణియన్ విశ్వనాథన్) ఆలపించారు. వ్యంగగీతాలైనా, యుగళగీతాలైనా అందులో చక్కని సందేశాన్ని నింపి మనకు అందించిన ప్రఖ్యాత సినీ గేయ రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరి. పుట్టింటినుండి అత్తవారింటికి వచ్చే ఆడపడుచు తీసుకు రావలసినవి అభిమానం, మర్యాదలే కాని మరే రకమైన అరణాలు, ఆభరణాలు కావని, అలాగే కథానాయకునికి అంగవైకల్యం అనేది పట్టించుకోవలసిన విషయం కాదు గుణం ముఖ్యం కాని రూపం కాదు అని ఈ చక్కని పాట ద్వారా తెలిపారు కొసరాజు గారు.
Thanks to TeluguOne for up loading the Video to You Tube
ఒక పాట వెనుక ఎందరి కృషి ఉందో కద!
చిత్రం:
కలసివుంటే కలదు సుఖం (1961)
రచన:
కొసరాజు
సంగీతం:
మాస్టర్ వేణు
గానం:
ఘంటసాల, పి.సుశీల, ఎం.ఎస్.విశ్వనాథన్ (ఆలాపన)
దర్శకత్వం:
తాపీ చాణక్య
ఆలాపన:
ఎం.ఎస్.వి.
తందనాన తాననానా..ఆ..ఆ,
తందరారరారరారా...ఆ..ఆ..
తానే తందరనన్నే...ఓ..తానారె నందనన్నా.ఆ..ఆ...తారారిరో..ఓ..
పల్లవి:
ఘంటసాల:
ముద్దబంతి పూలు పెట్టి మొగలిరేకులు జడను జుట్టి
సుశీల:
జడను చుట్టి
ఘంటసాల:
హంసలా నడిచి వచ్చే చిట్టెమ్మా..ఆ..ఆ..
సుశీల:
చిట్టెమ్మా..ఆ..
ఘంటసాల:
మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా..
సుశీల:
చెప్పమ్మా..
ఘంటసాల:
ముద్దబంతి పూలు పెట్టి మొగలిరేకులు జడను జుట్టి
హంసలా నడిచి వచ్చే చిట్టెమ్మా.. మా ఇంటికేమి తెచ్చావమ్మా
చెప్పమ్మా
సుశీల:
అద్దమంటి మనసు ఉంది అందమైనా వయసు ఉంది
ఘంటసాల:
వయసు ఉంది..
సుశీల:
ఇంతకన్న ఉండేదేంది కిట్టయ్యా
ఘంటసాల:
కిట్టయ్యా..
సుశీల:
ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా
ఘంటసాల:
చెప్పయ్యా..
సుశీల:
అద్దమంటి మనసు వుంది అందమైనా వయసు వుంది
ఇంతకన్న ఉండేదేంది కిట్టయ్యా.. ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది
చెప్పయ్యా
ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com