శ్రీశ్రీ ఆధునిక కవితా ప్రభంజనానికి ఊపిరి. ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి. పురాతన కవితాధోరణులు, ఛందస్సు అధునాతన కవనానికి ఉపయోగపడవని కవితకు అనూహ్యమైన మార్పులు చేశారు. అయితే రెండు విధాలలోను ఉద్దండుడు శ్రీశ్రీ. ఆయన వ్యాసం "1947-1972 : నేను - ఈ పాతికేళ్ళ వచన సాహిత్యం" ఆంధ్రభారతి బ్లాగ్ లో చూడవచ్చు. శ్రీశ్రీ కవితల గుఱించి, ఆయన పదాలతో ఎలా ఆడుకున్నారో శ్రీ జెజ్జాల కృష్ణమోహనరావు గారు "ఈ మాట" వెబ్ జైన్ లో "శ్రీశ్రీ ఛందఃశిల్పము" అనే చక్కని వ్యాసం వ్రాసారు.
శ్రీశ్రీ తను వ్రాసిన ఒక కవిత "పొలాలనన్నీ హలాలదున్నీ" గుఱించి ఒకసారి ఒక ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ గేయాన్ని మెచ్చుకుంటూ "అభ్యుదయ రచయితల లండన్ మానిఫెస్టో సారాంశం అంతా ఇందులో దించేశావోయ్" అని శ్రీశ్రీని పొగిడారట. ఈ గేయాన్ని ఎన్.టి. ఆర్., సావిత్రి, ఎస్.వి. ఆర్. నటించిన, 1952లో పీపుల్స్ ఆర్ట్ ప్రొడక్షన్సు బ్యానర్ పై నిర్మింపబడిన "పల్లెటూరు" చిత్రం కోసం ఘంటసాల మాస్టారు ఎం.ఎస్. రామారావు, పిఠాపురం, మాధవపెద్ది బృందం తో కలసి పాడారు. ఘంటసాల మాస్టారు ఈ చిత్రానికి సంగీత దర్శకులు.

కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి