1972 సంవత్సరంలో విడుదలైన త్రివేణి ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన బడిపంతులు చిత్రం నుండి ఘంటసాల పాడిన "ఎడబాటెరుగని పుణ్యదంపతుల" అనే ఈ ఏకగళగీతం రచన దాశరథి, స్వరపరచినది కె.వి. మహదేవన్. ఈ చిత్రం లో తారాగణం ఎన్.టి. రామారావు, అంజలీదేవి,నాగయ్య, రాజబాబు, కృష్ణంరాజు. ఈ చిత్రానికి నిర్మాత పి.పేర్రాజు మరియు దర్శకుడు పి.చంద్రశేఖరరెడ్డి. దీనిని నేపథ్యగానం గా చిత్రీకరించారు.
| M#611 | S#01 | ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల |
| | చిత్రం: | బడి పంతులు (1972) |
| | రచన: | దాశరథి |
| | సంగీతం: | కె.వి.మహదేవన్ |
| | గానం: | ఘంటసాల |
| సాకీ: | ఘం: | చిన్నబోయింది కైలాసం - శివపార్వతుల నివాసం |
| ప: | ఘం: | ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల విడదీసింది విధి నేడు |
| | | ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల విడదీసింది విధి నేడు |
| | | తోడు నీడగా వుండే వయసున గూడు విడిచి వేరైనారు |
| | | గూడు విడిచి వేరైనారు |
| | | ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల విడదీసింది విధి నేడు |
| | | |
| చ: | ఘం: | జంటను వీడిన ఒంటరి బ్రతుకై జాలిగ కుమిలేరు |
| | | జంటను వీడిన ఒంటరి బ్రతుకై జాలిగ కుమిలేరు |
| | | ఎదలోదాగిన మూగ వేదన ఎవరికి చెప్పేరు |
| | | ఎలా భరించేరు |
| | | ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల విడదీసింది విధి నేడు |
| | | |
| చః | ఘం: | ఒకే తనువుగ ఒకే మనువుగా ఆ దంపతులు జీవించారు |
| | | ఒకే తనువుగ ఒకే మనువుగ ఆ దంపతులు జీవించారు |
| | | ఆస్తిపాస్తివలె అన్నదమ్ములు ఆ తలిదండ్రుల పంచారు |
| | | ఆ తలిదండ్రుల పంచారు |
| | | ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల విడదీసింది విధి నేడు |
| | | తోడు నీడగా వుండే వయసున గూడు విడిచి వేరైనారు |
| | | గూడు విడిచి వేరైనారు |
కృతజ్ఞతలు : చిత్రంలోని పాటల వివరాలను "ఘంటసాల గళామృతము" బ్లాగ్ ద్వారా అందించిన శ్రీ కొల్లూరు భాస్కరరావు గారికి, సాహిత్యాన్ని"శతాబ్దిగాయకుడు ఘంటసాల" పుస్తకము ద్వారా అందించిన శ్రీ చల్లా సుబ్బారాయుడు గారికి హృదయపూర్వక నమస్కారములు.
ఘంటసాల గానపదసూచిక (HOME)