| పల్లవి: | ఆ మనసులోన ఆ చూపులోన | ||
| ఆ మనసులోన ఆ చూపులోన | |||
| పరుగులెత్తే మృదుల భావనా మాలికల | |||
| అర్థమేమిటొ తెల్పుమా! | |||
| ఆశ యేమిటొ చెప్పుమా! | |||
| చరణం: | ఆ నడకలోన, | ||
| ఆ నడకలోన | |||
| దొరలు ఆ నునుసిగ్గు దొంతరలపై యొగ్గు | |||
| అంతరార్థము తెలుపుమా! | |||
| ఆశయము వివరింపుమా! | |||
| చరణం: | ఆ కులుకులోన ఆ పలుకులోన | ||
| పెనవేసికొనియున్న | |||
| వెలికి రాలేకున్న | |||
| పెనవేసికొనియున్న, వెలికి రాలేకున్న | |||
| తలపులేవో తెల్పుమా! | |||
| వలపులేవో చెప్పుమా! | |||
| వలపులేవో చెప్పుమా! | |||
| చరణం: | ఆ సొగసులోన ఆ నగవులోన | ||
| తొగరువా తెర గప్పి చిగురించు కోరికల | |||
| ఆ..ఆ..ఆ.. | |||
| తొగరువా తెర గప్పి చిగురించు కోరికల | |||
| మరుగదేమిటొ తెల్పుమా! | |||
| తెరగదేమిటొ చెప్పుమా! | |||
| చరణం: | ఆ హృదిలో, నీ మదిలో | ||
| పొటమరించిన ప్రేమ దిటవుగా పాడుకొని | |||
| పరిమళించునె తెల్పుమా! | |||
| ఫలితమిత్తునె చెప్పుమా! | |||
| ఫలితమిత్తునె చెప్పుమా! | |||
| ఆ.. మనసులోన.. |
గానం గాంధర్వం, గాత్రం అనన్యసాధ్యం, భావం అసాధారణం, భాష అతి సుందరం, ఉచ్చారణ సుస్పష్టం, అనుభూతి చర్విత చర్వణం.
14, మార్చి 2024, గురువారం
ఆ మనసులోన ఆ చూపులోన - పల్లెటూరు నుండి ఘంటసాల
టౌను పక్కకెళ్ళొద్దురో - ఘంటసాల, జిక్కీ తోడికోడళ్ళు చిత్రం నుండి
11, మార్చి 2024, సోమవారం
శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ నుండి కుశలమా!
1966 సంవత్సరంలో విడుదలైన శ్రీ శంభు ఫిలింస్ సంస్థ నిర్మించిన శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కధ చిత్రం నుండి ఘంటసాల మాస్టారు ఎస్.జానకి తో పాడిన కుశలమా నీకు (సంతోషం) అనే ఈ యుగళం రచన పింగళి, స్వరపరచినది పెండ్యాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, ఎస్.వి. రంగారావు, రేలంగి, లింగమూర్తి, జమున, గిరిజ, ఛాయాదేవి. ఈ చిత్రానికి నిర్మాత డి.లక్ష్మీనారాయణ చౌదరి మరియు దర్శకుడు ఎ.కె.శేఖర్.
| యుగళగీతం: | కుశలమా..కుశలమా.. | ||
|---|---|---|---|
| నిర్మాణం: | శ్రీ శంభు ఫిలింస్ | ||
| చిత్రం : | శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ (1966) | ||
| సంగీతం : | పెండ్యాల | ||
| రచన : | పింగళి నాగేంద్ర రావు | ||
| గానం : | జానకి, ఘంటసాల | ||
| పల్లవి : | జానకి: | కుశలమా. ఆ ఆ, కుశలమా. ఆ ఆ. | |
| కుశలమా.. ఆ ఆ ఆ కుశలమా.. ఆ ఆ ఆ | |||
| ఎటనుంటివో ప్రియతమా.. | |||
| నీ విలాసము, నీ ప్రతాపము, కుశలముగా..సిరి సిరి.. | |||
| చరణం: | జానకి: | నను నీ...వు, నిను నే...ను, తనివితీరగా, తలచుకొనీ.. ఈ. ఈ | |
| నను నీవు, నిను నేను, తనివితీరగా తలచుకొనీ | |||
| పెనగొను ప్రేమలు విరిసికొనీ, తనువులు మరచేమా..ఆ ఆ ఆ | |||
| ఘంటసాల: | కుశలమా. ఆ ఆ, కుశలమా. ఆ ఆ. | ||
| ఎటనుంటివో ప్రియతమా.. | |||
| నీ పరువము, నీ పరవశమూ, కుశలముగా..సిరి సిరీ.. | |||
| చరణం : | ఘంటసాల: | కలలోనో, మదిలో..నో.. ఓ పిలచినటుల నే, ఉలికిపడీ.. | |
| కలలోనో, మదిలోనో, పిలచినటులనే ఉలికిపడీ | |||
| ఉల్లము విసిరే, వలపుగాలిలో, మెల్లగ కదిలేమా..ఆ..ఆ ఆ | |||
| జానకి: | కుశలమా. ఆ ఆ, కుశలమా. ఆ ఆ. | ||
| ఎటనుంటివో ప్రియతమా.. | |||
| నీ విలాసము..నీ ప్రతాపము కుశలముగా..సిరి సిరి.. | |||
| చరణం 3 : | జానకి: | కొలనెటనైనా కనుపించగనే ..ఏ ఏ ఏ.., తలతువా, నీ.. విజయేశ్వరినీ | |
| కొలనెటనైనా కనుపించగనే, తలతువా నీ విజయేశ్వరినీ | |||
| ఘంటసాల: | కలగానముతో నీ చెలి నేనని నాలో నిలీచితివే... | ||
| ఇద్దరు: | కుశలమా. ఆ ఆ, కుశలమా. ఆ ఆ. | ||
| ఎటనుంటివో ప్రియతమా..కుశలమా.. | |||
| కుశలమా. ఆ ఆ |
అనురాగరాశీ ఊర్వశీ–శభాష్ పాపన్నచిత్రం నుండి ఘంటసాల పి.సుశీల పాట
1972 సంవత్సరంలో విడుదలైన సౌభాగ్య కళా చిత్ర సంస్థ నిర్మించిన శభాష్ పాపన్న చిత్రం నుండి ఘంటసాల మాస్టారు పి.సుశీల తో పాడిన అనురాగరాశీ ఊర్వశీ అనే ఈ యుగళగీతం రచన ఆరుద్ర, స్వరపరచినది ఎస్.పి.కోదండపాణి. ఈ చిత్రంలో తారాగణం జగ్గయ్య, సావిత్రి, విజయనిర్మల, నాగయ్య, రాజబాబు, విజయభాను. ఈ చిత్రానికి నిర్మాత డి.రామారావు మరియు దర్శకుడు షహీద్ లాల్.
| యుగళగీతం | అనురాగ రాశి.. ఊర్వశి | |
|---|---|---|
| చిత్రం: | శభాష్ పాపన్న (1972) | |
| సంగీతం: | కోదండపాణి | |
| గీతరచయిత: | ఆరుద్ర | |
| నేపధ్య గానం: | ఘంటసాల, పి.సుశీల | |
| పల్లవి : | ఘ: | అనురాగ రాశి.. ఊర్వశి |
| నా ఆనంద సరసి.. ప్రేయసి | ||
| నా ఆనంద సరసి.. ప్రేయసి | ||
| సు: | మనసార వలచే మన్మధ.. | |
| నా కనులందు వెలిగే దేవతా | ||
| నా కనులందు వెలిగే దేవతా | ||
| చరణం: | ఘ: | మనసే పూచిన మధువనమైతే.. మమతే కమ్మని తావి సుమా.. |
| ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ | ||
| సు: | ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ | |
| ఘ: | మనసే పూచిన మధువనమైతే.. మమతే కమ్మని తావి సుమా | |
| తనువే పొంగి తరంగమైతే.. | ||
| తనువే పొంగి తరంగమైతే.. తలపే నురగల జిలుగు సుమా.. | ||
| సు: | మనసార వలచే మన్మధ.. నా కనులందు వెలిగే దేవతా | |
| చరణం: | సు: | వయసే మంజుల వేణువు అయితే.. హొయలే మోహన గీతి సుమా |
| ఘ: | ఆ..... ఆ..... ఆ..... ఆ...... ఆ..... ఆ...... ఆ.. | |
| సు: | ఆ..... ఆ..... ఆ..... ఆ...... ఆ..... ఆ...... ఆ.. | |
| వయసే మంజుల వేణువు అయితే.. హొయలే మోహన గీతి సుమా | ||
| సొగసులు కర్పూర శిలలే అయితే | ||
| సొగసులు కర్పూర శిలలే అయితే... వగలే అరని జ్యోతి సుమా.. | ||
| ఘ: | అనురాగ రాశి.. ఊర్వశి ... నా ఆనంద సరసి.. ప్రేయసి | |
| చరణం: | సు: | మేఘము నీవై.. మెరుపును నేనై.. మృదుమాధుర్యం కురవాలి |
| ఘ: | రాగము నేనై.. రాగిణి నీవై... రసవాహినిగా సాగాలి | |
| సు: | మనసార వలచే మన్మధ.. నా కనులందు వెలిగే దేవతా | |
| నా కనులందు వెలిగే దేవతా | ||
| ఇద్దరు: | ఆహహాహా హాహా హ హా | |
| ఊ హు హూ హు హూ హూ హు హూ |