1962 లో నిర్మించ బడిన గులేబకావళి కథ కల్పిత కథ. గులేబకావళి (గుల్-ఎ-బకావళి) పుష్పం పై గల ఒక కథను జానపద చిత్రంగా పలు భాషలలో నిర్మించబడింది. అయితే తమిళంలో ఎం.జి.ఆర్. నటించిన కథకు, తెలుగు లో ఎన్.టి.ఆర్., జమున నటించిన చిత్ర కథకు కొంత వ్యత్యాసం వుంది. ఈ చిత్రం తో సినీ అరంగేట్రం చేసిన శ్రీ సి.నారాయణ రెడ్డి గారు "నన్ను దోచుకొందువటే" పాటతో బాగా ప్రసిద్ధి పొందారు. వారి మరొక అద్భుతమైన గీతం "కలల అలలపై తేలెను. దీనిని ఘంటసాల మాస్టారు, ఎస్. జానకి గానం చేసారు. ఈ పాట గులేబకావళి పాత్ర ధారిణి నాగరత్నం మరియు ఎన్.టి.ఆర్.లపై చిత్రీకరించారు. ఎంతో ఆహ్లాదంగా, సుమధురంగా సాగే ఈ పాట యొక్క దృశ్య, శ్రావణ, సాహిత్యాలను ఇక్కడ పొందు పరుస్తున్నాను.
ప. ఘంటసాల: విరజాజులు పరిమళించు విరుల పానుపేమన్నది | విరజాజులు |
ఆడియో ఫైలు: కలల అలలపై తేలెను
చిత్రం: గులేబకావళి కథ (1962)
కలం: డా.సి.నారాయణ రెడ్డి
సంగీతం: జోసెఫ్ కృష్ణమూర్తి
గానం: ఘంటసాల, ఎస్.జానకి
ప: జానకి: కలల అలలపై తేలెను మనసు మల్లెపూవై
ఘంటసాల: ఎగసిపోదునో చెలియా నీవే ఇక నేనై
జానకి: కలల అలలపై
చ. జానకి: జలకమాడు జవరాలిని చిలిపిగ చూసేవెందుకు | జలకమాడు |
ఘంటసాల: తడిసీ తడియని కొంగున ఒడలు దాచుకున్నందుకు | తడిసీ |
జానకి: చూపుతోనె హృదయవీణ ఝుమ్మనిపించేవెందుకు | చూపుతోనె |
ఘంటసాల: విరిసీ విరియని పరువము
జానకి: ఆ.. ఆ
ఘంటసాల: మరులు గొలుపుతున్నందుకు
జానకి: ఆ.. ఆ..
ఘంటసాల: విరిసీ విరియని పరువము మరులు గొలుపుతున్నందుకు
జానకి: కలల అలలపై
చ. జానకి: సడి సవ్వడి వినిపించని నడి రాతిరి ఏమన్నది | సడి సవ్వడి|
ఘంటసాల: జవరాలిని చెలికానిని
జానకి: ఊ.. ఊ..
ఘంటసాల: జంటగూడి రమ్మన్నది
జానకి: ఊ.. ఊ..
ఘంటసాల: జవరాలిని చెలికానిని జంటగూడి రమ్మన్నది
ప. ఘంటసాల: విరజాజులు పరిమళించు విరుల పానుపేమన్నది | విరజాజులు |
జానకి: అగుపించని ఆనందము
జానకి: ఆ.. ఆ..
ఘంటసాల: బిగి కౌగిట కలదన్నది
జానకి: ఆ.. ఆ..
ఘంటసాల: అగుపించని ఆనందము బిగి కౌగిట కలదన్నది
జానకి: కలల అలలపై తేలెను మనసు మల్లెపూవై
ఘంటసాల: ఎగసిపోదునో చెలియా నీవే ఇక నేనై
జానకి: కలల అలలపై
