1966 సంవత్సరంలో విడుదలైన శ్రీనిలయం పిక్చర్స్ సంస్థ నిర్మించిన శ్రీమతి చిత్రం నుండి ఘంటసాల పాడిన "కోరికలా కుటీరములో " అనే ఈ యుగళగీతం రచన ఆరుద్ర, స్వరపరచినది శ్రీ నిత్యానంద్. ఈ చిత్రంలో తారాగణం కాంతారావు,శారద,చలం,గీతాంజలి, వాసంతి. ఈ చిత్రానికి నిర్మాత తెలియదు మరియు దర్శకుడు విజయానంద్. దీనిని కాంతారావు, శారద పైచిత్రీకరించారు. ఈ చిత్రం 9.12.1966 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
1966 సంవత్సరంలో విడుదలైన శ్రీనిలయం పిక్చర్స్ సంస్థ నిర్మించిన శ్రీమతి చిత్రం నుండి ఘంటసాల పాడిన "మ్రోగింది గుడిలోన గంట" అనే ఈ యుగళగీతం రచన ఆరుద్ర, స్వరపరచినది శ్రీ నిత్యానంద్. ఈ చిత్రంలో తారాగణం కాంతారావు,శారద,చలం,గీతాంజలి, వాసంతి. ఈ చిత్రానికి నిర్మాత తెలియదు మరియు దర్శకుడు విజయానంద్. దీనిని కాంతారావు, శారద పైచిత్రీకరించారు. ఈ చిత్రం 9.12.1966 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
1953 సంవత్సరంలోవిడుదలైనశోభాసంస్థనిర్మించిన
“పరోపకారం”చిత్రంనుండిఘంటసాలమాస్టారుపాడిన
"జోడెడ్లనడమజోరైనరగడ"
అనేఈఏకగళంరచనఆరుద్ర, స్వరపరచినదిఘంటసాల.
ఈచిత్రంలోతారాగణంముక్కామల,సావిత్రి, జి. వరలక్ష్మి,రామశర్మ,సి. ఎస్. ఆర్.
ఆంజనేయులు, రేలంగి. ఈచిత్రానికినిర్మాతబి.చలపతిరావుమరియుదర్శకుడుకమల్ఘోష్. ఆరుద్ర ఈ పాటలో ఎడ్లబండికి సంబంధించిన చక్కని పల్లెపదాలను వాడారు. తెలుగులోని ప్రకృతి - వికృతులలో వికృతి పదాలు ఇందులో చూడవచ్చు. ఉదాహరణకు 'రోసాలు' (రోషాలు), పసరాలు (పశువులు). రోజాలు అంటే బండి చక్రానికి వుండే ఆకులు. పసరము అనే పదము గోమహిషజాతి అయిన ఎద్దును సూచిస్తుంది.
అష్టవసువులు ఒకసారి వారిలో ద్యు అనే వాడి ప్రోద్బలంతో వశిష్ట ముని ఆశ్రమములోని కామధేనువును అపహరిస్తారు. ఆ ముని ఉగ్రుడై ఆ ఎనమండుగురిని భూలోకంలో జన్మించమని శపిస్తాడు.ద్యు తప్ప మిగిలిన వారు ముని కాళ్ళపై పడి క్షమాపణకోరి శాపం ఉపసంహరించమని ప్రార్థిస్తారు. అయితే సహాయంచేసిన ఏడుగురు వసువులు భూమిపై స్వల్పకాలం జీవిస్తారని, ఎనిమిదవ వసువు మాత్రం చిరకాలం భూమిపై జీవిస్తాడని మహర్షి చెబుతాడు. అదే సమయంలో బ్రహ్మలోకంలో బ్రహ్మ సృష్టించిన గంగను నిండుసభలో మహాభిషుడనే రాజు చూస్తాడు. పరస్పరం మోహంలో పడి సభామర్యాదను మరచిపోతారు. అందుకు బ్రహ్మ కోపంతో వారిద్దరినీ భూలోకంలో జన్మించమని శాపం ఇస్తాడు. గంగ భూలోకం వస్తుండగా అష్టవసువులు ఎదురై వారికి శాపవిమోచనం కలిగించమని గంగను వేడుకుంటారు. మహాభిషుడు శంతనుడిగా పుట్టి గంగను వివాహం చేసుకుంటాడు. అయితే తను చేసే ఏ పనికైనా అభ్యంతరం చెబితే శంతనుని విడిచి వెళ్ళిపోతానని గంగ శంతనుతో వాగ్దానం చేయిస్తుంది. వారికి పుట్టిన ఏడుగురు మగపిల్లలను గంగ నదిలో ముంచి చంపి వారికి శాపవిముక్తి కలిగిస్తుంది. అయితే ఎనిమిదవ పుత్రుడ్ని కూడ నదిలో పడవేయబోతుండగా శంతనుడు అడ్డు పడతాడు. అపుడు గంగ శంతనుని విడిచి పుత్రునితో వెళ్ళిపోతుంది. అతనిని పెంచి విద్యలు నేర్పి శంతనుని వద్దకు చేరుస్తుంది. అతడే గాంగేయుడు. తన తండ్రి శంతనుడు దాసరాజు కూతురు మత్స్యగంధిని పెళ్ళిచేసుకోవడానికి అనుకూలంగా తాను ఆజన్మ బ్రహ్మచారిగా వుంటానని భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడయాడు.
1961లో ఎన్.టి.
రామారావు,దేవిక,కన్నాంబ, రేలంగి,
గిరిజ, సి. ఎస్.
ఆర్. ఆంజనేయులు నటించిన, డి.బి.
ఎన్. సంస్థ నిర్మించిన చిత్రం “పెండ్లి పిలుపు” నుండి ఘంటసాల మాస్టారు
పాడిన పాట “నాలోని అనురాగమంతా”. సంగీతం: కె. ప్రసాదరావు,
రచన - ఆరుద్ర , దర్శకత్వం: ఆమంచర్లశేషగిరిరావు.
ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com