రిపబ్లిక్ సంస్థ 1967 లో నిర్మించిన "రక్త సిందూరం" చిత్రం నుండి ఘంటసాల, పి.సుశీల పాడిన పాట. గీత రచన మహాకవి శ్రీ శ్రీ. సంగీతం సాలూరు రాజేశ్వర రావు. ఇందులో శోభన్ బాబు, రాజశ్రీ, రామకృష్ణ, గీతాంజలి, విజయలలిత ముఖ్య తారాగణం. దర్శకత్వం సీతారాం.
| ఘంటసాల: | ప్రియురాలా! ప్రియురాలా! | |
| సుశీల: | చెలికాడా! చెలికాడా! చెలికాడా! | |
| పల్లవి: | సుశీల: | నీలో రేగీ, నాలో మ్రోగెనులే, మధుర భావాలే, ప్రణయ గీతాలే |
| ఆనందాలే పూలై విరిసెనులే, హాయి కలిగెనులే, ఆశ పెరిగెనులే | ||
| నిన్ను విడువనులే | ||
| చరణం: | ఘంటసాల: | తళుకు తళుకుమను, మినుకు మినుకుమను తారకవే, నా చెలివే |
| వయసు పరువముల, నిలిపి మురిపెముల కులుకు చెలువముల జవ్వనివే | ||
| విందులు చేసెను నీ సొగసు | ||
| సుశీల: | ఒహొహో! | |
| ఘంటసాల: | చిందులు వేసెను నా మనసు | |
| సుశీల: | అహహా! | |
| ఘంటసాల: | కవ్వించి కదిలించె నీ చూపు నీ రూపు | |
| సుశీల: | నీలో రేగీ, నాలో మ్రోగెనులే మధుర భావాలే, ప్రణయ గీతాలే | |
| ఘంటసాల: | ఆనందాలే పూలై విరిసెనులే, హాయి కలిగెనులే, ఆశ పెరిగెనులే | |
| నిన్ను విడువనులే | ||
| సుశీల: | ఆ..ఆ..ఆ..ఆ.. | |
| చరణం: | సుశీల: | మొదట చూడగను తగిన వాడవని ముచ్చటగా మెచ్చితినే |
| హృదయపీఠమున నిలిపి కొలిచితిని నుదుటి తిలకముగ దాల్చితినే | ||
| కారుడవని నిను మదినెంచి | ||
| ఘంటసాల: | ఆహా! | |
| సుశీల: | సతినే నేనని యెదనెంచి | |
| ఘంటసాల: | ఓహో! | |
| సుశీల: | నీ చెంత చేరేను నీ పొందు కోరేను | |
| ఘంటసాల: | నీలో రేగీ, నాలో మ్రోగెనులే మధుర భావాలే, ప్రణయ గీతాలే | |
| సుశీల: | ఆనందాలే పూలై విరిసెనులే, హాయి కలిగెనులే, ఆశ పెరిగెనులే | |
| నిన్ను విడువనులే | ||
| చరణం: | ఘంటసాల: | నిగ్గు చెక్కిలిని సిగ్గు మిక్కిలిగ నించెనుగా, పండెనుగా |
| సుశీల: | పెదవి మీద చిరునగవు వెన్నెలలు నాట్యమాడ కనుపండువుగా | |
| ఘంటసాల: | రాధవు నీవని తలచానే | |
| సుశీల: | మాధవుడని నిను పిలిచానే | |
| ఇద్దరు: | ఏ వేళ, ఈ లీల ఈ ప్రేమ సాగేను | |
| సుశీల: | నీలో రేగీ, నాలో మ్రోగెనులే మధుర భావాలే, ప్రణయ గీతాలే | |
| ఇద్దరు: | ఆనందాలే పూలై విరిసెనులే, హాయి కలిగెనులే, ఆశ పెరిగెనులే | |
| నిన్ను విడువనులే |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి