21, ఏప్రిల్ 2012, శనివారం

ప్రియురాల సిగ్గేలనే - శ్రీకృష్ణ పాండవీయం నుండి ఘంటసాల, సుశీల పాడిన మధుర గీతం

శ్రీకృష్ణ పాండవీయం (1966) చిత్రంలో ఘంటసాల మాస్టారు రెండు పాటలు, కొన్ని పద్యాలు పాడారు. ఇదివరకు పోస్టులో మరొక మధుర గీతం "మత్తు వదలరా నిద్దుర" మరియు "వచ్చెద విదర్భ" అనే పద్యం ఇదివరలో పోస్టు చేసాను.  ఘంటసాల గారు కృష్ణుని పై పాడిన శృంగార యుగళ గీతాలలో మరొక చక్కని పాట "ప్రియురాల సిగ్గేలనే". ఈ పాట కృష్ణుడు (ఎన్‌.టి.ఆర్.) రుక్మిణి (కె.ఆర్.విజయ) లపై చిత్రీకరించారు. బహుశ శ్రీమతి కె.ఆర్.విజయకు ఇది తొలి తెలుగు చిత్రం అనుకుంటాను. ఈ చిత్రంలో రుక్మిణి సోదరుడు రుక్మి గా శ్రీ కైకాల సత్యనారాయణ గారు నటించారు.  శ్రీ సముద్రాల రాఘవాచార్యుల రచన.ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించినది శ్రీ టి.వి.రాజు (తోటకూర వెంకట రాజు) గారు. ఈయన చాల పౌరాణిక చిత్రాలకు సంగీతాన్ని అందించారు. వీరి కుమారుడు రాజ్-కోటి జంటలోని రాజ్ (తోటకూర సోమరాజు). ఈ చిత్రం రామారావు గారి స్వీయ దర్శకత్వ చిత్రం, నిర్మాత వారి సోదరుడు శ్రీ త్రివిక్రమరావు గారు.




చిత్రం :   శ్రీకృష్ణపాండవీయం
గానం :   ఘంటసాల, పి.సుశీల
సంగీతం: టి.వి.రాజు 
రచన:    సముద్రాల రాఘవాచార్య 



పల్లవి: ఘంటసాల: ప్రియురాల సిగ్గేలనే? .. ఏ.. ఏ..


ప్రియురాల సిగ్గేలనే? నీ మనసేలు మగవాని జేరి


ప్రియురాల సిగ్గేలనే?

సుశీల: నాలోన ఊహించినా..ఆ..ఆ.. నాలోన ఊహించినా 


కలలీనాడు ఫలియించె స్వామీ.. ఈ..ఈ..


నాలోన ఊహించినా




చరణం: ఘంటసాల: ఏమీ ఎరుగని గోపాలునికి ప్రేమలేవో నేరిపినావు | ఏమీ ఎరుగని |


మనసుదీర పలుకరించి మా ముద్దు ముచ్చట చెల్లించవే 


ప్రియురాల సిగ్గేలనే? ..ఏ.. ఏ.. ప్రియురాల సిగ్గేలనే? 




చరణం: సుశీల: ప్రేమలు తెలిసిన దేవుడవని విని నా మదిలోనా కొలిచితిని  | ప్రేమలు తెలిసిన |


స్వామివి నీవని తలచి నీకే, బ్రతుకు కానుక చేసితిని


నాలోన ఊహించినా..ఆ..ఆ.. నాలోన ఊహించినా 


కలలీనాడు ఫలియించె స్వామీ.. ఈ..ఈ..


నాలోన ఊహించినా




చరణం: ఘంటసాల: సమయానికి తగు మాటలు నేర్చిన సరసురాలవే ఓ! భామా  | సమయానికి |


ఇపుడేమన్నా ఒప్పునులే ఇక ఎవరేమన్నా తప్పదులే 


ప్రియురాల సిగ్గేలనే? .. ఏ.. ఏ..


ప్రియురాల సిగ్గేలనే? నీ మనసేలు మగవాని జేరి


ప్రియురాల సిగ్గేలనే?

కృతజ్ఞతలు:  చిత్రం యొక్క సాంకేతిక వివరాలు అందించిన ఘంటసాల గళామృతము పాటల పాలవెల్లి బ్లాగుకు, యూ ట్యూబ్ వీడియో పొందుపరచిన Teluguone, ఇతర వివరాలు పొందుపరచిన వికిపీడియా వారికి  హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ బ్లాగులో ప్రచురించిన ఛాయాచిత్రాలు, ఆడియో మరియు వీడియో ఫైళ్ళు అన్నియు సేకరించినది శ్రోతల ఆనందానికే తప్ప వాణిజ్య నిమిత్తం కాదని గమనించగలరు.

20, ఏప్రిల్ 2012, శుక్రవారం

చల్లగ చూడాలి పూలను - పెళ్ళినాటి ప్రమాణాలు నుంచి


పెళ్ళి నాటి ప్రమాణాలు (1958) చిత్రానికి ఘంటసాల మాస్టారు సంగీత దర్శకత్వం వహించారు. చక్కని ప్రేమకథ ఇది. పెళ్ళికి ముందు చేసుకున్న వాగ్దానాలు పెళ్ళి అయిన తరువాత తప్పితే ఎలావుంటుందో ఆ సంసారం అన్న కధాంశం పై ఎ.ఎన్‌.ఆర్., జమున జంటగా నటించిన చిత్రమిది. చాల మంచిపాటలు పింగళి నాగేంద్ర రావు గారి కలం నుండి జాలువారాయి. మాస్టారు మూడు యుగళ గీతాలు శ్రీమతి పి.లీల గారితోను, ఒక ఏక గళ గీతము పాడారు. ఈ పోస్టులో మాస్టారి ఏకగళ గీతం "చల్లగ చూడాలి పూలను" దృశ్య, శ్రవణ, సాహిత్యాలతో అందిస్తున్నాను. మాస్టారి పాటకు ముందు అక్కినేని కూని రాగంతో నుయ్యి దగ్గర స్నానం చేస్తూ పాడతారు. 


చిత్రం: పెళ్ళినాటి ప్రమాణాలు (1958)

రచన: పింగళి నాగేంద్రరావు

సంగీతం: ఘంటసాల 

గానం: ఘంటసాల 





సాకీ: కావనగానే సరియా


ఈ పూవులు నీవేగా.. దేవీ..

పల్లవి: చల్లగ చూడాలీ పూలను అందుకు పోవాలి దేవీ..


చల్లగ చూడాలీ పూలను అందుకు పోవాలి


మల్లె సుగంధం మనసున జల్లి మళ్ళీ అల్లరి తగునా..


చల్లగ చూడాలీ పూలను అందుకు పోవాలి





చరణం: మలయానిలముల లాలన వలెనే


వలపులు హాయిగ కురిసీ.. | మలయానిలముల |


కలికి చూపులను చెలిమిని విరిసి 


చిలిపిగ దాగుట న్యాయమా? ..


చల్లగ చూడాలీ పూలను అందుకు పోవాలి





చరణం: తెలి మబ్బులలో జాబిలి వలెనే


కళకళ లాడుచు నిలిచీ.. | తెలి మబ్బులలో |


జిలిబిలి సిగ్గుల పిలువక పిలిచి 


పలుకక పోవుట న్యాయమా?..


చల్లగ చూడాలీ పూలను అందుకు పోవాలి


మల్లె సుగంధం మనసున జల్లి మళ్ళీ అల్లరి తగునా..


చల్లగ చూడాలీ పూలను అందుకు పోవాలి

Sincere thanks to  Ghatasala Galamrutamu Patala Palavelli for providing useful information.

19, ఏప్రిల్ 2012, గురువారం

పరవశింపజేసే ప్రణయ గీతం - తెలియ వశమా పలుక గలమా - కీలు గుఱ్ఱం నుండి

1949 లో విడుదలైన చిత్రం కీలు గుఱ్ఱం. ఈ జానపద చిత్రంలో ప్రసేనుడనే మహారాజు (ఏ.వి.సుబ్బారావు) వేటకు వెళ్ళి ఒక భువన సుందరిని (అంజలీదేవి) ని వెంటబెట్టుకొస్తాడు. నిజానికి ఈ సుందరి ఒక రాక్షసి. రాత్రి పూట రాజుగారి ఏనుగులను ఆరగిస్తుంటుంది. ఆ సుందరి మాయలో పడిపోతాడు రాజు.  ప్రసేన మహారాజు, భువనసుందరి లపై చిత్రించిన పాట "తెలియ వశమా! పలుక   గలమా!" అనే ప్రేమ గీతం. ఇందులో రాజు పెద్ద భార్య కొడుకుగా ఎ.ఎన్‌.ఆర్. నటించారు. ఈ చిత్రానికి ఘంటసాల గారి సంగీతం. మాస్టారితో శ్రీమతి సి.కృష్ణవేణి పాడిన యుగళ గీతం అంజలీదేవి ప్రసేన మహారాజు పై చిత్రీకరించారు. కృష్ణవేణి గారు ఈ చిత్ర నిర్మాత ఐన మీర్జాపురం రాజా (మేకా రంగయ్య) గారి సతీమణి. ఈవిడ గాయని, నటి, మరియు నిర్మాత. ఈ పాట రచన చేసినది శ్రీ తాపీ ధర్మారావు నాయుడు గారు. ఈయన చాల చిత్రాలకు సంభాషణలు, పాటలు వ్రాసారు.







చిత్రం: కీలుగుఱ్ఱం (1949)

రచన: తాపీ ధర్మారావు నాయుడు 

సంగీతం: ఘంటసాల వెంకటేశ్వర రావు 

గానం: ఘంటసాల, సి.కృష్ణవేణి




పల్లవి: కృష్ణవేణి: తెలియ వశమా! పలుక గలమా!


ప్రేమ మహిమా! ఆహాహహా..


తెలియ వశమా! పలుక గలమా!
చరణం: కృష్ణవేణి: తాకినంతనే శోక రహితమై


బ్రతుకంతా ఒక తృటి కాలములో..ఓ.. | బ్రతుకంతా |

ఘంటసాల: రంగలరారే బంగారముగా..


మార్చు గదా! ముదమార్చు గదా!


రంగలరారే బంగారముగా..


మార్చు గదా! ముదమార్చు గదా!

ఇద్దరు: తెలియ వశమా! పలుకగలమా!




చరణం: కృష్ణవేణి: రాగ తంతువుల తీవెల వోలె..ఏ. | రాగ తంతువుల |


మేళవించి మన జీవిత వీణా.. | మేళవించి |


మోహన గీతము ముద్దులొలుకగా | మోహన |


పాడు గదా! చెరలాడుగదా!


తెలియ వశమా! పలుకగలమా!




చరణం: ఇద్దరు: మనసు మనసుతో మచ్చిక పెనగొని 


మల్లె తీవెలటు అల్లిబిల్లిగా.. | మనసు |


జీవితమంతా పూవు పందిరిగ 


చేయు గదా! మది హాయి గదా! | జీవితమంతా |


తెలియ వశమా! పలుక గలమా!


ప్రేమ మహిమా! ఆహాహహా..


ఆహహా!

కృతజ్ఞతలు: చిత్రం గురించిన సమాచారము మరియు శ్రీ తాపీ ధర్మారావు నాయుడు గారి ఛాయాచిత్రము వికీపీడియా నుండి సేకరించడమైనది. సాంకేతిక నిపుణుల వివరాలు, శ్రీమతి కృష్ణవేణి గారి ఛాయాచిత్రము ఘంటసాల గళామృతము పాటల పాలవెల్లి నుండి సేకరించడమైనది. వీడియో ను యూ ట్యూబ్ లో లభ్యం చేసిన ప్రణీత్ గారికి ధన్యవాదాలు. ఆడియో ఫైలు మూలం - ఓల్డ్ తెలుగు సాంగ్స్.కాం.  All the content in this blog is for Entaertainment purpose only.

18, ఏప్రిల్ 2012, బుధవారం

ఘంటసాల, భానుమతి, పిఠాపురం పాడిన మధుర గీతం - వరుడు కావాలి చిత్రం నుండి

1957 లో పద్మశ్రీ భానుమతి గారి స్వంత సంస్థ, వారి కుమారుని పేరు మీద నెలకొల్పిన భరణీ పిక్చర్సు ద్వారా విడుదలైన చిత్రం "వరుడు కావాలి". ఈ సినిమాలో శ్రీ కొంగర జగ్గయ్య గారు, శ్రీమతి భానుమతి గార్లు నటించారు. సంగీత దర్శకులు శ్రీ రామనాథన్‌ గారు. ఈ చిత్రానికి ఘంటసాల మాస్టారు పాడిన ఒకే ఒక పాట శ్రీమతి భానుమతి, శ్రీ పిఠాపురం నాగేశ్వర రావు గార్లతో కలసి పాడిన ఆహ్లాదకరమైన రావూరి సత్యనారాయణ గారి గీతం "అందచందాల ఓ! తారకా". రావూరి వారు 50 లలో చింతామణి, చక్రపాణి, వరుడు కావాలి చిత్రాలకు మాటలు కూడ వ్రాసారు. ఇదే చిత్రానికి భానుమతి గారు శ్రీ వ్యాసతీర్థ వ్రాసిన "కృష్ణా నీ బేగన బారో" అనే సుప్రసిద్ధమైన కన్నడ భక్తి గీతాన్ని, శ్రీమతి ఎమ్‌.ఎల్‌.వసంత కుమారి గారు "నమ్మించి మరి రాడే" అనే లలిత గీతాన్ని పాడారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి నిర్మించారు. తెలుగులో జగ్గయ్య గారు, తమిళంలో శివాజీ గణేశన్‌ నటించారు. అయితే తెలుగు వీడియో లభ్యంకాలేదు. తమిళ చిత్రం అందుబాటులో వుంది. అందువలన తమిళ వీడియో పై తెలుగు డబ్బింగు చేసి ఇక్కడ పొందుపరుస్తున్నాం. ఈ సన్నివేశంలో శివాజీకి బదులు జగ్గయ్య గారిని ఊహించుకోండి. ఈ సన్నివేశంలో శివాజీ గారు గిటారు (అనుకుంటా) వాయిస్తూ పాడుతుండగా, మధ్యలో కాంపిటీషనుగా మరొక ప్రేమికుడు ప్రవేశిస్తాడు. ఇతనికి శ్రీ పిఠాపురం నాగేశ్వర రావు గారు నేపథ్య గానం చేశారు.




చిత్రం: వరుడు కావాలి (1957)

రచన: రావూరి సత్యనారాయణ

సంగీతం: జి.రామనాథన్‌

గానం: ఘంటసాల, భానుమతి, పిఠాపురం





ఘంటసాల: ఆ..ఆ..ఆ..
పల్లవి:
అందచందాల ఓ! తారకా, చేరరావే చెలీ నా దరీ


నా మదీ దోచినా రాణివీ

భానుమతి: అందచందాల ఓ! జాబిలీ, చేరరావా ప్రియా నా దరీ


నామదీ దోచినా రాజువై




చరణం: ఘంటసాల: పూల తీరాల తూగాడు డోలవై 


డోలలూగే సరాగాల మాలవై | పూల తీరాల |


తేలి రాగాలుగా తూలిరా పూవులా


తేనెలా సోనలా జాలువై

భానుమతి: పూల తీరాల తూగాడు తేటివై


ఏటి రాగాల సాగేటి పాటవై  పూల తీరాల |


తేలిరా గాలుల తూలిరా పూవులా


తేనెలా సోనలా జాలువై

ఘంటసాల: అందచందాల ఓ!  తారకా, చేరరావా ప్రియా నా దరీ


నామదీ దోచినా రాజువై


అందచందాల ఓ! తారకా! చేరరావే చెలీ నా దరీ


నా మదీ దోచినా రాణివీ

పిఠాపురం: ఆహహా.. ఓహొహో...ఆహహా.. ఓహొహో..


ఓ ప్రేయసీ, నా ప్రేయసీ సిసలైన గోల్డు మన ప్రేమ 


నా కోహినూర్‌ డైమండువే నా తలపైన కూర్చోవే


తన్నన్ననానా.. తన్నన్ననానా


ఓ ప్రేయసీ, నా ప్రేయసీ సిసలైన గోల్డు మన ప్రేమ 


నా కోహినూర్‌ డైమండువే నా తలపైన కూర్చోవే

భానుమతి: తన్నన్ననానా.. తన్నన్ననానా


సందేహమా! ఓ దేహమా! మరి ప్రేమంటే లోహమా!


నీ అందము, నా చందము మెచ్చేనోయి ఓ వామనా!


తన్నన్ననానా.. తన్నన్ననానా


తన్నన్ననానా.. తన్నన్ననానా


సందేహమా! ఓ దేహమా! మరి ప్రేమంటే లోహమా!


నీ అందము, నా చందము మెచ్చేనోయి ఓ వామనా!


ఒహ్హొహొ హోహో.. అహ్హహ్హ హాహా..

పిఠాపురం: ప్రేమించవా, పాలించవా, దయరాదా నా మీద 


సంసారమో, సన్యాసమో ఇక తేల్చాలే ప్రియరాలా

భానుమతి: అహ్హహ్హ హాహా..

పిఠాపురం: ఒహ్హొహ్హొ హోహో..

కృతజ్ఞతలు: సినిమా పోస్టరు, వివరాలు పొందుపరచిన ఘంటసాల గళామృతము పాటల పాలవెల్లి, ఆడియో ఫైలు సమకూర్చిన సఖియా.కాం కు, వీడియో అందుబాటులో ఉంచిన శ్రీ బొల్లాప్రగడ సోమేశ్వర రావు గారికి.

17, ఏప్రిల్ 2012, మంగళవారం

మాస్టారి సొంతచిత్రం 'పరోపకారం' నుండి మరొక మధుర గీతం

మాస్టారి సొంతచిత్రం పరోపకారం లో నాలుగు పాటలు పాడారు. అన్నీ మాస్టారి ఏకగళ గీతాలే. ఇంతకు ముందు పోస్టులో ఒక చక్కని పాట "హృదయమా! సాగిపొమ్మా" చూసి, విని ఆనందించారు. మరొక రస గుళిక ఇక్కడ ఆస్వాదించండి.  ఈ పాట కూడ శ్రీ ఆరుద్ర గారే వ్రాసారు. హాయిగా సాగే సంసారం అంటే పొద్దున్నే విలాసంగా సిగరెట్ కాలుస్తూ, పేపరు చదువుతూ, భార్య యిచ్చిన కాఫీ తాగుతూ తియ్యని ఈ కాపురమే (కాఫీయే) దివ్యసీమ అనుకుంటూ ముక్కామల గారు గ్రామఫోను రికార్డుతో మొదలుపెట్టి మెల్లగా పాట అందుకుంటే, అతని భార్యగా నటించిన శ్రీమతి జి.వరలక్షి ముసిముసి నవ్వులు నవ్వుతూ పిల్లాడ్నిఉయ్యాలలో వేసి ఊచే సన్నివేశాన్ని చాల సహజంగా చిత్రీకరించారు ఈ పాట నేపధ్యంలో. పాట మధ్య సంగీతం మొదటిసారి వింటే హీరోయిన్‌ ఆలాపనేమో అనిపిస్తుంది. అలా కూర్చారు మాస్టారు.  ఈ పాట దృశ్య, శ్రవణ, సాహిత్యాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఆస్వాదించండి మరి!


Thanks to Sri Bollapragada Someswara Rao garu
for uploading the video to You Tube

ఆడియో మూలం: సఖియా.కాం



చిత్రం: పరోపకారం (1953)

రచన: ఆరుద్ర 

సంగీతం: ఘంటసాల 

గానం: ఘంటసాల 





పల్లవి: తియ్యని ఈ కాపురమే దివ్య సీమ  | తియ్యని |


విరి తేనెలూరు ఈ సీమయె మధుర సీమా..


తియ్యని ఈ కాపురమే దివ్య సీమ 





చరణం: కనువిందు కదా భార్యలు పసందు కదా లీలలు.. ఊ..


కనువిందు కదా భార్యలు పసందు గదా లీలలు


కమ్మని లే ఊసులే జాతి మణి పూసలై | కమ్మని |


ఒలికే పాపల పలుకే హాయీ హాయి


తియ్యని ఈ కాపురమే దివ్య సీమ 


విరి తేనెలూరు ఈ సీమయె మధుర సీమా..


తియ్యని ఈ కాపురమే దివ్య సీమ 





చరణం: ఆలుమగల పొందిక, పాలు తేనె కలయికా.. ఆ..


ఆలుమగల పొందిక, పాలు తేనె కలయిక


చిలకా గోరింకల వలె కులికే దంపతుల  | చిలకా |


సంసారపు సరిసాటి లేనే లేదు 


తియ్యని ఈ కాపురమే దివ్య సీమ 


విరి తేనెలూరు ఈ సీమయె మధుర సీమా..


తియ్యని ఈ కాపురమే దివ్య సీమ 

కృతజ్ఞతలు: చిత్రం యొక్క సమాచారం పొందుపరచిన ఘంటసాల గళామృతం - పాటల పాలవెల్లి బ్లాగుకు, ఆడియో ఫైలు సమకూర్చిన సఖియా.కాం బ్లాగుకు, చక్కని సాంకేతిక నైపుణ్యంతో తమిళ చిత్ర వీడియోకు ఆడియోను జతపరచిన శ్రీ బొల్లాప్రగడ సోమేశ్వర రావు గారికి కృతజ్ఞతాభివందనములు.

16, ఏప్రిల్ 2012, సోమవారం

రేలంగికి మాస్టారు పాడిన హాస్య గీతం "నీవక్కడ నేనిక్కడ" - శ్రీ గౌరీ మహాత్మ్యం నుండి

ఘంటసాల మాస్టారు రేలంగి గారికి ఒక ప్రత్యేకమైన శైలిలో పాడతారు. 1956 లో విడుదలైన శ్రీ గౌరీ మహత్మ్యం చిత్రంలో మాస్టారు చాల పాటలు, పద్యాలు, శ్లోకాలు గానం చేసారు. ఈ చిత్రానికి ఇద్దరు సంగీత దర్శకులు - శ్రీ ఓగిరాల రామచంద్ర రావు గారు, శ్రీ టి.వి.రాజు గారు. పాట వ్రాసింది శ్రీ మల్లాది గారు. ఈ పాటలో కొన్ని జంట పదాలను చాల బాగా వాడారు మల్లాది గారు. ఉదాహరణకు - హోరుగాలి-పైరగాలి, పూరి-చూరు, పకపక-బెకబెక లాంటివి. అవన్నీ రేలంగి పాత్రకు, నటనకు, మాస్టారి గొంతు మాడ్యులేషన్‌ కు మరింత పరిమళాన్నిచ్చాయి. ఇక్కడ ఈ పాట దృశ్య, శ్రవణ, సాహిత్యాలను పొందుపరుస్తున్నాను.ఈ చిత్రానికి దర్శకులు శ్రీ డి.యోగానంద్.


Thanks to Sri Bollapragada Someswara Rao garu for providing the video.

                    చిత్రం:     శ్రీ గౌరీ మహత్మ్యం (1956)
                    రచన:     మల్లాది రామకృష్ణ శాస్త్రి 
                    సంగీతం: ఓగిరాల రామచంద్ర రావు, టి.వి.రాజు 
                    గానం:    ఘంటసాల వెంకటేశ్వర రావు  

ఆడియో మూలం: ఘంటసాల గాన చరిత


పల్లవి: నీవక్కడా నేనిక్కడా ఈ చిక్కు తీరేదెక్కడో | నీవక్కడా |

నీవక్కడా నేనిక్కడా!



చరణం: ఒక్కరుంటే హోరుగాలి, ఇద్దరుంటే పైరగాలీ.. ఈ… | ఒక్కరుంటే |

మాటకారీ! ఎక్కడే నీ నోటి ముత్యాలు 

నీవక్కడా నేనిక్కడా ఈ చిక్కు తీరేదెక్కడో

నీవక్కడా నేనిక్కడా!



చరణం: తోటలో చిందూ పసందు, తోటలో నేనే

నా పాటకూ, నీ నీటుకూ జత కుదిరిపోయిందే 

పచ్చ పచ్చగ పిల్ల మెళ్ళో తాళి కడితే ముచ్చట  | పచ్చ పచ్చగ |

ముద్దు ముచ్చట తీరకుంటే నిద్దరే రాదే

ఆ ముద్దూ ముచ్చట తీరకుంటే నిద్దరే రాదే

నీవక్కడా నేనిక్కడా ఈ చిక్కు తీరేదెక్కడో

నీవక్కడా నేనిక్కడా!



చరణం: చందమామకు కోక కడితే చిన్ని నువ్వేనే 

వెన్నెలా పన్నీరు కలిపితె పూల నవ్వేనే

నీవు నేనూ చేరువైతే పూరి గుడిశెలొ పకపక | నీవు నేనూ |

నీకు నాకూ దూరమైతే చూరుకిందే బెకబెక | నీకు నాకూ |

హెయ్! పూరి గుడిశెలొ పక పక 

హెయ్!  చూరు కిందే బెకబెక

పూరి గుడిశెలొ పక పక పక 

చూరు కిందే బెక బెక బెక 

పక పక పక పక బెక బెక బెక బెక 

పక పక పక పక బెక బెక బెక బెక 

పక పక బెక బెక పక పక బెక బెక

బెక్!

15, ఏప్రిల్ 2012, ఆదివారం

అరుదైన, అపురూపమైన యుగళగీతం - ప్రపంచం చిత్రం నుండి

1950 లో సొసైటీ పిక్చర్సు పతాకం పై తీసిన చిత్రం ప్రపంచం. ఈ చిత్రంలో పద్మశ్రీ చిత్తూరు వి. నాగయ్య, జి.వరలక్ష్మి (గరికపాటి వరలక్ష్మి) నాయికా, నాయకులుగా నటించారు. జి.వరలక్ష్మి తొలిచిత్రం శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి గారు రచించిన కథ ఆధారంగా అదే పేరుతో 1940 లో తీసిన బారిస్టరు పార్వతీశం చిత్రం. ప్రపంచం  చిత్రంలో ఘంటసాల మాస్టారు పాడిన ఒకే యుగళ గీతం శ్రీమతి ఎన్‌.ఎల్‌.గానసరస్వతి గారితో. ఈవిడ బహుశా మళయాళ రంగం నుండి అనుకుంటాను. వీరే కాక ఈ చిత్రంలో శ్రీమతి ఎమ్‌.ఎల్‌.వసంత కుమారి, ఎ.ఎమ్‌.రాజా కూడ పాడారు. మిగిలిన వివరాలు ఘంటసాల గళామృతము-పాటల పాలవెల్లి లో చూడగలరు.  ఈ పాట రచయిత మహాకవి శ్రీశ్రీ.  సంగీత దర్శకులు ఎమ్‌.ఎస్‌.జి.మణి మరియు పూర్ణానంద.


ఆడియో మూలం: ఘంటసాల గాన చరిత

చిత్రం: ప్రపంచం (1950)
గీతరచన: శ్రీ శ్రీ
గానం: ఘంటసాల, ఎన్‌. ఎల్. గానసరస్వతి
సంగీతం: ఎం.ఎస్.జి. మణి మరియు టి. పూర్ణానంద





గానసరస్వతి: ఆ..ఆ..

ఘంటసాల: ఆ..ఆ..
పల్లవి: గానసరస్వతి: ప్రేమ సుధా సరసిలో హంసలమై | ప్రేమసుధా |


ప్రియముగ విహరించ మనసాయెగా


ప్రేమ సుధా సరసిలో
చరణం: ఘంటసాల: ఆమని అరుదెంచె ఆశలు చిగురించే..ఏ..ఏ.. |ఆమని|


ఆమని అరుదెంచె ఆశలు చిగురించే


ప్రేమము కుసుమించె నేడే


మన జీవితమే తేలి తూగే

గానసరస్వతి: కలసిన హృదయాల వెలసిన స్నేహాల | కలసిన |


విలసనమె హాయి హాయి | విలసనమె |

ఘంటసాల: ప్రణయ లోకాలలో

గానసరస్వతి: మధుర గానాలలో

ఘంటసాల: ప్రణయ లోకాలలో

గానసరస్వతి: మధుర గానాలలో

ఇద్దరు: కడు ప్రియమార నడయాడ మనసాయెగా..ఆ..


ప్రియమార నడయాడ మనసాయెగా




చరణం: గానసరస్వతి: వెన్నెల కెరటాలా..ఆ..ఆ..


వెన్నెల కెరటాల యవ్వన సుమడోల


ముదరణములసేయ మనసాయెరా

ఘంటసాల: నా మది పులకించే..ఏ..ఏ..


నా మది పులకించే నా ఎద కరగించే..


కోయిలవై పాడినావే | కోయిలవై |

గానసరస్వతి: ఓ! నవ మోహనా

ఘంటసాల: ఓ! వనజాననా

గానసరస్వతి: ఓ! నవ మోహనా

ఘంటసాల: ఓ! వనజాననా

గానసరస్వతి: ప్రేమయే..

ఘంటసాల: జీవము

గానసరస్వతి: జీవమే..

ఘంటసాల: ప్రేమము

ఇద్దరు: ఇక మన ప్రేమకిల సాటి కనరాదుగా


కనరాదుగా

కృతజ్ఞతలు: సినిమా పోస్టరు ఘంటసాల గళామృతము-పాటల పాలవెల్లి నుండి; ఆడియో సంగీతము అందించిన సఖియా.కాం నిర్వాహకులైన హైదరాబాద్‌ శ్రీ ఘంటసాల సంగీత కళాశాల సంచాలకులు  శ్రీ కొల్లూరి భాస్కరరావు గారికి.

విన్నపము

ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com

మాస్టారు పాడిన నేరు చిత్రాలు

చి-అంతస్తులు-1965 (4) చి-అంతా మనవాళ్ళే-1954 (1) చి-అందం కోసం పందెం-1971 (2) చి-అగ్గి బరాటా-1966 (1) చి-అత్తా ఒకింటి కోడలే-1958 (1) చి-అన్నపూర్ణ-1960 (1) చి-అప్పుచేసి పప్పుకూడు-1959 (5) చి-అమరశిల్పి జక్కన్న-1964 (2) చి-అమాయకుడు-1968 (1) చి-ఆడ పెత్తనం-1958 (2) చి-ఆత్మగౌరవం-1966 (1) చి-ఆనందనిలయం-1971 (1) చి-ఆప్తమిత్రులు-1963 (1) చి-ఆరాధన-1962 (2) చి-ఆస్తిపరులు-1966 (1) చి-ఇద్దరు పెళ్ళాలు-1954 (1) చి-ఇద్దరు మిత్రులు-1961 (3) చి-ఉమాచండీగౌరీశంకరుల కధ-1968 (1) చి-ఉమాసుందరి-1956 (3) చి-ఉయ్యాల జంపాల-1965 (1) చి-ఉషాపరిణయం-1961 (1) చి-ఋష్యశృంగ-1961 (1) చి-ఏకవీర-1969 (1) చి-కనకదుర్గ పూజా మహిమ-1960 (2) చి-కన్నకొడుకు-1973 (1) చి-కన్యాశుల్కం-1955 (2) చి-కలసివుంటే కలదుసుఖం-1961 (2) చి-కాంభోజరాజుకథ-1967 (1) చి-కాళహస్తి మహత్మ్యం-1954 (10) చి-కీలుగుఱ్ఱం-1949 (4) చి-కుంకుమ రేఖ-1960 (1) చి-కులగౌరవం-1972 (1) చి-కృష్ణ లీలలు-1959 (3) చి-కృష్ణప్రేమ-1961 (3) చి-కొడుకు కోడలు-1972 (1) చి-గాలిమేడలు-1962 (2) చి-గుండమ్మకథ-1962 (1) చి-గుడిగంటలు-1964 (1) చి-గుణసుందరి కథ-1949 (1) చి-గులేబకావళి కథ-1962 (4) చి-గృహప్రవేశము-1946 (1) చి-గృహలక్ష్మి-1967 (3) చి-చండీరాణి-1953 (1) చి-చంద్రహారం-1954 (3) చి-చంద్రహాస-1965 (1) చి-చరణదాసి-1956 (2) చి-చింతామణి-1956 (1) చి-చిట్టి తమ్ముడు-1962 (1) చి-చిలకా-గోరింక-1966 (1) చి-చివరకు మిగిలేది!-1960 (1) చి-చెంచు లక్ష్మి-1958 (1) చి-జగదేకవీరుని కథ-1961 (3) చి-జయం మనదే-1956 (1) చి-జయభేరి-1959 (3) చి-జయసింహ-1955 (3) చి-జరిగిన కథ-1969 (1) చి-జీవన తరంగాలు-1973 (1) చి-జైజవాన్‌-1970 (1) చి-టైగర్ రాముడు-1962 (1) చి-డా.ఆనంద్-1966 (1) చి-డా.చక్రవర్తి-1964 (1) చి-తెనాలి రామకృష్ణ-1956 (5) చి-తేనె మనసులు-1965 (1) చి-తోడికోడళ్ళు-1957 (1) చి-తోడికోడళ్ళు-1977 (1) చి-దీపావళి-1960 (2) చి-దేవకన్య-1968 (1) చి-దేవత-1965 (1) చి-దేవదాసు-1953 (1) చి-దేవాంతకుడు-1960 (1) చి-దేశద్రోహులు-1964 (1) చి-దొరికితే దొంగలు (1) చి-ద్రోహి-1948 (1) చి-ధర్మదాత-1970 (1) చి-ధర్మాంగద-1949 (1) చి-నమ్మినబంటు-1960 (1) చి-నర్తనశాల-1963 (2) చి-నలదమయంతి-1957 (1) చి-నవగ్రహపూజా మహిమ-1964 (1) చి-నాదీ ఆడజన్మే-1965 (1) చి-నిరుపేదలు-1954 (1) చి-నిర్దోషి-1951 (1) చి-నిర్దోషి-1967 (1) చి-పరమానందయ్య శిష్యుల కథ-1966 (2) చి-పరోపకారం-1953 (2) చి-పల్నాటి యుద్ధం-1947 (3) చి-పల్నాటి యుద్ధం-1966 (1) చి-పల్లెటూరి పిల్ల-1950 (1) చి-పల్లెటూరు-1952 (4) చి-పవిత్ర బంధం-1971 (1) చి-పవిత్ర హృదయాలు-1971 (1) చి-పసుపు కుంకుమ-1955 (1) చి-పాండవ వనవాసం-1965 (5) చి-పాండురంగ మహత్మ్యం-1957 (1) చి-పాతాళ భైరవి-1951 (1) చి-పిచ్చి పుల్లయ్య-1953 (1) చి-పిడుగు రాముడు-1966 (1) చి-పూజాఫలం-1964 (1) చి-పెండ్లి పిలుపు-1961 (1) చి-పెద్ద మనుషులు-1954 (2) చి-పెళ్ళి కాని పిల్లలు-1961 (2) చి-పెళ్ళి చేసి చూడు-1952 (3) చి-పెళ్ళి సందడి-1959 (1) చి-పెళ్ళినాటి ప్రమాణాలు-1958 (3) చి-పేదరాశి పెద్దమ్మ కథ-1968 (2) చి-పొట్టి ప్లీడరు-1966 (1) చి-ప్రపంచం-1950 (1) చి-ప్రమీలార్జునీయం-1965 (2) చి-ప్రియురాలు-1952 (1) చి-ప్రేమ నగర్-1971 (1) చి-ప్రేమ-1952 (1) చి-బంగారు గాజులు-1968 (1) చి-బండ రాముడు-1959 (1) చి-బందిపోటు-1963 (1) చి-బడి పంతులు-1972 (1) చి-బభ్రువాహన-1964 (3) చి-బలే బావ-1957 (1) చి-బాల భారతం-1972 (1) చి-బాలనాగమ్మ-1959 (4) చి-బాలభారతం-1972 (1) చి-బాలరాజు కథ-1970 (1) చి-బాలరాజు-1948 (2) చి-బాలసన్యాసమ్మ కథ-1956 (1) చి-బావమరదళ్ళు-1961 (1) చి-బికారి రాముడు-1961 (1) చి-బొబ్బిలి యుద్ధం-1964 (1) చి-బ్రతుకుతెరువు-1953 (1) చి-భక్త అంబరీష-1959 (2) చి-భక్త జయదేవ-1961 (1) చి-భక్త తుకారాం-1973 (3) చి-భక్త రఘునాథ్-1960 (2) చి-భక్త రామదాసు-1964 (1) చి-భక్త శబరి-1960 (1) చి-భట్టి విక్రమార్క-1960 (1) చి-భలే అమ్మాయిలు-1957 (1) చి-భాగ్యదేవత-1959 (1) చి-భాగ్యరేఖ-1957 (1) చి-భామా విజయం-1967 (2) చి-భీమాంజనేయ యుద్ధం-1966 (4) చి-భీష్మ-1962 (5) చి-భూకైలాస్-1958 (4) చి-భూలోకంలో యమలోకం-1966 (1) చి-మంచి మనసుకు మంచి రోజులు-1958 (1) చి-మంచి మనసులు-19 (1) చి-మంచిరోజులు వచ్చాయి-1972 (1) చి-మనదేశం-1949 (3) చి-మనసు మమత (1) చి-మనుషులు-మమతలు-1965 (1) చి-మరపురాని కథ-1967 (2) చి-మర్మయోగి-1964 (1) చి-మల్లీశ్వరి-1951 (3) చి-మహాకవి కాళిదాదు-1960 (2) చి-మహామంత్రి తిమ్మరుసు-1962 (3) చి-మాయాబజార్-1957 (3) చి-మూగ మనసులు-1964 (2) చి-మోహినీ భస్మాసుర-1966 (1) చి-యశొద కృష్ణ-1975 (1) చి-యోగి వేమన-1947 (1) చి-రంగుల రాట్నం-1967 (1) చి-రక్త సిందూరం-1967 (1) చి-రక్షరేఖ-1949 (1) చి-రణభేరి-1968 (2) చి-రహస్యం-1967 (2) చి-రాజ మకుటం-1960 (1) చి-రాజకోట రహస్యం-1971 (2) చి-రాజు పేద-1954 (2) చి-రాము-1968 (2) చి-రుణానుబంధం-1960 (1) చి-రేణుకాదేవి మహాత్మ్యం-1960 (1) చి-రోజులు మారాయి-1955 (1) చి-లక్ష్మమ్మ-1950 (2) చి-లక్ష్మీ కటాక్షం-1970 (2) చి-లవకుశ-1963 (1) చి-వదినగారి గాజులు-1955 (1) చి-వరుడు కావాలి-1957 (1) చి-వాగ్దానం-1961 (3) చి-వారసత్వం-1964 (2) చి-వాల్మీకి-1963 (1) చి-విచిత్ర కుటుంబం-1969 (2) చి-విజయం మనదే-1970 (1) చి-వినాయక చవితి-1957 (5) చి-విమల-1960 (2) చి-విష్ణుమాయ-1963 (1) చి-వీర కంకణం-1957 (2) చి-వీరాంజనేయ-1968 (2) చి-వెలుగు నీడలు-1961 (2) చి-వెలుగునీదలు-1961 (1) చి-శకుంతల-1966 (1) చి-శభాష్ పాపన్న-1972 (1) చి-శభాష్ రాజా-1961 (1) చి-శభాష్ రాముడు-1959 (1) చి-శాంతి నివాసం-1960 (1) చి-శోభ-1958 (1) చి-శ్రీ గౌరీ మహత్మ్యం-1956 (4) చి-శ్రీ వేంకటేశ్వర వైభవం-1971 (1) చి-శ్రీ సత్యనారాయణ మహత్యం-1964 (2) చి-శ్రీ సింహాచలక్షేత్ర మహిమ-1965 (1) చి-శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ-1966 (1) చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ-1966 (1) చి-శ్రీకృష్ణ కుచేల-1961 (2) చి-శ్రీకృష్ణ తులాభారం-1966 (1) చి-శ్రీకృష్ణ పాండవీయం-1966 (3) చి-శ్రీకృష్ణ విజయం-1971 (1) చి-శ్రీకృష్ణమాయ-1958 (2) చి-శ్రీకృష్ణార్జున యుద్ధం-1963 (1) చి-శ్రీవేంకటేశ్వర మహత్మ్యం-1960 (1) చి-శ్రీవేంకటేశ్వర వైభవం-1971 (2) చి-షావుకారు-1950 (2) చి-సంతానం-1955 (5) చి-సంపూర్ణ రామాయణం-1972 (4) చి-సంసారం-1950 (3) చి-సతీ అనసూయ-1957 (2) చి-సతీ సక్కుబాయి-1965 (3) చి-సతీ సులోచన-1961 (2) చి-సత్య హరిశ్చంద్ర-1965 (2) చి-సప్తస్వరాలు-1969 (1) చి-సారంగధర-1957 (2) చి-సీతారామ కల్యాణం-1961 (2) చి-సుమంగళి-1965 (1) చి-స్వప్న సుందరి-1950 (3) చి-స్వర్గసీమ-1945 (1) చి-స్వర్ణ మంజరి-1962 (1) చి-హంతకులొస్తున్నారు జాగ్రత్త-1966 (1) చి-హరిశ్చంద్ర-1956 (2)

సహగాయనీ గాయకులు

గా-ఎ.పి.కోమల తో (3) గా-ఎం.వి.రాజమ్మ తో (1) గా-ఎస్.జానకి తో (5) గా-గానసరస్వతి తో (1) గా-గోపాలరత్నం తో (1) గా-ఘంటసాల (79) గా-ఘంటసాల-పి.సుశీల (3) గా-ఘంటసాల-బృందం (5) గా-జమునారాణి తో (2) గా-జి.వరలక్ష్మి తో (1) గా-జిక్కి తో (1) గా-జిక్కీ తో (4) గా-జిక్కీ-బాలసరస్వతి తో (1) గా-జిక్కీతో (5) గా-పలువురి తో (1) గా-పి.కన్నాంబ తో (1) గా-పి.బి.శ్రీనివాస్ తో (3) గా-పి.భానుమతి తో (11) గా-పి.లీల తో (21) గా-పి.సుశీల తో (49) గా-పి.సుశీల-బృందంతో (2) గా-పిఠాపురం తో (1) గా-బాలసరస్వతి తో (3) గా-బృందం తో (35) గా-బృందంతో (2) గా-బెంగుళూరు లత తో (1) గా-బెజవాడ రాజరత్నం తో (2) గా-భానుమతి-పిఠాపురం తో (1) గా-మాధవపెద్ది (5) గా-రాధాజయలక్ష్మి తో (2) గా-రేణుక తో (1) గా-లతా మంగేష్కర్ తో (1) గా-వి.జె.వర్మతో (1) గా-వి.సరళ తో (2) గా-శరావతి తో (1) గా-శోభారాణితో (2) గా-శ్రీదేవి తో (1) గా-సరోజిని తో (1) గా-సి.కృష్ణవేణి తో (2) గా-సుందరమ్మ తో (1) గా-సుశీల-బృందం తో (1)

మాస్టారి పాటల సంగీత దర్శకులు

స-విజయభాస్కర్ (1) సం -A.M.రాజా (1) సం- ఘంటసాల (1) సం-అద్దేపల్లి (1) సం-అశ్వత్థామ (4) సం-అశ్వద్ధామ (1) సం-ఆదినారాయణ రావు (5) సం-ఆదినారాయణరావు (2) సం-ఆర్.గోవర్ధనం (2) సం-ఆర్.సుదర్శనం (2) సం-ఆర్.సుదర్శనం-ఆర్.గోవర్ధనం (1) సం-ఎం.రంగారావు (1) సం-ఎల్.మల్లేశ్వరరావు (3) సం-ఎస్.పి.కోదండపాణి (12) సం-ఓగిరాల (1) సం-ఓగిరాల-అద్దేపల్లి (2) సం-ఓగిరాల-టి.వి.రాజు (4) సం-కె.ప్రసాదరావు (1) సం-కె.వి. మహదేవన్ (2) సం-కె.వి.మహదేవన్ (15) సం-గాలి పెంచల (6) సం-ఘంటసాల (79) సం-జె.వి.రాఘవులు (1) సం-జోసెఫ్-విజయాకృష్ణమూర్తి (2) సం-జోసెఫ్.వి.కృష్ణమూర్తి (1) సం-టి.ఆర్.పాప (1) సం-టి.ఎం.ఇబ్రహీం (1) సం-టి.చలపతిరావు (9) సం-టి.జి.లింగప్ప (3) సం-టి.వి.రాజు (31) సం-నాగయ్య-ఓగిరాల (1) సం-నాగయ్య-తదితరులు (1) సం-పామర్తి (5) సం-పామర్తి-సుధీర్ ఫడ్కె (1) సం-పామర్తి-సుధీర్ ఫడ్కే (1) సం-పి.శ్రీనివాస్ (2) సం-పెండ్యాల (38) సం-బాబురావు (1) సం-బాలాంత్రపు (1) సం-బి.గోపాలం (2) సం-బి.శంకర్ (1) సం-మణి-పూర్ణానంద (1) సం-మల్లేశ్వరరావు (1) సం-మాస్టర్ వేణు (12) సం-ముగ్గురు దర్శకులు (2) సం-రాజన్‌-నాగేంద్ర (2) సం-రాజు-లింగప్ప (2) సం-రాజేశ్వరరావు-హనుమంతరావు (1) సం-రామనాథన్‌ (3) సం-రామనాథన్‌-పామర్తి (1) సం-విజయా కృష్ణమూర్తి (3) సం-విశ్వనాథన్‌-రాఘవులు (1) సం-విశ్వనాథన్‌-రామ్మూర్తి (5) సం-వై.రంగారావు (1) సం-సర్దార్ మల్లిక్ - పామర్తి (1) సం-సాలూరు (44) సం-సాలూరు-గోపాలం (1) సం-సి. ఆర్. సుబ్బరామన్ (1) సం-సుదర్శనం-గోవర్ధనం (12) సం-సుబ్బయ్యనాయుడు (2) సం-సుబ్బురామన్ (1) సం-సుబ్బురామన్‍-విశ్వనాథన్ (1) సం-సుసర్ల (18) సం-హనుమంతరావు (2) సం-MSV-రామ్మూర్తి-పామర్తి (1)

మాస్టారి పాటల రచయితలు

ర-అనిసెట్టి (13) ర-అనిసెట్టి-పినిసెట్టి (1) ర-ఆత్రేయ (18) ర-ఆదినారాయణ రావు (1) ర-ఆరుద్ర (39) ర-ఉషశ్రీ (1) ర-ఎ.వేణుగోపాల్ (1) ర-కాళిదాసు (3) ర-కాళ్ళకూరి (1) ర-కొసరాజు (17) ర-కోపల్లి (1) ర-గబ్బిట (2) ర-గోపాలరాయ శర్మ (1) ర-ఘంటసాల (1) ర-చేమకూర. (1) ర-జంపన (2) ర-జయదేవకవి (1) ర-జాషువా (1) ర-జి.కృష్ణమూర్తి (3) ర-తాండ్ర (1) ర-తాపీ ధర్మారావు (8) ర-తిక్కన (2) ర-తిరుపతివెంకటకవులు (1) ర-తోలేటి (12) ర-దాశరథి (8) ర-దీక్షితార్ (1) ర-దేవులపల్లి (3) ర-నార్ల చిరంజీవి (1) ర-పరశురామ్‌ (1) ర-పాలగుమ్మి పద్మరాజు (3) ర-పింగళి (26) ర-బమ్మెఱ పోతన (2) ర-బాబ్జీ (1) ర-బాలాంత్రపు (3) ర-బైరాగి (1) ర-భాగవతం (1) ర-భావనారాయణ (1) ర-భుజంగరాయ శర్మ (1) ర-మల్లాది (8) ర-ముద్దుకృష్ణ (3) ర-రాజశ్రీ (2) ర-రామదాసు (1) ర-రావులపర్తి (1) ర-రావూరి (1) ర-వసంతరావు (1) ర-వారణాసి (2) ర-విజికె చారి (1) ర-వీటూరి (4) ర-వేణు (1) ర-వేములపల్లి (1) ర-శ్రీశ్రీ (28) ర-సదాశివ బ్రహ్మం (9) ర-సముద్రాల జూ. (20) ర-సముద్రాల సీ. (42) ర-సి.నా.రె. (2) ర-సినారె (24) ర-సుంకర (1) ర-సుంకర-వాసిరెడ్డి (1) ర-సుబ్బారావు (1) రచన-ఘంటసాల (1) రచన-దాశరధి (2) రచన-దేవులపల్లి (2) రచన-పానుగంటి (1) రచన-పింగళి (2) రచన-బలిజేపల్లి (1) రచన-సముద్రాల సీ. (1)