1957 లో వచ్చిన జగ్గయ్య, షావుకారు జానకి నటించిన హాస్య కుటుంబ కథా చిత్రం "బలే బావ". ఇందులో ఘంటసాల మాస్టారు పాడిన రెండు చక్కని పాటలున్నాయి. మాస్టారు పాడిన "ఆనందమంతా" పాట కల్యాణి రాగం లో స్వర పరిచారు. చాల మంచి పాట. దక్షిణామూర్తి గారు గొప్పగా స్వర పరిచారు. ఇది అనిసెట్టి గారు వ్రాసిన ఒక చక్కని రొమాంటిక్ సాంగ్. అందులో మాస్టారు పాడుతుంటే ఎంతో ఆహ్లాదంగా వీనుల విందుగా వుంటుంది ఈ పాట. కొద్దిగా అరుదైన పాటే. ఈ చిత్రం కు సంబంధించి ఎక్కువ వివరాలు దొరకలేదు. ఈ పాట ఆడియో, సాహిత్యం ఇక్కడ పొందు పరుస్తున్నాను. మీకు తప్పక నచ్చుతుంది ఈ పాట.
చిత్రం: బలే బావ (1957)
చిత్రం: బలే బావ (1957)
గానం: ఘంటసాల
రచన: అనిసెట్టి
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
ఆ..ఆ...ఆ..
ప. ఆనందమంతా అనురాగమంతా
ఆశించవా యీ వేళా అందాలబాల అందాలబాల | ఆనంద |
చ. ఆ చందమామయె ఆశించి పిలచె | ఆ చంద |
జగమే పులకించె | జగమే |
వికసించె తారలే వెదజల్లె కాంతులే
ఈ రేయిలోనా ఈ హాయి లోనా ఆ..ఆ.. | ఆనంద |
చ. చిన్నారి పూలే చిరు సిగ్గు లొలికే | చిన్నారి |
వలపే చిలికేనా | వలపే |
చల్లని గాలులే సయ్యాటలాడెలే
ఈ రేయి లోనా ఈ హాయి లోనా ఆ..ఆ.. | ఆనంద |
ఆ..ఆ..ఆ..
