టౌన్ బస్ |
ఘంటసాల మాస్టారి బహు అరుదైన పాటలలో టౌన్ బస్ (1957) అనే తమిళం నుండి తెలుగులో కి అదే పేరుతో డబ్ చేసిన చిత్రానికి వారు పాడిన 'అందాల నాగుబాము నిలువెల్లా విసపు చేదేనే' ఒకటి. ప్రేమించిన వాడు మోసం చేసిపొతే ఒక మగువ పడే వ్యధను, ఆమె కల్లోల హృదయానికి అద్దం పడుతూ నేపధ్యంలో వినిపించే పాట. నిజానికి పాట ఆఖరులో తెలుస్తుంది ఇది నేపధ్య గీతం కాదని. ఈ సన్నివేశంలో అంజలీదేవి నటించింది. సంగీత దర్సకత్వం వై. రంగారావు. ఈ
పాట వింటే ఇందులో 'పయనించే ఓ చిలకా' ఛాయలు కొంచెం క(వి)నిపిస్తాయి. టౌన్ బస్ చిత్రానికి మాస్టారు రెండు పాటలు పాడారు. ఈ చిత్రానికి దర్సకత్వం సోమన్. రచన బైరాగి. రచయిత గురించి తెలియదు. కాని చక్కని భావాన్ని సరళమైన పదాలతో, అంత్యానుప్రాస తో పొందికగా వ్రాసారీయన. అమూల్యమైన ఈ పాటయొక్క దృశ్య ఖండికను అందించిన శ్రీ బొల్లాప్రగడ సోమేశ్వర రావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇదే బాణీలోనిది "ఉరన్ ఖటోలా" హిందీ చిత్రంలో మహమ్మద్ రఫీ పాడిన "ఓ దూర్ కే ముసాఫిర్" పాట.
చిత్రం: టౌన్ బస్ (1957) డబ్బింగ్ చిత్రం
రచన: బైరాగి
సంగీతం: వై. రంగారావు*
గానం: ఘంటసాల
సాకీ: వృధా జీవితం ఇకేల
వ్యధా పూరితమ్ము ప్రేమ
మహా క్రూరమీ ప్రపంచం
వృధా కంటినీరు భామ
ప. అందాల నాగుబాము
నిలువెల్ల విసపు చేదేనే
మానవుడు పరమపాపి
ఈతనిని నమ్మరాదే | అందాల |
చ. వీనులకు విందు మాటా,
తేనియలు చిందు నోటా..
మానసము రాతి కోటా,
వలపితనికొక్క ఆటా-2 | అందాల |
చ. కష్టాలు పడిననాడూ
పలు బాసలాడినాడూ..
ఈనాడూ తలుప లేడు
ఆనాటివాడు కాడు-2 | అందాల |
ఈతనిని నమ్మరాదే
మానవుని నమ్మరాదే
*ఇదే పేరుగల తమిళ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీత దర్సకత్వం వహించారు. అయితే తెలుగు డబ్బింగ్ చిత్రానికి వై.రంగారావుగారు సంగీత దర్సకత్వం వహించారని చల్లా సుబ్బారాయుడు గారు నిర్దారించారని తెలిసినది.
ఇదే బాణీలో ఉరన్ ఖటోలా చిత్రానికి "ఓ దూర్ కే ముసాఫిర్" - మహమ్మద్ రఫీ పాడారు. ఈ సమాచారము పంచుకున్నవెంకోబరావు గారికి SNKR గారికి ధన్యవాదాలు.
కృతజ్ఞతలు: యూ ట్యూబ్ వీడియోను అందించిన శ్రీ బొల్లాప్రగడ సోమేశ్వర రావు గారికి, సమాచారాన్ని సేకరించి తమ అమూల్య అభిప్రాయాన్ని తెలియజేసిన ఘంటసాల గళామృతము-పాటల పాలవెల్లి బ్లాగు శ్రీ కొల్లూరు భాస్కర రావు గారికి ధన్యవాదాలు.