1968 లో పి.ఎస్.ఆర్.పిక్చర్స్ పతాకంపై విడుదలైన జానపద చిత్రం రణభేరి. ఈ చిత్రంలో కాంతారావు, రాజశ్రీ జంటగా నటించారు. ఇది గిడుతూరి సూర్యం కు దర్శకునిగా తొలి చిత్రం. పసి వయసులో తన తమ్ముని తో, తల్లిదండ్రులతో కలసి వేటకు వచ్చిన ఒక రాజు పెద్ద కొడుకు పరిస్థితుల కారణంగా అందరికీ దూరమై, వనవీరుడనే పేరుతో ఒక శ్రామికుని యింట పెరిగి పెద్దవాడవుతాడు. ఆ దేశపు సేనాపతి అరాచత్వాన్ని ఎదుర్కొని, ప్రజలను చైతన్యవంతులను చేస్తూ కథానాయకుడు పాడిన ప్రబోధ గీతాన్నిమహాకవి శ్రీశ్రీ వ్రాసారు. శ్రీశ్రీ వ్రాసిన ప్రతి పదం తెలుగు వాడి వాడిని, వేడిని ప్రతిబింబిస్తాయంటే అది అతిశయోక్తి కాదు. కార్మిక, కర్షక, శ్రామిక వర్గాలనుత్తేజిస్తూ ఆయన వ్రాసిన మహాప్రస్థానం కవిత చాల ప్రసిద్ధి పొందింది. ఈ కవితతో కలసి సుమారు నలభై కవితల సంపుటి అదే పేరుతో - "మహాప్రస్థానం" గా 1950 లో ప్రచురించబడింది. ఆ నేపథ్యంలో శ్రీశ్రీ సమర్పణలో, 1982 లో శ్రీ మాదాల రంగారావు నటించిన మహాప్రస్థానం పేరిట నిర్మించడి అందులో శ్రీశ్రీ కవిత టైటిల్ సాంగ్ గా చేర్చబడింది. శ్రీశ్రీ 1981 లో అమెరికా పర్యటించినపుడు పిట్స్ బర్గ్ లోని ఒక సమావేశంలో స్వయంగా వినిపించిన "మరోప్రపంచం పిలిచింది" వీడియోను, "ఈమాట" వెబ్ జైన్ సమకూర్చిన ఈ లింకులో చూడగలరు. ఈ కవితలో కొంత భాగాన్ని రణభేరి చిత్రంలో కొంత విప్లవసేనపై, కొంత బుర్రకథగా కాంతారావు, వాణిశ్రీ, హాస్యనటుడు బాలకృష్ణ, తదితరులపై చిత్రీకరించారు. ప్రముఖ సంగీత దర్శకులు ఎస్.పి.కోదండపాణి గారు బాణీ కట్టగా ఘంటసాల-బృందం గానం చేసారు. ఈ పాట యొక్క సాహిత్యం, దృశ్య, శ్రవణ విశేషాలను ఇక్కడ పొందు పరుస్తున్నాను.
చిత్రం: రణభేరి (1968)
రచన: శ్రీశ్రీ
సంగీతం: ఎస్.పి.కోదండపాణి
గానం: ఘంటసాల, సుశీల, బృందం
పల్లవి: | ఘంటసాల: | మరో ప్రపంచం.. మరో ప్రపంచం |
మరో ప్రపంచం పిలిచింది | ||
మరో ప్రపంచం మరోప్రపంచం మరో ప్రపంచం పిలిచింది | ||
మరో ప్రపంచం పిలిచింది పదండి పోదాం పదండి పోదాం | ||
రుధిర జ్యోతి రగిలించి విప్లవ జ్వాల వెలిగించి | ||
బృందం: | పదండి పోదాం.. పదండి పోదాం | |
చరణం: | ఘంటసాల: | కర్షకులారా.. బృందం: ఆ..ఆ.. |
కార్మికులారా.. బృందం: ఆ..ఆ.. | ||
ఘంటసాల: | కర్షకులారా కార్మికులారా దీక్ష వహించి కదలండి | |
బృందం: | దీక్ష వహించి కదలండి | |
ఘంటసాల: | నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి | |
బృందం: | సైనికులారా రారండి | |
ఘంటసాల: | ప్రజాకంటకుల పనిపట్టించగ ప్రజాపీడకుల తుదముట్టించగ | |
బృందం: | పదండి పోదాం.. పదండి పోదాం | |
మరో ప్రపంచం మరోప్రపంచం మరో ప్రపంచం పిలిచింది | ||
పదండి పోదాం.. పదండి పోదాం | ||
ఘంటసాల: | పలువురి శక్తి ఒక్కడె దోచి ప్రభువని అన్నాడా | |
బృందం: | హోయ్ తందాన తాన తాన తందానా | |
ఘంటసాల: | ప్రజల రక్తంతో అన్నయ్య కోసం స్థూపం కడతాడా | |
బృందం: | హోయ్ తందాన తాన తాన తందానా | |
హొయ్ కూడుగుడ్డలకు కరువొచ్చింది | ||
మానం ప్రాణం చవకైపోయె ఓ...ఓ.. | ||
కూడుగుడ్డలకు కరువొచ్చింద మానం ప్రాణం చవకైపోయె | ||
బృందం: | మానం ప్రాణం చవకైపోయె | |
ఘంటసాల: | అయ్యయ్యో.. స్త్రీలకు రక్షణ లేనేలేదు | |
దోపిడి దొంగలె దొరలైనారు | ||
బృందం: | దోపిడి దొంగలె దొరలైనారు | |
అయ్యో. వేలాది ప్రజల వెట్టిచాకిరితో రాజులు హాయిగ కులుకుతున్నారు | ||
బృందం: | రాజులు హాయిగ కులుకుతున్నారు - అయ్యో రామ | |
బాలకృష్ణ: | అయితే మనం ఇప్పుడు ఏం చేయాలయ్యా? | |
ఘంటసాల: | కలసి కట్టుగా లేవరా | |
ఘంటసాల: | తిరుగుబాటునే చేయరా | |
ఘంటసాల: | ఎదురుదెబ్బలే తియ్యరా | |
ఘంటసాల: | ఒక్క బాటనే పోవరా | |
ఘంటసాల: | ఒక్క పాటనే పాడరా | |
ఘంటసాల: | ఒక్కడికోసం అందరు | |
ఘంటసాల: | అందరికోసం ఒక్కడు | |
ఘంటసాల: | తదదహో రణభేరి మ్రోగించరా వైరి కంఠములు త్రుంచరా | |
బృందం: | రణభేరి మ్రోగించరా వైరి కంఠములు త్రుంచరా | |
ఘంటసాల: | అరెరెరెరె రణభేరి మ్రోగించరా వైరి కంఠములు త్రుంచరా | |
బృందం: | రణభేరి మ్రోగించరా వైరి కంఠములు త్రుంచరా | |
హ తరికిట తరికిట తరికిట తా | ||
మరో ప్రపంచం మరోప్రపంచం మరో ప్రపంచం పిలిచింది | ||
పదండి పోదాం.. పదండి పోదాం | ||
ఘంటసాల-సుశీల: | ఓ దీనులారా ఓ పేదలారా రారండి మునుముందుగా | |
ప్రతిజ్ఞబూని అంతా ఒకే కట్టుగా | ||
బృందం: | ఓ దీనులారా ఓ పేదలారా రారండి మునుముందుగా | |
ప్రతిజ్ఞబూని అంతా ఒకే కట్టుగా | ||
ఘంటసాల: | వేసవికాలపు గాడ్పుల్లాగా | |
బృందం: | వేసవికాలపు గాడ్పుల్లాగా | |
ఘంటసాల: | వర్షాకాలపు పిడుగుల్లాగా | |
బృందం: | వర్షాకాలపు పిడుగుల్లాగా | |
ఘంటసాల: | విప్లవగర్జ నిర్ఘోషంతో | |
బృందం: | విప్లవగర్జ నిర్ఘోషంతో | |
పదండి పదండి పదండి ముందుకు | ||
ఘంటసాల: | విప్లవం బృందం: వర్ధిల్లాలి | |
ఘంటసాల: | రణభేరి బృందం: మ్రోగించాలి | |
ఘంటసాల: | విప్లవం బృందం: వర్ధిల్లాలి | |
ఘంటసాల: | రణభేరి బృందం: మ్రోగించాలి | |
ఘంటసాల: | విప్లవం బృందం: వర్ధిల్లాలి | |
ఘంటసాల: | రణభేరి బృందం: మ్రోగించాలి |
కృతజ్ఞతలు: యూ ట్యూబ్ వీడియో అందించిన టాలీవుడ్ వారికి, సాహిత్యం చాలవరకు పొందుపరచిన శ్రీ డి.వి.వి.ఎస్.నారాయణ (అమరగాయకులు, పద్మశ్రీ ఘంటసాల సహస్ర మధుర గీతాలు" సంకలన పుస్తకం) గారికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు.