తన పేరులోను, మనసులోను యిష్ట దైవాన్ని నింపుకున్న మాస్టారు పాడిన ఈ భక్తి గీతం ఎన్నో స్తోత్రాలు, సుప్రభాతాలు మొదలయిన భక్తి రచనలు చేసిన శ్రీ యామిజాల పద్మనాభ స్వామి గారి కలం నుండి జాలువారిన చక్కని స్తుతి. ఒక భక్తుడు తన దృక్కు, వాక్కు, మొక్కు, శ్రవణం, వెరసి సర్వేంద్రియాలు, తన చేష్టలు, చర్యలు, అశేషమైన భక్తి ప్రపత్తులు ఆ శేషాచల శేఖరుని కొరకేనని చేసే ప్రార్థనకు అద్భుతమైన స్వరకల్పన ఈ గీతం.
రచన: శ్రీ యామిజాల పద్మనాభస్వామి
సంగీతం & గానం: ఘంటసాల
సాకీ: భువన మోహన నిన్ను పొడగన్న కనులతో మూడు బొమ్మలవంక చూడలేను నీ దివ్య నామమున్ కీర్తించు నాల్కతో భవబంధ నామముల్ పలుకలేను కమలలోచన నిన్నుగని మ్రొక్కు చేతులన్ మూఢజీవులగాంచి మ్రొక్కలేను నీ కథామృతము నానిన నాదు చెవులతో కృపణ జీవితము లాలించలేను ఓ.. ప్రభూ! నీ కృపాంబోధి నోలలాడ ఊగుచున్నది మనసు తానోర్పులేక |ఓ.. ప్రభూ!| అభయహస్తము నొసగి నన్నాదుకోవె |అభయ| సంకట వినాశ తిరుపతి వేంకటేశ.. సంకట వినాశ తిరుపతి వేంకటేశ చ. శ్రీశేష శైలేశ శ్రిత పాపనాశ గరుడాచలావాస కమలావిలాసా | శ్రీశేష | నన్నేలుకోవయ్య శ్రీ వేంకటేశ ఆ..ఆ..ఆ... నన్నేలుకోవయ్య శ్రీ వేంకటేశ నిను నమ్మినానయ్య ఓ శ్రీనివాస నిను నమ్మినానయ్య ఓ శ్రీనివాస పాహిమాం పాహి పాహిమాం పాహిమాం పరమేశ పరంధామ పాహిమాం పరమేశ పరంధామ పాహిమాం పాహి పాహిమాం పాహి పాహిమాం పాహి పాహిమాం |