కృతజ్ఞతలు: చలనచిత్ర వివరాలను సమకూర్చిన ఘంటసాల గళామృతము-పాటల పాలవెల్లి వ్యవస్థాపకులు శ్రీ కొల్లూరు భాస్కరరావు గారికి, యూ ట్యూబ్ లో దృశ్యఖండిక పొందుపరచిన Chitralahari Music గారికి ధన్యవాదములు.
1956 లో విడుదలైన బాల సన్యాసమ్మకథ లో శ్రీ కొంగర జగ్గయ్య, శ్రీమతి కృష్ణకుమారి గార్లు నటించారు. ఆదర్శ ప్రేమికులైన రాధాకృష్ణుల పై శ్రీ సముద్రాల రామానుజాచార్య (సముద్రాల జూనియర్) వ్రాసిన చక్కని పాటకు ర'సాలూరు రాజేశ్వర రావు గారు అద్భుతమైన బాణీని కట్టారు. ఈ చిత్రానికి మాస్టారు పాడింది ఒకే పాట. అదీ యుగళ గీతం. ఈ పాట వింటూ వుంటే మరికొన్ని సాలూరి వారి పాటలు లీలగా స్ఫురిస్తాయి. దీనిని ఘంటసాల మాస్టారు, కోమల గారు గానం చేసారు. ముఖ్యంగా ఒక చరణం అయిన తరువాత వచ్చే మాస్టారి గళం నిజంగా 'కంచుఘంట' లా అనిపిస్తుంది. పాట అందుకున్న ఊపు ఇది నిజంగా స్వరరాజేశ్వరం అని చెబుతుంది.
1954 లో ఎన్.టి.ఆర్, ఎస్.వి.ఆర్., శ్రీరంజని, సావిత్రి నటించిన విజయా వారి చిత్రం 'చంద్రహారం' అంత ఆర్ధిక విజయం సాధించలేదు. దానికి కారణం సరియైన కథా బలం లేకపోవడం. కథానాయకుడైన రామారావు గారి పాత్ర చాల వరకు విగతమై పడి వుంటుంది. అందువలన అతనికి ధైర్య సాహసాలు ప్రదర్శించే అవకాశం లేదు. భార్య (శ్రీరంజని) పాతివ్రత్యం తో తప్ప అతనికి పునర్జన్మ లభించదు. అంతేకాక ఆనాడు కన్నీటి కనక వర్ష తార గా ప్రసిద్ధి చెందిన శ్రీరంజని ప్రేక్షకులను మరీ ఏడిపించినదనుకుంటా. ఎంతో ఉల్లాసంగా ఉండే సావిత్రి పాత్ర విలన్ పాత్ర. అదీ ఒక దెబ్బే మరి. అయితే సంగీతం మాత్రం అద్భుతం. ఘంటసాల మాస్టారు ఈ చిత్రానికి చక్కని బాణీలు కూర్చారు. అందులో ఎక్కువగా విననిది, చక్కని ఆణిముత్యం వంటి పాట "టైటిల్ సాంగ్", పింగళి నాగేంద్ర రావు గారు రచించిన "విజ్ఞాన దీపమును వెలిగించ రారయ్య". దీనిని మాస్టారు, ఎ.పి.కోమల, బృందం పాడారు. శ్రీమతి ఎ.పి.కోమల 1940 ల నుండి 60 ల వరకు మాస్టారితో సుమారు 9 యుగళ గీతాలు రక్షరేఖ, రహస్యం, సత్యనారాయణ మహాత్మ్యం, చంద్రహారం, పాండురంగ మహాత్మ్యం, బాలసన్యాసమ్మ కథ మొదలయిన చిత్రాలలో పాడారు.ఆపాట ఆడియో, వీడియో, మరియు సాహిత్యం ఇక్కడ ఇస్తున్నాను.
ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com