14, ఏప్రిల్ 2012, శనివారం

ఘంటసాల, బృందం పాడిన "కోటిదీప ప్రభలలో" - శ్రీ వేంకటేశ్వర వైభవం డాక్యుమెంటరీ చిత్రం నుండి

1971 లో తిరుమల - తిరుపతి శ్రీ వేంకటేశ్వరునిపై చిత్రీకరించిన డాక్యుమెంటరీ శ్రీ వేంకటేశ్వర వైభవం. ఈ చిత్రానికి శ్రీ సాలూరు రాజేశ్వర రావు గారు సంగీత దర్శకులు. ఆత్రేయ గారి పాటలను శ్రీమతులు పి.సుశీల, పి.లీల, శ్రీరంగం గోపాలరత్నం, వసంత, ఎస్.జానకి, శ్రీయుతులు ఘంటసాల మాస్టారు, పి.బి.శ్రీనివాస్, ఎస్.పి.బాలసుబ్రబ్యహ్మణ్యం, మంగళంపల్లి బాల మురళీకృష్ణ గార్లు పాడారు. మాస్టారు తమ ఆరాధ్య దైవమైన వేంకటేశ్వరుని పై కొన్ని శ్లోకాలు కూడ పాడారు. ఈ వీడియోలో ఘంటసాల, బృందం పాడిన కోటి దీప ప్రభలతో స్వామి కోనేటి నీటి అలలతో" నాలుగు నిముషాల 30 సెకన్లకు ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి శ్రీ కొంగర జగ్గయ్య గారు వ్యాఖ్యాత. మాస్టారు పాడిన పద్యం "వేదములే శిలలై వెలసినది కొండ" ను ఈ లింకులో వినవచ్చును.  అలాగే ఘంటసాల, బృందం పాడిన "ఏడుకొండల శ్రీనివాసా! మూడు మూర్తుల తిరుమలేశా!" ను ఈ లింకులో వినవచ్చును.
Thanks to "nikilkvn" for providing the video in You Tube

ఆడియో మూలం: అంతర్జాలం


సాకీ: ఘంటసాల: కోటి దీప ప్రభలలో స్వామి కోనేటి నీటి అలలలో


శతకోటి భక్తుల నయనములలో


తెప్పపై వేంచేయు తిరుపతి రమణా!
పల్లవి: బృందం: కోటి దీప ప్రభలలో స్వామి కోనేటి నీటి అలలలో


శతకోటి భక్తుల నయనములలో


తెప్పపై వేంచేయు తిరుపతి రమణా!




చరణం: బృందం: దశకంఠు దునుమాడి ధరణిజను చేకొని 


పురమునకు అరుదెంచు పురుషోత్తమా!

ఘంటసాల: రామా! ఆ..ఆ..

బృందం: దశకంఠు దునుమాడి ధరణిజను చేకొని 


పురమునకు అరుదెంచు పురుషోత్తమా!


ఆనాటి పుష్పకము ఈనాడు కనులార  | ఆనాటి |


కాంచుచున్నామయా కరువుతీరా

బృందం: కోటి దీప ప్రభలలో స్వామి కోనేటి నీటి అలలలో


తెప్పపై వేంచేయు తిరుపతి రమణా!





బృందం: కాళింది మడుగునా కాళీయు శిరమునా


చిందులను వేసినా చిన్ని తాండవ కృష్ణా!


వ్రేపల్లెలో నాటి దీపావళిని నేడు  | వ్రేపల్లెలో |


కాంచుచున్నామయా కరువుతీరా


సృష్టి, స్థితి, లయ కారణకాయా | సృష్టి |


సకల మతాచార్య తారాచార్య 


భవభయ పాప విమోచన భవ్యా


దినకర ఆత్రేయ తేజో దివ్యా


రామకృష్ణ గోవింద శ్రీ వేంకటేశా! | రామకృష్ణ |


రామకృష్ణ గోవింద శ్రీ వేంకటేశా! | రామకృష్ణ |


రామకృష్ణ గోవింద, రామకృష్ణ గోవింద  | రామకృష్ణ |


రామకృష్ణ గోవింద, రామకృష్ణ గోవింద  | రామకృష్ణ |


గోవిందా! గోవిందా! గోవిందా! గోవిందా!


గోవిందా! గోవిందా! గోవిందా! గోవిందా!

13, ఏప్రిల్ 2012, శుక్రవారం

ఘంటసాల తొలి స్వంత చిత్రం "పరోపకారం" నుండి హృదయమా సాగిపొమ్మా

1953 లో విడుదలైన "పరోపకారం" అనే చిత్రం మాస్టారి స్వంత చిత్రం. ఇదేకాక మరొక రెండు చిత్రాలు - సొంతవూరు (1956) మరియు భక్త రఘునాథ్ (1960) కూడ మాస్టారే నిర్మించారు. ఇవి మంచి చిత్రాలు. మంచి పాటలున్నాయి. కాని ఆర్ధిక పరంగా విజయవంతం కాలేదు. అందుకు మాస్టారు "పరులకు ఉపకారం చేయటం కోసమే పరోపకారం తీసాను" అన్నారట. తద్వారా మాస్టారు ఋణగ్రస్తులయ్యారు. దానితోపాటు ఆరోగ్యం కూడ దెబ్బతింది. "పరోపకారార్ధం ఇదం శరీరం" అన్నట్లు, తన ఆరోగ్యం కూడ పట్టించుకోకుండా మాస్టారు అందరికీ పరోపకారమే చేశారు, మహానుభావులు.  పరోపకారం చిత్రం తెలుగు, తమిళ భాషలలో డబ్బింగ్ తో విడుదల అయింది. ఈ చిత్రానికి మాస్టారి స్వీయ సంగీత దర్శత్వం, గీత రచన ఆరుద్ర గారు. నాలుగు పాటలు పాడారు. ముక్కామల, సావిత్రి, జి.వరలక్ష్మి గార్లు నటించిన ఈ చిత్రానికి టి.ప్రకాశరావు గారు దర్శకులు. ఈ పాట చిత్రీకరించినది బి.గోపాలం గారి మీద. అతని వెనక సిగరెట్ కాలుస్తూ ముక్కామల గారిని చూడవచ్చు.




చిత్రం; పరోపకారం (1953)

రచన: ఆరుద్ర 

సంగీతం: ఘంటసాల

గానం: ఘంటసాల 





పల్లవి: హృదయమా సాగిపొమ్మా


భావ వేగాన సాగిపొమ్మా | హృదయమా |


హృదయమా!





చరణం: కొసరి వీచేను గడుసరి గాలి 


ఆదమరిచేవు సుఖముల తేలి  | కొసరి వీచేను |


చాలు చాలించు సోమరి నడక  | చాలు చాలించు |


సాగిపోవాలి తడబడక | సాగిపోవాలి |


హృదయమా సాగిపొమ్మా


భావ వేగాన సాగిపొమ్మా


హృదయమా!





చరణం: మురళి నూదేడు కోనారి* కూన  | మురళి |


ముదము కురిసేను జగములోన  | ముదము |


ఆల మందలు ఇలు చేరబోయె | ఆల మందలు |


వేగమెత్తించు కడు జాలమాయె! | వేగమెత్తించు |


హృదయమా సాగిపొమ్మా


భావ వేగాన సాగిపొమ్మా


హృదయమా!

కృతజ్ఞతలు
1. శ్రమపడి తమిళ చిత్ర సన్నివేశానికి తెలుగు ధ్వనిముద్రణ చేసి ఘంటసాల అభిమానులకు యూట్యూబ్ ద్వారా అందించిన శ్రీ బొల్లాప్రగడ సోమేశ్వర రావు గారికి, 
2. చిత్రం వివరాలు సమకూర్చిన ఘంటసాల గళామృతము-పాటల పాలవెల్లి బ్లాగు కు, 
*కోనారి - రైతు (ఎక్కువగా శ్రీకాకుళం ప్రాంతంలో వాడతారు).
3. దృశ్య ఖండికలో నటులను గుర్తుపట్టడంలో సవరణ సూచించిన శ్రీ పట్రాయని వేణుగోపాలకృష్ణ గారికి ధన్యవాదములు.

12, ఏప్రిల్ 2012, గురువారం

విధి వంచితులై - పాండవ వనవాసం నుండి - మంచి వీడియో క్వాలిటీ తో

1965 లో విడుదలైన ఇతిహాసిక-పౌరాణిక చిత్ర రాజం పాండవ వనవాసం. ఎందరో మహామహులు శ్రమించి తయారు చేసిన మణిహారం ఈ చిత్రం. ఇందులో గుమ్మడి (ధర్మరాజు), ఎన్‌.టి.ఆర్. (భీముడు), బాలయ్య (అర్జునుడు), సావిత్రి (ద్రౌపది), ఎస్.వి.ఆర్. (ధుర్యోధనుడు), కాంతారావు (శ్రీకృష్ణుడు) నటించారు. ఈ చిత్రానికి దర్శకులు "పౌరాణిక బ్రహ్మ" అని పేరుపొందిన శ్రీ కమలాకర కామేశ్వరరావు గారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలలో 23/30 పౌరాణిక-జానపద-చారిత్రకాలు. పాండవులు శకుని నిర్వహించిన మాయా జూదంలో చిత్తుగా ఓడిపోతారు. ధర్మరాజు రాజ్యాన్నీ, తమ్ములనూ ఫణంగా పెట్టి అన్నిటినీ కోల్పోతాడు. ద్రౌపదిని దుశ్శాసనుడు సభలోకి ఈడ్చుకొచ్చి ఘోరంగా అవమానిస్తాడు. విధి ఆడిన నాటకంలో ప్రాభవం కోల్పోయిన పాండవులు కట్టు బట్టలతో, పురవీధులగుండా నడుస్తూ, పరాభవాన్ని దిగమింగుకుంటూ జనవాసాన్ని వీడి వనవాసానికి బయలుదేరుతారు. ఈ సన్నివేశానికి తగిన పాటను శ్రీ సముద్రాల రాఘవాచార్య గారు వ్రాయగా, మాస్టారు కరుణరసం ఉట్టిపడేలా చక్రవాక రాగంలో బాణీకట్టి గానం చేసారు. ఈ పాట దృశ్య, శ్రవణ, సాహిత్యాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను.

Thanks to KVR Harish of "Bank of Sri Ghantasala" Machilipatnam, AP 
for loading the You Tube Video.

మహానుభావులు

ఆడియో మూలం: అంతర్జాలం

సాకీ: ఘంటసాల: న్యాయానికే పరాజయమా!


వంచనకే ధర్మము తలవంచేనా!

బృందం: ఆ.. ఆ.. ఆ.. ఆ.. 
పల్లవి: ఘంటసాల: విధి వంచితులై విభవము వీడి 


అన్నమాట కోసం అయ్యో! అడవి పాలయేరా! | విధి వంచితులై |
చరణం: ఘంటసాల: నీ మది రగిలే కోపానలము  


ఈ మహినంతా దహియించేనని


మోమును దాచేవ ధర్మరాజా!

బృందం: అయ్యో!.. అడవి పాలయేరా!
చరణం: ఘంటసాల: సభలో చేసిన శపథముదీరా  


పావుల నదిలో త్రుంచెదనేనని


బాహువులూచేవా భీమసేనా!

బృందం: ఆహా…..  అడవి పాలయేరా!
చరణం: ఘంటసాల: ఆలములోన కౌరవసేన  


అమ్ములవానా ముంచెదనేనని


ఇసుమును చల్లేవ సవ్యసాచి  | విధి వంచితులై |
చరణం: ఘంటసాల: ఏ యుగమందూ ఏ ఇల్లాలు 


ఎరుగదు తల్లీ ఈ అవమానం | ఏ యుగమందూ |


నీ పతి సేవయె నీకు రక్ష 

బృందం: ఆహా…..

11, ఏప్రిల్ 2012, బుధవారం

భార్య, భర్త ఎలాంటివారో చెప్పే పద్యాలు - చింతామణి చిత్రం నుండి

బహుళ ప్రజాదరణ పొందిన నాటకం చింతామణి. దీనిని  వ్రాసిన వారు అలనాటి సంఘ సంస్కర్త, నాటక రచయిత, కవి అయిన శ్రీ కాళ్ళకూరి నారాయణరావు (1871-1927) గారు. వీరి రచనలలో వరకట్నం కు వ్యతిరేకంగా వ్రాసిన "వర విక్రయము", వేశ్యా వృత్తిని ఖండిస్తూ వ్రాసిన "చింతామణి" నాటకాలు పేరెన్నిక గన్నవి. చింతామణి నాటకాన్ని రెండు సార్లు (1933 మరియు 1956) సినిమాగా తీసారు. ఈ చిత్రంలో కవి బిల్వ మంగళుడు గా ఎన్.టి.ఆర్., అతని భార్య గా జమున, చింతామణి అనే వేశ్య పాత్రలో భానుమతి నటించారు. గుణవతియైన భార్యకుండవలసిన లక్షణాలను, అలాగే భార్యలను బాధించే కొందరు భర్తలను గురించి బిల్వ మంగళుడు ఈ విధంగా వివరిస్తాడు.
కృతజ్ఞతలు: యూ ట్యూబ్ వీడియో సమర్పించిన శ్రీ హరీష్ (Bank of Sri Ghantasala, Machilipatnam, A.P.) 
చిత్రం:         చింతామణి (1956)
మూలం:      చింతామణి నాటకము
రచన:         కాళ్ళకూరి నారాయణ రావు 
గానం:         ఘంటసాల వెంకటేశ్వర రావు
సంగీతం:      అద్దేపల్లి రామారావు, టి.వి.రాజు
సంగీత పర్యవేక్షణ:   పి.భానుమతి


పద్యం:
కష్ట భరితంబు బహుళ దుఃఖప్రదంబు

సారరహితంబునైన సంసారమందు

భార్యయను స్వర్గమొకటి కల్పనము చేసె

పురుషులనిమిత్తము పురాణ పూరుషుండు

ఆ.. ఆ.. ఆ..


వచనం:
భార్యలను కష్టాల పెట్టె భర్తలు మాత్రం లేరా అని కదూ, యెందుకు లేరు


పద్యం:
అర్ధాంగ లక్ష్మియైనట్టి యిల్లాలిని తమయింటి దాసిగా తలచువారు

చూడు..

అర్ధాంగ లక్ష్మియైనట్టి యిల్లాలిని తమయింటి దాసిగా తలచువారు

చీటికి మాటికి చిరబురలాడుచు పెండ్లాము నూరక యేడ్పించువారు

పడపుగత్తెల ఇండ్ల బానిసెంచై ధర్మపత్ని యన్నను మండిపడెడివారు

బయట నెల్లరచేత పడివచ్చి యింటను పొలతినూరక తిట్టి పోయువారు 

పెట్టుపోతల పట్లగలట్టి లోటు తిట్టుకొట్టులతోడను తీర్చువారు

ఖలులు, కఠినులు, హీనులు, కలుషమతులు కలరు పురుషులలోన పెక్కండ్రు నిజము

9, ఏప్రిల్ 2012, సోమవారం

శివునిపై భావోద్వేగమైన భక్తి గీతం మరియు స్తోత్రం ఘంటసాల గళంలో- సీతారామ కల్యాణం నుండి

1961 లో విడుదలైన సీతారామ కల్యాణం చిత్రం శ్రీ ఎన్‌.టి.ఆర్. స్వీయ దర్శకత్వంలో అతని సోదరుడైన త్రివిక్రమరావు గారు ఎన్‌.ఏ.టి. పతాకంపై నిర్మించిన పౌరాణిక దృశ్య కావ్యం. సంగీతం శ్రీ గాలి పెంచల నరసింహారావు గారు. ఈ చిత్రంలోనిదే "సీతారాముల కల్యాణము చూతము రారండి" అనే పాట ఈ నాటికీ ప్రతి పెళ్ళిలోనూ వినబడుతుంది. ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, ఎన్‌.టి.ఆర్. నటన, గాలి పెంచల నరసింహారావు గారి సంగీతం ఈ చిత్రానికి ఆయువుపట్టు. అయితే నిజానికి ఈ పాట, స్తోత్రం శ్రీ సాలూరు రాజేశ్వర రావు గారు స్వరపరచి కారణాంతరాల వలన తప్పుకున్నారట. ఈ చిత్రంలో శివుడు, పార్వతి కైలాసంలో తాండవం చేసే సమయంలో రావణుడు వస్తాడు. నంది శివదర్శనానికి అనుమతించకపోతే లంకేశ్వరుడు పర్వత సానువులో కూర్చుని స్వయం విరచిత శివతాండవ స్తోత్రాన్ని గానం చేస్తాడు. మూల స్తోత్రంలో 15 చరణాలున్నాయి. కాని సినిమాలో కొద్ది భాగం మాత్రమే ఉపయోగించారు. అది మాస్టారు అద్భుతంగా గానం చేసారు. అయితే కొన్ని పదాలను కూడ కారణాంతరాల వలన మార్చినట్లు కనబడుతుంది. ఈ స్తోత్రం యొక్క మొత్తాన్ని ఇక్కడ చూడవచ్చును. సినిమాలో ఈ స్తోత్రం "కానరార కైలాస నివాస" అనే సముద్రాల సీ. వ్రాసిన పాట తరువాత వస్తుంది. ఈ చిత్రంలో దాదాపు 26 వరకు పాటలు, పద్యాలు వున్నాయి. 


చిత్రం: సీతారామ కల్యాణం (1958)

పాట రచన: సముద్రాల రాఘవాచార్య 

స్తోత్రం: రావణాసుర విరచితము

సంగీతం: సాలూరు రాజేశ్వర రావు (గాలి పెంచల)

గానం: ఘంటసాల వెంకటేశ్వర రావు 


పాట: పల్లవి: కానరార కైలాస నివాస బాలేందుధరా జటాధరా హరా


కానరార కైలాస నివాస బాలేందుధరా జటాధరా


కానరార


భక్తజాల పరిపాల దయాళా  | భక్తజాల |


హిమశైల సుతా ప్రేమలోలా


కానరార కైలాస నివాస బాలేందుధరా జటాధరా


కానరార

చరణం: నిన్ను చూడ మది కోరితిరా..


నిన్ను చూడ మది కోరితిరా నీ సన్నిధానమున చేరితిరా | నిన్ను చూడ |


కన్నడ సేయక కన్ను చల్లగ మన్నన సేయర గిరిజారమణా


కానరార కైలాస నివాస బాలేందుధరా జటాధరా


కానరార

చరణం: సర్ప భూషితాంగ, కందర్ప దర్పభంగ | సర్ప |


భవ పాశనాశ, పార్వతీ మనోహర


హే! మహేశ, వ్యోమకేశ, త్రిపురహర


కానరార కైలాస నివాస బాలేందుధరా జటాధరా


కానరార

స్తోత్రం:
జయత్వదభ్ర విభ్రమత్ భ్రమద్భుజంగమస్ఫురత్ 


ధగద్ధగద్వినిర్గమత్ కరాళఫాల హవ్యవాట్!


ధిమిద్ధిమిద్ధిమిద్ద్వనన్‌ మృదంగ తుంగ మంగళ


ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవశ్శివః


ఓం నమః శివాయ 





అగ(ఖ)ర్వ సర్వ మంగళా కళాకదంబ మంజరీ


రసప్రవాహ మాధురీ విజృంభణా మధూవ్రతం


స్మరాంతకం, పురాంతకం, భవాంతకం, మఖాంతకం


గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే


ఓం నమః హరాయ 





ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాలి మఝ్ఝటా


విడంబి కంఠ కంధరా రుచి ప్రబంధ కంధరం


స్మరచ్ఛిదం, పురచ్ఛిదం, భవచ్ఛిదం, మఖచ్ఛిదం


గజచ్ఛికాంధకచ్ఛిదం తమంత కచ్ఛిదం భజే

ఈ స్తోత్రంలో కొద్ది భాగాన్ని 1972 లో శ్రీ బాపు దర్శకత్వంలో విడుదలయిన సంపూర్ణరామాయణం చిత్రంలో మాధవపెద్ది పాడగా, రావణపాత్రధారి శ్రీ ఎస్.వి.ఆర్. పై చిత్రీకరించారు.
 
ఋషి పీఠం నుంచి పద్యాల వివరణ
(కొన్ని పదాలలో మార్పులున్నాయని గమనించగలరు)

మొదటి పద్యం: జయతు - సర్వోత్కృష్టుడై రాజిల్లు గాక!; అదభ్ర - అధికమైన; విభ్రమభ్రమత్ - వేగంగా తిరుగుతున్న; భుజంగమశ్వశత్ - బుసకొట్టు పాములచేత (సినిమాలో భుజంగమస్ఫురత్ అని వుంది); వినిర్గమత్ - వెలికి వస్తూ; క్రమస్ఫురత్ - క్రమంగా మెరుస్తున్న; కరాల(ళ) - భయంకరమైన; ఫాల -నుదుట;  హవ్యవాట్ -  అగ్ని కలవాడు; ధిమిద్ధిమిద్ధ్వనత్ - ధిమి ధిమి ధ్వనులు మ్రోగుతున్న; మృదంగ - మద్దెల యొక్క; తుంగ - మిక్కిలియైన; మంగళ ధ్వని క్రమ - మంగళమయ ధ్వనులననుసరించి; ప్రవర్తిత - సాగించబడిన; ప్రచండ తాండవ - ప్రచండంగా తాండవిస్తున్న; శివః - శివుడు.
తాత్పర్యం: అధికమైన వేగంతో తిరుగుతున్న సమయంలో పాములు బుసలు కొడుతుండగా, వెలికి కాంతులు వెదజల్లుతూ ప్రకాశిస్తున్న ఫాలనేత్రంతో, ధిమిధిమి ధ్వనుల ఉన్నతమైన మంగళనాదాలకు అనుకూలంగా అడుగులు వేస్తూ ప్రచండంగా తాండవిస్తున్న శివుడు సర్వోన్నతుడై రాజిలుగాక!

రెండవ పద్యం: అఖర్వ - పరిపూర్ణురాలైన (అగర్వ అని వాడారు సినిమాలో); సర్వ మంగళా - గౌరీదేవి యొక్క; కలాకదంబ - విలాస సమూహములనెడి; మంజరీ - గుత్తిలోని; రసప్రవాహ మాధురి - మకరంద మాధుర్యాల తీయదనానికై; విజృంభణ - చెలరేగు; మధువ్రతం - తుమ్మెద వంటివాడై;  అంతకం - నశింపజేయువాడు; స్మర - మన్మధుడు; పుర - త్రిపురాసురుడు; భవ - సంసారం; మఖ - యజ్ఞం (దక్ష); గజ - గజాసురుడు; అంధక - అంధకాసురుడు; అంతక - నాశనము; అంతకాంతక - యముడు; భజే - ఆశ్రయిస్తున్నాను.
తాత్పర్యం: గొప్పదైన సర్వమంగళాదేవి కళావిలాసాల తీయదనపు ఒరవడిలో గండు తుమ్మెదలా ఆసక్తితో చెలరేగేవాడు (శివుడు) - మన్మథునీ, పురాసుర-అంధకాసురులను, సంసారాన్నీ, గజాసురునీ, యముడినీ సంహరించిన స్వామిని ఆశ్రయిస్తున్నాను.

మూడవ పద్యం: ప్రఫుల్ల - విరబూసిన; నీల పంకజ - నల్ల కలువల; ప్రపంచకాలిమప్రభా - గుంపుయొక్క నల్లని కాంతులను (సినిమాలో "ప్రచండ కాలి మఝ్ఝటా" అని వుంది); అవలంబి (విడంబి) - దాల్చియున్న; కంఠ కందలీరుచి - నడుమ భాగములోని కాంతితో; ప్రబద్ధ (ప్రబంధ) - బాగా ప్రకాశిస్తున్న; కంధరం - కంఠముగలవానిని; స్మరచ్ఛిదం - మన్మథుని దునిమినవాడు; పురచ్ఛిదం - త్రిపురాసురుని ఛేదించినవాడు; భవచ్ఛిదం - సంసార బంధములను తొలగించువాడు; మఖచ్ఛిదం - దక్ష యజ్ఞ ధ్వంసకుని; గజచ్ఛిత్ + అంధకచ్ఛిదం - గజాసురుని, అంధకాసురుని ఛేదించిన వానిని; తం అంతకచ్ఛిదం - యముని సంహరించిన శివుని; భజే - ఆశ్రయిస్తున్నాను.
తాత్పర్యం: నల్లకలువల గుంపుల నడుమనున్న గాఢమైన నల్లదనంతో పోలిన కంఠం గలవానిని, మన్మథునీ, త్రిపురాసురునీ, సంసార బాధలను, దక్ష యజ్ఞాన్నీ, గజాసురునీ, అంధకాసురునీ, యముణ్ణీ హరించే ఆ పరమశివుని ఆశ్రయిస్తున్నాను. 

కృతజ్ఞతలు: పరోక్షంగా దోహద పడిన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి శుభచరణాలకు నమస్సులతో. ఈ సమాచారం నలుగురితో పంచుకోవాలనే సంకల్పంతో ఈ వివరాలు సేకరించి వ్రాయడమైనది. ఏవైనా పొరపాట్లు దొర్లివుంటే చదువరులు సవరణలు, సూచలను తప్పక నా దృష్టికి తీసుకురాగలరు.

8, ఏప్రిల్ 2012, ఆదివారం

శ్రీకృష్ణార్జున యుద్ధం నుండి - శ్లోకం, పాట, పద్యం - దృశ్య, శ్రవణ సాహిత్యాలతో

1963 లో వచ్చిన పౌరాణిక చిత్రం శ్రీ కృష్ణార్జున యుద్ధం. ఇది గయోపాఖ్యానం ఆధారంగా వచ్చిన చిత్రం. ఒకనాడు ఉదయాన శ్రీకృష్ణుడు సూర్యదేవునకు అర్ఘ్యం ఇస్తుండగా, మణిపురాన్ని ఏలే గయుడనే గంధర్వ రాజు పుష్పక విమానంలో ఆకాశమార్గాన వెళుతుంటాడు. అతడు విలాసవంతుడై, పరిచారికలతో సరస సల్లాపాలాడుతూ, భుజించి, తాంబూలం వేసుకుని, నమలిన పిప్పిని క్రిందికి ఉమ్మివేస్తాడు. అది అర్ఘ్యమిస్తున్న శ్రీకృష్ణుని దోసిలిలో పడుతుంది. దానికి కృష్ణుడు ఆగ్రహోదగ్రుడై ఆ గంధర్వుని శిరస్సు తన చక్రాయుధంతో ఖండిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ సన్నివేశం కోసం మాస్టారు పాడిన రెండు పద్యాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఇందులో గల శ్లోకం రామాయణంలోని యుద్ధకాండంలో అగస్త్య మహర్షి శ్రీరామునకు ఉపదేశించిన "ఆదిత్య హృదయం" లోనిది.  

Sincere Thanks to "Skyudyam" who posted this video in you tube.

ఆడియో మూలం: ఘంటసాల గాన చరిత మరియు అంతర్జాలం

చిత్రం: శ్రీ కృష్ణార్జున యుద్ధం (1963)

శ్లోకం: ఆదిత్య హృదయం నుండి 

గీత/పద్య రచన: పింగళి నాగేంద్ర రావు

సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు 

గానం: ఘంటసాల, బి.వసంత, స్వర్ణలత


శ్లోకం: ఘంటసాల: నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః


జ్యోతిర్గణానాం పతయే దినాధి పతయే నమః


జయాయ జయ భద్రాయ హర్యశ్వాయ నమోన్నమః


నమో నమస్సహస్రాంశో ఆదిత్యాయ నమోన్నమః




పాట: స్వర్ణలత: నీకు సాటి రవితేజ నీవేలే మహరాజ  | నీకు సాటి |

ఇద్దరు: నీకు సాటి రవితేజ నీవేలే మహరాజ 

స్వర్ణలత: అందచందాలలో జయంత వసంతులైనా 

వసంత: ఐశ్వర్య వైభవాలలో అమరేంద్ర కుబేరులైనా

స్వర్ణలత: త్రిభువన పాలనలో త్రిమూర్తులైనా 


నీతో తులతూగరయా.. | నీకు సాటి |




పద్యం: ఘంటసాల: ధరణీ గర్భము దూరుగాక! వడి పాతాళంబునన్‌ చేరు గా


క! రహస్యంబుగ దిగ్గజేంద్రముల వెన్కన్ దాగునేగాక! ఆ


హర బ్రహ్మాదులె వాని రక్షణకు తోడై వచ్చురే గాక! ము


ష్కర గంధర్వు శిరంబు ద్రుంచెద మహోగ్ర కౄర  చక్రాహతిన్‌


ఆ.. ఆ.. ఆ.. 

విన్నపము

ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com

మాస్టారు పాడిన నేరు చిత్రాలు

చి-అంతస్తులు-1965 (4) చి-అంతా మనవాళ్ళే-1954 (1) చి-అందం కోసం పందెం-1971 (2) చి-అగ్గి బరాటా-1966 (1) చి-అత్తా ఒకింటి కోడలే-1958 (1) చి-అన్నపూర్ణ-1960 (1) చి-అప్పుచేసి పప్పుకూడు-1959 (5) చి-అమరశిల్పి జక్కన్న-1964 (2) చి-అమాయకుడు-1968 (1) చి-ఆడ పెత్తనం-1958 (2) చి-ఆత్మగౌరవం-1966 (1) చి-ఆనందనిలయం-1971 (1) చి-ఆప్తమిత్రులు-1963 (1) చి-ఆరాధన-1962 (2) చి-ఆస్తిపరులు-1966 (1) చి-ఇద్దరు పెళ్ళాలు-1954 (1) చి-ఇద్దరు మిత్రులు-1961 (3) చి-ఉమాచండీగౌరీశంకరుల కధ-1968 (1) చి-ఉమాసుందరి-1956 (3) చి-ఉయ్యాల జంపాల-1965 (1) చి-ఉషాపరిణయం-1961 (1) చి-ఋష్యశృంగ-1961 (1) చి-ఏకవీర-1969 (1) చి-కనకదుర్గ పూజా మహిమ-1960 (2) చి-కన్నకొడుకు-1973 (1) చి-కన్యాశుల్కం-1955 (2) చి-కలసివుంటే కలదుసుఖం-1961 (2) చి-కాంభోజరాజుకథ-1967 (1) చి-కాళహస్తి మహత్మ్యం-1954 (10) చి-కీలుగుఱ్ఱం-1949 (4) చి-కుంకుమ రేఖ-1960 (1) చి-కులగౌరవం-1972 (1) చి-కృష్ణ లీలలు-1959 (3) చి-కృష్ణప్రేమ-1961 (3) చి-కొడుకు కోడలు-1972 (1) చి-గాలిమేడలు-1962 (2) చి-గుండమ్మకథ-1962 (1) చి-గుడిగంటలు-1964 (1) చి-గుణసుందరి కథ-1949 (1) చి-గులేబకావళి కథ-1962 (4) చి-గృహప్రవేశము-1946 (1) చి-గృహలక్ష్మి-1967 (3) చి-చండీరాణి-1953 (1) చి-చంద్రహారం-1954 (3) చి-చంద్రహాస-1965 (1) చి-చరణదాసి-1956 (2) చి-చింతామణి-1956 (1) చి-చిట్టి తమ్ముడు-1962 (1) చి-చిలకా-గోరింక-1966 (1) చి-చివరకు మిగిలేది!-1960 (1) చి-చెంచు లక్ష్మి-1958 (1) చి-జగదేకవీరుని కథ-1961 (3) చి-జయం మనదే-1956 (1) చి-జయభేరి-1959 (3) చి-జయసింహ-1955 (3) చి-జరిగిన కథ-1969 (1) చి-జీవన తరంగాలు-1973 (1) చి-జైజవాన్‌-1970 (1) చి-టైగర్ రాముడు-1962 (1) చి-డా.ఆనంద్-1966 (1) చి-డా.చక్రవర్తి-1964 (1) చి-తెనాలి రామకృష్ణ-1956 (5) చి-తేనె మనసులు-1965 (1) చి-తోడికోడళ్ళు-1957 (1) చి-తోడికోడళ్ళు-1977 (1) చి-దీపావళి-1960 (2) చి-దేవకన్య-1968 (1) చి-దేవత-1965 (1) చి-దేవదాసు-1953 (1) చి-దేవాంతకుడు-1960 (1) చి-దేశద్రోహులు-1964 (1) చి-దొరికితే దొంగలు (1) చి-ద్రోహి-1948 (1) చి-ధర్మదాత-1970 (1) చి-ధర్మాంగద-1949 (1) చి-నమ్మినబంటు-1960 (1) చి-నర్తనశాల-1963 (2) చి-నలదమయంతి-1957 (1) చి-నవగ్రహపూజా మహిమ-1964 (1) చి-నాదీ ఆడజన్మే-1965 (1) చి-నిరుపేదలు-1954 (1) చి-నిర్దోషి-1951 (1) చి-నిర్దోషి-1967 (1) చి-పరమానందయ్య శిష్యుల కథ-1966 (2) చి-పరోపకారం-1953 (2) చి-పల్నాటి యుద్ధం-1947 (3) చి-పల్నాటి యుద్ధం-1966 (1) చి-పల్లెటూరి పిల్ల-1950 (1) చి-పల్లెటూరు-1952 (4) చి-పవిత్ర బంధం-1971 (1) చి-పవిత్ర హృదయాలు-1971 (1) చి-పసుపు కుంకుమ-1955 (1) చి-పాండవ వనవాసం-1965 (5) చి-పాండురంగ మహత్మ్యం-1957 (1) చి-పాతాళ భైరవి-1951 (1) చి-పిచ్చి పుల్లయ్య-1953 (1) చి-పిడుగు రాముడు-1966 (1) చి-పూజాఫలం-1964 (1) చి-పెండ్లి పిలుపు-1961 (1) చి-పెద్ద మనుషులు-1954 (2) చి-పెళ్ళి కాని పిల్లలు-1961 (2) చి-పెళ్ళి చేసి చూడు-1952 (3) చి-పెళ్ళి సందడి-1959 (1) చి-పెళ్ళినాటి ప్రమాణాలు-1958 (3) చి-పేదరాశి పెద్దమ్మ కథ-1968 (2) చి-పొట్టి ప్లీడరు-1966 (1) చి-ప్రపంచం-1950 (1) చి-ప్రమీలార్జునీయం-1965 (2) చి-ప్రియురాలు-1952 (1) చి-ప్రేమ నగర్-1971 (1) చి-ప్రేమ-1952 (1) చి-బంగారు గాజులు-1968 (1) చి-బండ రాముడు-1959 (1) చి-బందిపోటు-1963 (1) చి-బడి పంతులు-1972 (1) చి-బభ్రువాహన-1964 (3) చి-బలే బావ-1957 (1) చి-బాల భారతం-1972 (1) చి-బాలనాగమ్మ-1959 (4) చి-బాలభారతం-1972 (1) చి-బాలరాజు కథ-1970 (1) చి-బాలరాజు-1948 (2) చి-బాలసన్యాసమ్మ కథ-1956 (1) చి-బావమరదళ్ళు-1961 (1) చి-బికారి రాముడు-1961 (1) చి-బొబ్బిలి యుద్ధం-1964 (1) చి-బ్రతుకుతెరువు-1953 (1) చి-భక్త అంబరీష-1959 (2) చి-భక్త జయదేవ-1961 (1) చి-భక్త తుకారాం-1973 (3) చి-భక్త రఘునాథ్-1960 (2) చి-భక్త రామదాసు-1964 (1) చి-భక్త శబరి-1960 (1) చి-భట్టి విక్రమార్క-1960 (1) చి-భలే అమ్మాయిలు-1957 (1) చి-భాగ్యదేవత-1959 (1) చి-భాగ్యరేఖ-1957 (1) చి-భామా విజయం-1967 (2) చి-భీమాంజనేయ యుద్ధం-1966 (4) చి-భీష్మ-1962 (5) చి-భూకైలాస్-1958 (4) చి-భూలోకంలో యమలోకం-1966 (1) చి-మంచి మనసుకు మంచి రోజులు-1958 (1) చి-మంచి మనసులు-19 (1) చి-మంచిరోజులు వచ్చాయి-1972 (1) చి-మనదేశం-1949 (3) చి-మనసు మమత (1) చి-మనుషులు-మమతలు-1965 (1) చి-మరపురాని కథ-1967 (2) చి-మర్మయోగి-1964 (1) చి-మల్లీశ్వరి-1951 (3) చి-మహాకవి కాళిదాదు-1960 (2) చి-మహామంత్రి తిమ్మరుసు-1962 (3) చి-మాయాబజార్-1957 (3) చి-మూగ మనసులు-1964 (2) చి-మోహినీ భస్మాసుర-1966 (1) చి-యశొద కృష్ణ-1975 (1) చి-యోగి వేమన-1947 (1) చి-రంగుల రాట్నం-1967 (1) చి-రక్త సిందూరం-1967 (1) చి-రక్షరేఖ-1949 (1) చి-రణభేరి-1968 (2) చి-రహస్యం-1967 (2) చి-రాజ మకుటం-1960 (1) చి-రాజకోట రహస్యం-1971 (2) చి-రాజు పేద-1954 (2) చి-రాము-1968 (2) చి-రుణానుబంధం-1960 (1) చి-రేణుకాదేవి మహాత్మ్యం-1960 (1) చి-రోజులు మారాయి-1955 (1) చి-లక్ష్మమ్మ-1950 (2) చి-లక్ష్మీ కటాక్షం-1970 (2) చి-లవకుశ-1963 (1) చి-వదినగారి గాజులు-1955 (1) చి-వరుడు కావాలి-1957 (1) చి-వాగ్దానం-1961 (3) చి-వారసత్వం-1964 (2) చి-వాల్మీకి-1963 (1) చి-విచిత్ర కుటుంబం-1969 (2) చి-విజయం మనదే-1970 (1) చి-వినాయక చవితి-1957 (5) చి-విమల-1960 (2) చి-విష్ణుమాయ-1963 (1) చి-వీర కంకణం-1957 (2) చి-వీరాంజనేయ-1968 (2) చి-వెలుగు నీడలు-1961 (2) చి-వెలుగునీదలు-1961 (1) చి-శకుంతల-1966 (1) చి-శభాష్ పాపన్న-1972 (1) చి-శభాష్ రాజా-1961 (1) చి-శభాష్ రాముడు-1959 (1) చి-శాంతి నివాసం-1960 (1) చి-శోభ-1958 (1) చి-శ్రీ గౌరీ మహత్మ్యం-1956 (4) చి-శ్రీ వేంకటేశ్వర వైభవం-1971 (1) చి-శ్రీ సత్యనారాయణ మహత్యం-1964 (2) చి-శ్రీ సింహాచలక్షేత్ర మహిమ-1965 (1) చి-శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ-1966 (1) చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ-1966 (1) చి-శ్రీకృష్ణ కుచేల-1961 (2) చి-శ్రీకృష్ణ తులాభారం-1966 (1) చి-శ్రీకృష్ణ పాండవీయం-1966 (3) చి-శ్రీకృష్ణ విజయం-1971 (1) చి-శ్రీకృష్ణమాయ-1958 (2) చి-శ్రీకృష్ణార్జున యుద్ధం-1963 (1) చి-శ్రీవేంకటేశ్వర మహత్మ్యం-1960 (1) చి-శ్రీవేంకటేశ్వర వైభవం-1971 (2) చి-షావుకారు-1950 (2) చి-సంతానం-1955 (5) చి-సంపూర్ణ రామాయణం-1972 (4) చి-సంసారం-1950 (3) చి-సతీ అనసూయ-1957 (2) చి-సతీ సక్కుబాయి-1965 (3) చి-సతీ సులోచన-1961 (2) చి-సత్య హరిశ్చంద్ర-1965 (2) చి-సప్తస్వరాలు-1969 (1) చి-సారంగధర-1957 (2) చి-సీతారామ కల్యాణం-1961 (2) చి-సుమంగళి-1965 (1) చి-స్వప్న సుందరి-1950 (3) చి-స్వర్గసీమ-1945 (1) చి-స్వర్ణ మంజరి-1962 (1) చి-హంతకులొస్తున్నారు జాగ్రత్త-1966 (1) చి-హరిశ్చంద్ర-1956 (2)

సహగాయనీ గాయకులు

గా-ఎ.పి.కోమల తో (3) గా-ఎం.వి.రాజమ్మ తో (1) గా-ఎస్.జానకి తో (5) గా-గానసరస్వతి తో (1) గా-గోపాలరత్నం తో (1) గా-ఘంటసాల (79) గా-ఘంటసాల-పి.సుశీల (3) గా-ఘంటసాల-బృందం (5) గా-జమునారాణి తో (2) గా-జి.వరలక్ష్మి తో (1) గా-జిక్కి తో (1) గా-జిక్కీ తో (4) గా-జిక్కీ-బాలసరస్వతి తో (1) గా-జిక్కీతో (5) గా-పలువురి తో (1) గా-పి.కన్నాంబ తో (1) గా-పి.బి.శ్రీనివాస్ తో (3) గా-పి.భానుమతి తో (11) గా-పి.లీల తో (21) గా-పి.సుశీల తో (49) గా-పి.సుశీల-బృందంతో (2) గా-పిఠాపురం తో (1) గా-బాలసరస్వతి తో (3) గా-బృందం తో (35) గా-బృందంతో (2) గా-బెంగుళూరు లత తో (1) గా-బెజవాడ రాజరత్నం తో (2) గా-భానుమతి-పిఠాపురం తో (1) గా-మాధవపెద్ది (5) గా-రాధాజయలక్ష్మి తో (2) గా-రేణుక తో (1) గా-లతా మంగేష్కర్ తో (1) గా-వి.జె.వర్మతో (1) గా-వి.సరళ తో (2) గా-శరావతి తో (1) గా-శోభారాణితో (2) గా-శ్రీదేవి తో (1) గా-సరోజిని తో (1) గా-సి.కృష్ణవేణి తో (2) గా-సుందరమ్మ తో (1) గా-సుశీల-బృందం తో (1)

మాస్టారి పాటల సంగీత దర్శకులు

స-విజయభాస్కర్ (1) సం -A.M.రాజా (1) సం- ఘంటసాల (1) సం-అద్దేపల్లి (1) సం-అశ్వత్థామ (4) సం-అశ్వద్ధామ (1) సం-ఆదినారాయణ రావు (5) సం-ఆదినారాయణరావు (2) సం-ఆర్.గోవర్ధనం (2) సం-ఆర్.సుదర్శనం (2) సం-ఆర్.సుదర్శనం-ఆర్.గోవర్ధనం (1) సం-ఎం.రంగారావు (1) సం-ఎల్.మల్లేశ్వరరావు (3) సం-ఎస్.పి.కోదండపాణి (12) సం-ఓగిరాల (1) సం-ఓగిరాల-అద్దేపల్లి (2) సం-ఓగిరాల-టి.వి.రాజు (4) సం-కె.ప్రసాదరావు (1) సం-కె.వి. మహదేవన్ (2) సం-కె.వి.మహదేవన్ (15) సం-గాలి పెంచల (6) సం-ఘంటసాల (79) సం-జె.వి.రాఘవులు (1) సం-జోసెఫ్-విజయాకృష్ణమూర్తి (2) సం-జోసెఫ్.వి.కృష్ణమూర్తి (1) సం-టి.ఆర్.పాప (1) సం-టి.ఎం.ఇబ్రహీం (1) సం-టి.చలపతిరావు (9) సం-టి.జి.లింగప్ప (3) సం-టి.వి.రాజు (31) సం-నాగయ్య-ఓగిరాల (1) సం-నాగయ్య-తదితరులు (1) సం-పామర్తి (5) సం-పామర్తి-సుధీర్ ఫడ్కె (1) సం-పామర్తి-సుధీర్ ఫడ్కే (1) సం-పి.శ్రీనివాస్ (2) సం-పెండ్యాల (38) సం-బాబురావు (1) సం-బాలాంత్రపు (1) సం-బి.గోపాలం (2) సం-బి.శంకర్ (1) సం-మణి-పూర్ణానంద (1) సం-మల్లేశ్వరరావు (1) సం-మాస్టర్ వేణు (12) సం-ముగ్గురు దర్శకులు (2) సం-రాజన్‌-నాగేంద్ర (2) సం-రాజు-లింగప్ప (2) సం-రాజేశ్వరరావు-హనుమంతరావు (1) సం-రామనాథన్‌ (3) సం-రామనాథన్‌-పామర్తి (1) సం-విజయా కృష్ణమూర్తి (3) సం-విశ్వనాథన్‌-రాఘవులు (1) సం-విశ్వనాథన్‌-రామ్మూర్తి (5) సం-వై.రంగారావు (1) సం-సర్దార్ మల్లిక్ - పామర్తి (1) సం-సాలూరు (44) సం-సాలూరు-గోపాలం (1) సం-సి. ఆర్. సుబ్బరామన్ (1) సం-సుదర్శనం-గోవర్ధనం (12) సం-సుబ్బయ్యనాయుడు (2) సం-సుబ్బురామన్ (1) సం-సుబ్బురామన్‍-విశ్వనాథన్ (1) సం-సుసర్ల (18) సం-హనుమంతరావు (2) సం-MSV-రామ్మూర్తి-పామర్తి (1)

మాస్టారి పాటల రచయితలు

ర-అనిసెట్టి (13) ర-అనిసెట్టి-పినిసెట్టి (1) ర-ఆత్రేయ (18) ర-ఆదినారాయణ రావు (1) ర-ఆరుద్ర (39) ర-ఉషశ్రీ (1) ర-ఎ.వేణుగోపాల్ (1) ర-కాళిదాసు (3) ర-కాళ్ళకూరి (1) ర-కొసరాజు (17) ర-కోపల్లి (1) ర-గబ్బిట (2) ర-గోపాలరాయ శర్మ (1) ర-ఘంటసాల (1) ర-చేమకూర. (1) ర-జంపన (2) ర-జయదేవకవి (1) ర-జాషువా (1) ర-జి.కృష్ణమూర్తి (3) ర-తాండ్ర (1) ర-తాపీ ధర్మారావు (8) ర-తిక్కన (2) ర-తిరుపతివెంకటకవులు (1) ర-తోలేటి (12) ర-దాశరథి (8) ర-దీక్షితార్ (1) ర-దేవులపల్లి (3) ర-నార్ల చిరంజీవి (1) ర-పరశురామ్‌ (1) ర-పాలగుమ్మి పద్మరాజు (3) ర-పింగళి (26) ర-బమ్మెఱ పోతన (2) ర-బాబ్జీ (1) ర-బాలాంత్రపు (3) ర-బైరాగి (1) ర-భాగవతం (1) ర-భావనారాయణ (1) ర-భుజంగరాయ శర్మ (1) ర-మల్లాది (8) ర-ముద్దుకృష్ణ (3) ర-రాజశ్రీ (2) ర-రామదాసు (1) ర-రావులపర్తి (1) ర-రావూరి (1) ర-వసంతరావు (1) ర-వారణాసి (2) ర-విజికె చారి (1) ర-వీటూరి (4) ర-వేణు (1) ర-వేములపల్లి (1) ర-శ్రీశ్రీ (28) ర-సదాశివ బ్రహ్మం (9) ర-సముద్రాల జూ. (20) ర-సముద్రాల సీ. (42) ర-సి.నా.రె. (2) ర-సినారె (24) ర-సుంకర (1) ర-సుంకర-వాసిరెడ్డి (1) ర-సుబ్బారావు (1) రచన-ఘంటసాల (1) రచన-దాశరధి (2) రచన-దేవులపల్లి (2) రచన-పానుగంటి (1) రచన-పింగళి (2) రచన-బలిజేపల్లి (1) రచన-సముద్రాల సీ. (1)