1961 సంవత్సరంలో విడుదలైన అన్నపూర్ణా పిక్చర్స్ సంస్థ నిర్మించిన వెలుగు నీడలు చిత్రం నుండి ఘంటసాల మాస్టారు పి.సుశీల, బృందం తో పాడిన "ఓ రంగయో పూల రంగయో" అనే ఈ బృందగీతం రచన శ్రీశ్రీ, స్వరపరచినది పెండ్యాల. ఈ చిత్రంలో తారాగణం అక్కినేని, సావిత్రి,ఎస్. వి.రంగారావు, సూర్యకాంతం, రేలంగి, జగ్గయ్య, గిరిజ. ఈ చిత్రానికి నిర్మాత డి.మధుసూదనరావు మరియు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు.
#000 | పాట: | ఓ! రంగయో పూల రంగయో | ||
---|---|---|---|---|
నిర్మాణం: | అన్నపూర్ణా వారి | |||
చిత్రం: | వెలుగునీడలు (1961) | |||
రచన: | శ్రీశ్రీ | |||
సంగీతం: | పెండ్యాల | |||
గానం: | ఘంటసాల, పి.లీల, బృందం | |||
బృం: | ఓ...హొహోహో హొహోహో హొహోహో హో.. | |||
ఘం: | ఓ...హొహోహో హొహోహో హొహోహో హో.. | |||
పల్లవి: | సు: | ఓ! రంగయో, పూలరంగయో ఓరచూపు చాలించి సాగిపోవయో | ||
బృం: | ఓ! రంగయో, పూలరంగయో ఓరచూపు చాలించి సాగిపోవయో | |||
సు: | పొద్దు వాలిపోతున్నదో.ఓయి ఇంతమెద్దు నడక నీకెందుకో.ఓయి | |||
బృం: | పొద్దు వాలిపోతున్నదో.ఓయి ఇంతమెద్దు నడక నీకెందుకో.ఓయి | |||
ఓ! రంగయో, పూలరంగయో ఓరచూపు చాలించి సాగిపోవయో | ||||
చరణం: | సు: | పగలనక, రేయనక పడుతున్న శ్రమనంతా | ||
పరుల కొఱకు ధారపోయు మూగజీవులు | | పగలనక | | |||
ఘం: | ఆటలలో పాటలలో ఆయాసం మరచిపోయి | |||
ఆనందం పొందగలుగు ధన్యజీవులు | ||||
బృం: | ఓ! రంగయో, పూలరంగయో ఓరచూపు చాలించి సాగిపోవయో | |||
ఘం: | ఆ..ఆ..ఆ.. (బృందంతో సమాంతరంగా) | |||
బృం: | పొద్దు వాలిపోతున్నదో.ఓయి ఇంతమెద్దు నడక నీకెందుకో.ఓయి | |||
ఓ! రంగయో, పూలరంగయో, ఓరచూపు చాలించి సాగిపోవయో | ||||
పొద్దు వాలిపోతున్నదో.ఓయి ఇంతమెద్దు నడక నీకెందుకో.ఓయి | ||||
చరణం: | సు: | కడుపారగ కూడులేని, తలదాచగ గూడులేని | ||
ఈ దీనుల జీవితాలు మారుటెన్నడొ? | | కడుపారగ | | |||
ఘం: | తనవారలు లేనివారి కష్టాలను తీర్చుదారి | |||
కనిపెట్టీ మేలుచేయగలిగినప్పుడే! | ||||
బృం: | ఓ! రంగయో, పూలరంగయో ఓరచూపు చాలించి సాగిపోవయో | |||
పొద్దు వాలిపోతున్నదో.ఓయి ఇంతమెద్దు నడక నీకెందుకో.ఓయి | ||||
ఓ! రంగయో, పూలరంగయో ఓరచూపు చాలించి సాగిపోవయో | ||||
ఘం: | ఆ..ఆ..ఆ.. |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి