1966 లో టైగర్ ప్రొడక్షంసు పతాకం మీద కృష్ణన్-పంజు దర్శకత్వంలో విడుదలైన అనువాద చిత్రం సర్వర్ సుందరం. అదే పేరుతోగల తమిళ చిత్రం దీనికి మాతృక. తదుపరి 1971 లో ఇదే కథను హిందీలో మెహమూద్ తో "మై సుందర్ హూన్" గా నిర్మించారు. ఈ చిత్రానికి ఘంటసాల మాస్టారు చిత్ర కథానాయకుడైన ప్రముఖ హాస్య నటుడు నగేష్ కు పాడిన ఒకే ఒక పాట "నవయువతి". దీన్ని మాస్టారు ప్రముఖ గాయని ఎల్.ఆర్. ఈశ్వరితో పాడారు. ఈ పాట రచన అనిసెట్టి. సంగీతం ఎం.ఎస్.విశ్వనాథన్-రామమూర్తి-పామర్తి. ఈ చిత్రానికి కథ కె.బాలచందర్ సమకూర్చారు. ఈ చిత్రంలో నగేష్, కె.ఆర్.విజయ, ముత్తురామన్ మరియు ఎస్.వి.రంగారావు నటించారు. ఈ పాట చిత్రీకరణ నటుడు ముత్తురామన్ పై స్టూడియోలో ప్రారంభమవుతుంది. తదుపరి నగేష్, మనోరమలపై చిత్రీకరణ జరుగుతుంది. అరుదైన ఈ పాటను విని ఆనందించగలరు.
చిత్రం:
సర్వర్ సుందరం (డబ్బింగ్) 1966
సంగీతం:
ఎం.ఎస్. విశ్వనాధన్, రామమూర్తి మరియు పామర్తి
గానం:
ఘంటసాల, ఎల్.ఆర్.ఈశ్వరి
రచన:
అనిసెట్టి
పల్లవి:
ఘంటసాల:
నవయువతి, స్నేహమతి
నవయువతి చక్కని ప్రియ నవయువతి
హృదయమ్మున కలవు గదా, నా వలపుల కథవుగదా
పెదవులు చిందు సుధవుకదా, యువకుడనను కనరాదా
చరణం:
ఘంటసాల:
హో.. అందమొక మేజిక్ టెస్ట్
హో.. ఆశవొక సీక్రెట్ ట్విస్ట్
హో ఓ ఓ ఓ అందమొక మేజిక్ టెస్ట్
హో ఓ ఓ ఓ ఆశవొక సీక్రెట్ ట్విస్ట్
అందాలు నీయందె పొంగేనులే, ఆనందరవమై మ్రోగేనులే -2
ఆహా నీ మాట వినినంత, మైకం కమ్మేను మనసంత
| నవయువతి |
చరణం:
ఎల్.ఆర్.ఈశ్వరి:
రమ్ము చక్కని యువకా రావోయి, జవరాలి మనసే నీదోయి -2
యువ సౌఖ్యాలన్నీ నీవోయి
నవస్వర్గం పిలెచే రావోయీ, రావోయీ
నవయువకా, చక్కని ప్రియ నవయువకా
హృదయమ్మున కలవుగదా, నా వలపుల కథవుగదా
పెదవులు చిందు సుధవుకదా, యువతిని నను కనరాదా
చరణం:
ఘంటసాల:
సన్నని నడుమే.
ఎల్.ఆర్.ఈశ్వరి:
మగువందం..
ఘంటసాల:
సున్నిత స్వరమే
ఎల్.ఆర్.ఈశ్వరి:
మకరందం..
ఘంటసాల:
సన్నని నడుమే.
ఎల్.ఆర్.ఈశ్వరి:
మగువందం..
ఘంటసాల:
సున్నిత స్వరమే
ఎల్.ఆర్.ఈశ్వరి:
మకరందం..
ఘంటసాల:
ముద్దులపలుకు
ఎల్.ఆర్.ఈశ్వరి:
సందేహం
ఘంటసాల:
భువికే వెలుగు
ఎల్.ఆర్.ఈశ్వరి:
మృదుహాసం
ఘంటసాల:
ముద్దులపలుకు
ఎల్.ఆర్.ఈశ్వరి:
సందేహం
ఘంటసాల:
భువికే వెలుగు
ఎల్.ఆర్.ఈశ్వరి:
మృదుహాసం
లలలలలా లలలలలల లలలలలలా
లల్లరలల్లరలల లల్లలలా లలలల లా
Thanks to Rose Telugu Movies for the uploading video clip to You Tube
ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com