1964 సంవత్సరంలో విడుదలైన
రాజలక్ష్మి ప్రొడక్షన్సు సంస్థ నిర్మించిన “గుడిగంటలు” చిత్రం నుండి ఘంటసాల పాడిన “ఎవరికి
వారౌ స్వార్ధంలో” అనే ఈ ఏకగళగీతం రచన ఆత్రేయ,
స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, జగ్గయ్య, కృష్ణకుమారి, మిక్కిలినేని,
నాగయ్య, వాసంతి. ఈ చిత్రానికి నిర్మాత సుందర్ లాల్ నహతా డూండీ మరియు దర్శకుడు వి.మధుసూదనరావు.
గానం గాంధర్వం, గాత్రం అనన్యసాధ్యం, భావం అసాధారణం, భాష అతి సుందరం, ఉచ్చారణ సుస్పష్టం, అనుభూతి చర్విత చర్వణం.
15, జనవరి 2022, శనివారం
ఎవరికి వారౌ స్వార్థంలో - గుడిగంటలు నుంచి
మానవా నీకిదే - ఘంటసాల-బృందం పాట శ్రీశైల మహత్మ్యం నుండి
1962 సంవత్సరంలో విడుదలైన అలంకార్ ఫిలింస్ సంస్థ నిర్మించిన “శ్రీశైల మహత్యం” అనువాద చిత్రం నుండి ఘంటసాల-బృందం పాడిన “మానవా నీకిదే అమృతమౌర” అనే ఈ బృందగీతం రచన మల్లాది రామకృష్ణ శాస్త్రి, స్వరపరచినది పామర్తి. ఈ చిత్రంలో తారాగణం రాజకుమార్,సంధ్య,కృష్ణకుమారి,మాధవరావు. ఈ చిత్రానికి నిర్మాత బి.యన్.స్వామి మరియు దర్శకుడు అరూర్ పట్టాభి.
నయనాభిరామా నాతండ్రి రామ సుగుణధామ రామ - వీరాంజనేయ నుండి ఘంటసాల
12, జనవరి 2022, బుధవారం
నీ సరి మనోహరి - బభ్రువాహన నుండి ఘంటసాల, ఎస్. వరలక్ష్మి
| #0000 | యుగళం | పాట: | నీ సరి మనోహరి జగాన |
|---|---|---|---|
| పతాకం: | నేషనల్ ఆర్ట్ పిక్చర్స్ | ||
| చిత్రం: | బభ్రువాహన (1966) | ||
| సంగీతం: | పామర్తి వెంకటేశ్వరరావు | ||
| రచన: | సముద్రాల సీనియర్ | ||
| గానం: | ఘంటసాల, ఎస్. వరలక్ష్మి | ||
| సాకీ | అతడు: | ఆ.. ఆ....ఉహు హుహు | |
| పల్లవి: | నీ సరి మనోహరి జగాన కానరాదుగా | ||
| నీ సరి మనోహరి జగాన కానరాదుగా | |||
| అలుపు లేని చెలికీ వేళ ఏల మౌనమో... | |||
| ఆమె: | వలపు లేలు తామీదోల తలుపు ధ్యానమే..... | ||
| నీ సరి విలాసులు జగాన లేనె లేరుగా | |||
| చరణం: | అతడు: | కనుల సైగ విజయూగొనిన జాణ వీవేలే..... | |
| ఆమె : | మరులు రేపి మగువా గొనగ మీరు విజయులే..... | ||
| నీ సరి విలాసులు జగాన లేనె లేరుగా | |||
| చరణం: | అతడు: | చేసుకున్న తపసీ లీల | |
| ఆమె: | చేరదీసెలే... | ||
| అతడు: | జంటగొన్న మనసూ మమత | ||
| ఆమె: | సఫలమాయెలే..... | ||
| ఇద్దరు : | మా సరి వయారులు, జగాన లేనె లేరుగా | ||
| మా సరి వయారులు, జగాన లేనె లేరుగా | |||
| ఆ... ఆ.... ఆ.... ఆ... |
నిన్నే నిన్నే చెలి నిలునిలుమా - బభ్రువాహన నుండి ఘంటసాల, సుశీల
1964 సంవత్సరంలో విడుదలైన నేషనల్ ఆర్ట్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన బభ్రువాహన చిత్రం నుండి ఘంటసాల మాస్టారు పి.సుశీలతో పాడిన నిన్నే నిన్నే చెలి నిలునిలుమా అనే ఈ యుగళగీతం రచన సముద్రాల సీ., స్వరపరచినది పామర్తి. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, కాంతారావు, ఎస్.వరలక్ష్మి, చలం, ఎల్. విజయలక్ష్మి.
| #0000 | యుగళం | పాట: | నిన్నే నిన్నే చెలి నిలునిలుమా |
|---|---|---|---|
| పతాకం: | నేషనల్ ఆర్ట్ పిక్చర్స్ | ||
| చిత్రం: | బభ్రువాహన (1964) | ||
| సంగీతం: | పామర్తి వెంకటేశ్వర రావు | ||
| రచన: | సముద్రాల సీనియర్ | ||
| గానం: | ఘంటసాల, సుశీల | ||
| పల్లవి: | అతడు | నిన్నే.. నిన్నే.. చెలి నిలు నిలుమా.. | |
| నినువిడి నిలువగ లేను సుమా... | |||
| నిన్నే.. నిన్నే.. చెలి నిలు నిలుమా.. | |||
| ఆమె | నను విడుమా... ఇక నను విడుమా | ||
| నను విడుమా... ఇక నను విడుమా | |||
| నమస్తే జటాధారి... నా దారిని | |||
| విడు విడుమా.. చెలి నిలు నిలుమా... | |||
| చరణం 1: | ఆమె | మగువలు కొలువగ దరిజేరగా...మతిమాయుట యతులకు న్యాయమా.. | |
| మగువలు కోలువగ దరిజేరగా...మతిమాయుట యతులకు న్యాయమా.. | |||
| అతడు | నీ కనుసన్నలా నను కరుణించినా...ఈ సన్యాసి మారేను సంసారిగా | ||
| విడు విడుమా ..చెలి నిలు నిలుమా... | |||
| చరణం 2: | ఆమె | ఆపకుమా నే పాపినయ.. ఈ రూపము నిలువగ రానిదయా... | |
| ఆపకుమా నే పాపినయ. ఈ రూపము నిలువగ రానిదయా... | |||
| అతడు | నీ రూపానికే నే ఈ రూపున... ఇట చేరి జపించి తపించేనులే.... | ||
| విడు విడుమా .. చెలి నిలు నిలుమా... | |||
| చరణం 3: | ఆమె | విజయునికే తనువంకితం...నీ చెలువుని మోసం చెయుదువా? | |
| విజయునికే తనువంకితం...నీ చెలువుని మోసం చెయుదువా? | |||
| అతడు | నేనే విజయుండను ...నేనే చెలి కాదను...ఈ గోశాయి వేసాలు నీకోసమే ... | ||
| ఆమె | హా... | ||
| అతడు | ఆ... | ||
| అతడు | నిలు నిలుమా..ఆమెః నను విడు విడుమా | ||
| అతడు | నిలు నిలుమా..ఆమెః నను విడు విడుమా |
11, జనవరి 2022, మంగళవారం
తెల్లచీర కట్టుకున్నదెవరి కోసము - అంతస్తులు చిత్రం నుండి ఘంటసాల, సుశీల
1965 సంవత్సరంలో విడుదలైన జగపతి పిక్చర్స్ సంస్థ నిర్మించిన అంతస్తులు చిత్రం నుండి ఘంటసాల-పి.సుశీల పాడిన “తెల్లచీర కట్టుకున్నదెవరి కోసము” అనే ఈ యుగళగీతం రచన ఆత్రేయ, స్వరపరచినది కె.వి. మహదేవన్. ఈ చిత్రంలో తారాగణం అక్కినేని, కృష్ణకుమారి, జగ్గయ్య, గుమ్మడి, పి.భానుమతి, రేలంగి, రమణారెడ్డి. ఈ చిత్రానికి నిర్మాత వి.రాజేంద్రప్రసాద్ మరియు దర్శకుడు వి.మధుసూదనరావు.
| #1349 | యుగళం | పాట: | తెల్లచీర కట్టుకున్నదెవరి కోసము | |
|---|---|---|---|---|
| పతాకం: | జగపతి ఆర్ట్స్ | |||
| చిత్రం: | అంతస్తులు - 1965 | |||
| సంగీతం: | కె.వి.మహదేవన్ | |||
| రచన: | ఆచార్య ఆత్రేయ | |||
| గానం: | ఘంటసాల, సుశీల | |||
| సాకీ | అతడు: | తెల్లచీర కట్టుకున్నది ఎవరి కోసము | ||
| మల్లెపూలు పెట్టుకున్నది ఎవరి కోసము..ఊ | ||||
| పల్లవి: | తెల్లచీర కట్టుకున్నదెవరి కోసము | |||
| మల్లెపూలు పెట్టుకున్నదెవరి కోసము | । తెల్లచీర కట్టుకున్న। | |||
| ఆమె: | తెల్ల చీర కట్టిన మల్లెపూలు పెట్టినా | |||
| కల్లకపటమెరుగని మనసు కోసము | । తెల్లచీర కట్టినా। | |||
| మనసులోని చల్లని మమత కోసము | ||||
| అతడు: | తెల్లచీర కట్టుకున్నదెవరి కోసము | |||
| ఆమె: | కల్లకపటమెరుగని మనసు కోసము..ఊ..ఊ | |||
| చరణం: | అతడు: | దాచుకున్న మమతలన్ని ఎవరికోసము | ||
| ఆమె: | దాపరిక౦ ఎరుగని మనిషి కోసము | |||
| అతడు: | దాచుకున్న మమతలన్ని ఎవరికోసము | |||
| ఆమె: | దాపరిక౦ ఎరుగని మనిషి కోసము | |||
| అతడు: | దాగని యవ్వన౦ ఎవరి కోసము..ఉ | |||
| ఆమె: | దాచుకుని ఏలుకునే ప్రియుని కోసము | |||
| అతడు: | తెల్లచీర కట్టుకున్నదెవరికోసము | |||
| ఆమె: | కల్లకపటమెరుగని మనసు కోసము..ఊ | |||
| చరణం: | అతడు: | పొద్ద౦త కలవరి౦త ఎవరికోసము | ||
| ఆమె: | నిద్దురైన రానీి నీ కోసము | |||
| అతడు: | పొద్ద౦త కలవరి౦త ఎవరికోసము | |||
| ఆమె: | నిద్దురైన రానీి నీ కోసము | |||
| అతడు: | తెల్లచీర కట్టుకున్నదెవరికోసము | |||
| ఆమె: | కల్లకపటమెరుగని మనసు కోసము..ఊ | |||
| చరణం: | అతడు: | ని౦గి నేల కలసినది ఎ౦దుకోసమూ..ఉ | ||
| ఆమె: | నీవు నన్ను చేరదీసిన౦దుకోసము | |||
| అతడు: | ని౦గి నేల కలసినది ఎ౦దుకోసమూ..ఉ | |||
| ఆమె: | నీవు నన్ను చేరదీసిన౦దుకోసము | |||
| అతడు: | నేల మీద ఒక్కరై సాగిపోదము | |||
| ఇద్దరు: | ని౦గిలోన చుక్కలై నిలిచిపోదమూ.. | |||
| అతడు: | తెల్లచీర కట్టుకున్నదెవరికోసము | |||
| మల్లెపూలు పెట్టుకున్నదెవరికోసము | ||||
| ఆమె: | తెల్ల చీర కట్టిన మల్లెపూలు పెట్టినా | |||
| కల్లకపటమెరుగని మనసు కోసము | ||||
| మనసులోని చల్లని మమత కోసము |