1959 లో శ్రీ సారథీ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మింపబడిన "భాగ్యదేవత" చిత్రం నుండి ఘంటసాల మాస్టారు జమునారాణి తో పాడిన మధుర గీతం. సాహిత్యం-శ్రీశ్రీ; సంగీతం-మాస్టర్ వేణు.
Video Courtesy: Sri Ramesh Panchakarla
చిత్రం: | భాగ్యదేవత (1959) | |||
రచన: | శ్రీ శ్రీ | |||
సంగీతం: | మాస్టర్ వేణు | |||
గానం: | ఘంటసాల, కె. జమునారాణి | |||
పల్లవి | ఘంటసాల: | వెదుకాడే కన్నులలోన, వెలిగించి ప్రేమజ్యోతి | ||
ఆనందసాగరాన తేలి ఆడరావా, నీ ఓలలాడరావా | । వెదుకాడే । | |||
జమునారాణి: | పులకించే గుండెలోన, పలికించి ప్రేమగీతి | |||
ఆనందసాగరాన తేలి ఆడరావా, నీ ఓలలాడరావా | । పులకించే । | |||
చరణం | ఘంటసాల: | మనసూగించే మధుమాస వేళ | ||
కొసరుచు పాడే కోయిల బాల - 2 | ||||
అనురాగ భావగీతి ఆలకించలేవ | । వెదుకాడే । | |||
చరణం | జమునారాణి: | మరులూరించే విరజాజితోట | ||
మలయసమీరం మసలేచోట - 2 | ||||
ఆశించె నన్ను చేరి ఆటలాడరావా | ||||
పులకించే గుండెలలోన, పలికించిన ప్రేమగీతి | ||||
ఇద్దరు: | ఆనందసాగరాన తేలి ఆడరావా, నీ ఓలలాడరావా |