1950 లో సొసైటీ పిక్చర్సు పతాకం పై తీసిన చిత్రం ప్రపంచం. ఈ చిత్రంలో పద్మశ్రీ చిత్తూరు వి. నాగయ్య, జి.వరలక్ష్మి (గరికపాటి వరలక్ష్మి) నాయికా, నాయకులుగా నటించారు. జి.వరలక్ష్మి తొలిచిత్రం శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి గారు రచించిన కథ ఆధారంగా అదే పేరుతో 1940 లో తీసిన బారిస్టరు పార్వతీశం చిత్రం. ప్రపంచం చిత్రంలో ఘంటసాల మాస్టారు పాడిన ఒకే యుగళ గీతం శ్రీమతి ఎన్.ఎల్.గానసరస్వతి గారితో. వీరే కాక ఈ చిత్రంలో శ్రీమతి ఎమ్.ఎల్.వసంత కుమారి, ఎ.ఎమ్.రాజా కూడ పాడారు. మిగిలిన వివరాలు ఘంటసాల గళామృతము-పాటల పాలవెల్లి లో చూడగలరు. ఈ పాట రచయిత మహాకవి శ్రీశ్రీ. సంగీత దర్శకులు ఎమ్.ఎస్.జి.మణి మరియు పూర్ణానంద.
~ పాటల వివరాలు ~
| చిత్రం# | # | పాట/పద్యం/శ్లోకం | తీరు | రచన | పాడినవారు | అభినయం |
|---|---|---|---|---|---|---|
| 37 | 1 | ప్రేమసుధా సరసిలో | (యు) | శ్రీశ్రీ | ఘంటసాల, ఎం.ఎల్.గానసరస్వతి | జె.సుబ్బారావు, లక్ష్మీకాంత |
| 37 | 2 | ఎవ్వనిచే జనించు | (ప) | బమ్మెఱ పోతన | ఘంటసాల | నేపథ్యగానం |
![]() |
| N.L.Ganasaraswati |
ఈ చిత్రం నిర్మాత
శ్రీలంక నివాసియైన శ్రీ ఎం. హెచ్.ఎం. మునాస్.
ప్రఖ్యాత టాక్ షో హోస్ట్ శ్రీ కిరణ్ప్రభ 'ప్రపంచం' సినిమా నిర్మాణానికి సంబంధించిన
ఆసక్తికరమైన వివరాలను, విశేషాలను, అలాగే నిర్మాత ఎం.హెచ్.ఎం. మునాస్ గురించి తెలిపారు.
“ఈ సినిమా (ప్రపంచం) తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మొదటి భారీ బడ్జెట్ ఫ్లాప్ చిత్రం.
నిర్మాత ఎం.హెచ్.ఎం. మునాస్ 1953లో ఈ సినిమా కోసం 25 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఎంతో
ప్రచారంతో ఈ సినిమాను మూడేళ్ల పాటు చిత్రీకరించారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఇది ఘోరంగా
విఫలమైంది. ఇలాంటి పరాజయ చిత్రాల నుండి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి.
తరువాత మునాస్ గారు నిర్మించిన మరొక చిత్రం “దేవసుందరి
". దీనిని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ 5 భాషలలో
నిర్మించారు. దేవసుందరి
తెలుగు సినిమా 25-7-1963 న విడుదల అయ్యింది.
కాంతారావు, షావుకారు జానకి ముఖ్య పాత్రలు. ‘దేవసుందరి’ కన్నడ చిత్రం (1962) లో బి.సరోజాదేవి, రాజ్
కుమార్ నాయికానాయకులు. (Photos courtesy: Dr. K.V.Rao, Founder, Ghantasala Gana Sabha, Hyderabad)
ఆడియో మూలం: ఘంటసాల గాన చరిత
చిత్రం: ప్రపంచం (1950)
గీతరచన: శ్రీ శ్రీ
గానం: ఘంటసాల, ఎన్. ఎల్. గానసరస్వతి
సంగీతం: ఎం.ఎస్.జి. మణి మరియు టి. పూర్ణానంద
మునాస్ నిర్మించిన "ప్రపంచం" చిత్రంలోని ఈ యుగళ గీతాన్ని ఘంటసాల గానసభ, హైదరాబాద్ వ్యవస్థాపకులైన శ్రీ డా.కె.వి. రావు గారి అధ్వర్యంలో ఏర్పాటుచేసిన గానవేదికపై శ్రీమతి అఖిల, శ్రీ వి.ఆర్.కె. ఫణి గారు ఆలపించారు.
| గా: | ఆ..ఆ.. | ||
| ఘ: | ఆ..ఆ.. | ||
| ప: | గా: | ప్రేమ సుధా సరసిలో హంసలమై | | ప్రేమ | |
| ప్రియముగ విహరించ మనసాయెగా | |||
| ప్రేమ సుధా సరసిలో | |||
| చ: | ఘ: | ఆమని అరుదెంచె ఆశలు చిగురించే..ఏ..ఏ.. | |ఆమని| |
| ఆమని అరుదెంచె ఆశలు చిగురించే | |||
| ప్రేమము కుసుమించె నేడే | |||
| మన జీవితమే తేలి తూగే | |||
| గా: | కలసిన హృదయాల వెలసిన స్నేహాల | | కలసిన | | |
| విలసనమె హాయి హాయి | | విలసనమె | | ||
| ఘ: | ప్రణయ లోకాలలో | ||
| గా: | మధుర గానాలలో | ||
| ఘ: | ప్రణయ లోకాలలో | ||
| గా: | మధుర గానాలలో | ||
| ఇద్దరు: | కడు ప్రియమార నడయాడ మనసాయెగా..ఆ.. | ||
| ప్రియమార నడయాడ మనసాయెగా | |||
| చ: | గా: | వెన్నెల కెరటాలా..ఆ..ఆ.. | |
| వెన్నెల కెరటాల యవ్వన సుమడోల | |||
| ముదరణములసేయ మనసాయెరా | |||
| ఘ: | నా మది పులకించే..ఏ..ఏ.. | ||
| నా మది పులకించే నా ఎద కరగించే.. | |||
| కోయిలవై పాడినావే | | కోయిలవై | | ||
| గా: | ఓ! నవ మోహనా | ||
| ఘ: | ఓ! వనజాననా | ||
| గా: | ఓ! నవ మోహనా | ||
| ఘ: | ఓ! వనజాననా | ||
| గా: | ప్రేమయే.. | ||
| ఘ: | జీవము | ||
| గా: | జీవమే.. | ||
| ఘ: | ప్రేమము | ||
| ఇద్దరు: | ఇక మన ప్రేమకిల సాటి కనరాదుగా | ||
| కనరాదుగా |
కృతజ్ఞతలు: సినిమా పోస్టరు ఘంటసాల గళామృతము-పాటల పాలవెల్లి నుండి; ఆడియో సంగీతము అందించిన సఖియా.కాం నిర్వాహకులైన హైదరాబాద్ శ్రీ ఘంటసాల సంగీత కళాశాల సంచాలకులు శ్రీ కొల్లూరి భాస్కరరావు గారికి.


