1953 లో వినోదా వారి సంస్థ నిర్మించిన దేవదాసు చిత్రం నుండి ఘంటసాల పాడిన పల్లెకుపోదాం పారును చూదాం. గీత రచన: సముద్రాల సీనియర్, సంగీతం: సి. ఆర్. సుబ్బురామన్. దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య. తారాగణం: అక్కినేని, సావిత్రి, ఎస్.వి. రంగారావు, ఆర్. నాగేశ్వరరావు, సి. ఎస్. ఆర్. ఆంజనేయులు,పేకేటి, లలిత.
అష్టవసువులు ఒకసారి వారిలో ద్యు అనే వాడి ప్రోద్బలంతో వశిష్ట ముని ఆశ్రమములోని కామధేనువును అపహరిస్తారు. ఆ ముని ఉగ్రుడై ఆ ఎనమండుగురిని భూలోకంలో జన్మించమని శపిస్తాడు.ద్యు తప్ప మిగిలిన వారు ముని కాళ్ళపై పడి క్షమాపణకోరి శాపం ఉపసంహరించమని ప్రార్థిస్తారు. అయితే సహాయంచేసిన ఏడుగురు వసువులు భూమిపై స్వల్పకాలం జీవిస్తారని, ఎనిమిదవ వసువు మాత్రం చిరకాలం భూమిపై జీవిస్తాడని మహర్షి చెబుతాడు. అదే సమయంలో బ్రహ్మలోకంలో బ్రహ్మ సృష్టించిన గంగను నిండుసభలో మహాభిషుడనే రాజు చూస్తాడు. పరస్పరం మోహంలో పడి సభామర్యాదను మరచిపోతారు. అందుకు బ్రహ్మ కోపంతో వారిద్దరినీ భూలోకంలో జన్మించమని శాపం ఇస్తాడు. గంగ భూలోకం వస్తుండగా అష్టవసువులు ఎదురై వారికి శాపవిమోచనం కలిగించమని గంగను వేడుకుంటారు. మహాభిషుడు శంతనుడిగా పుట్టి గంగను వివాహం చేసుకుంటాడు. అయితే తను చేసే ఏ పనికైనా అభ్యంతరం చెబితే శంతనుని విడిచి వెళ్ళిపోతానని గంగ శంతనుతో వాగ్దానం చేయిస్తుంది. వారికి పుట్టిన ఏడుగురు మగపిల్లలను గంగ నదిలో ముంచి చంపి వారికి శాపవిముక్తి కలిగిస్తుంది. అయితే ఎనిమిదవ పుత్రుడ్ని కూడ నదిలో పడవేయబోతుండగా శంతనుడు అడ్డు పడతాడు. అపుడు గంగ శంతనుని విడిచి పుత్రునితో వెళ్ళిపోతుంది. అతనిని పెంచి విద్యలు నేర్పి శంతనుని వద్దకు చేరుస్తుంది. అతడే గాంగేయుడు. తన తండ్రి శంతనుడు దాసరాజు కూతురు మత్స్యగంధిని పెళ్ళిచేసుకోవడానికి అనుకూలంగా తాను ఆజన్మ బ్రహ్మచారిగా వుంటానని భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడయాడు.
'లవకుశ ఫేం' శంకర రెడ్డి గారు లలితా ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకం మీద టి.ప్రకాశరావు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం చరణదాసి. ఇది విశ్వకవి రవీంద్రనాథ టాగోర్ రచించిన 'ది రెక్' అను ఆంగ్ల నవల ఆదారంగా తీసిన చిత్రం. ముఖ్యంగా ఇది హేమాహేమీలైన ఎ.ఎన్.ఆర్., ఎన్.టి.ఆర్., ఎస్.వి.ఆర్., సావిత్రి, అంజలీదేవి నటించిన మల్టీస్టారర్ చిత్రం. ఈ చిత్రంలో తొలిసారిగా ఎన్.టి.ఆర్. రామునిగా మరియు అంజలీదేవి సీతగా నటించారు. వారి జంటను చూసి మురిసిపోయిన శంకర్ రెడ్డి గారు వారిరువురితో తదుపరి "లవకుశ" చిత్రం నిర్మించారు. శ్రీ సీనియర్ సముద్రాల వారు "సీత అగ్ని ప్రవేశము" మరియు "స్వప్న వాసవదత్త" అనే అంతర్నాటకాలను కలిపి ఈ చిత్రానికి తొమ్మిది పాటలు వ్రాసారు. సముద్రాల వారు రచనలలో ఘంటసాల మాస్టారు ఒక పద్యాన్ని, పి.సుశీల మరియు పి.లీలలతో కలసి చెరొక యుగళ గీతం పాడారు. ఇక్కడ సుశీల తో పాడిన మురిసేను లోకాలు కనుమా అనే యుగళ గీతం పొందుపరుస్తున్నాను.
తెలుగువారి అదృష్టఫలము వేమన కవి. ఇతని అసలు పేరు వేమారెడ్డి. వేమన జీవిత చరిత్రను 1947 లో "యోగి వేమన" పేరుతో ప్రతిష్టాత్మకమైన చిత్ర నిర్మాణ సంస్థ వాహినీ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రానికి ఒక నృత్య సన్నివేశానికి ఘంటసాల, యం.వి. రాజమ్మ "ఆపరాని తాపమాయెరా" అనే పాటను పాడారు. యం.వి.రాజమ్మ అలనాటి ప్రముఖ కన్నడ నటి. ఆమె తెలుగు, కన్నడ, తమిళ చిత్రాలలో నటించారు.
యుగళగీతం
ఆపరాని తాపమాయెరా
నిర్మాణం:
వాహిని వారి
చిత్రం:
యోగి వేమన (1947)
రచన:
సముద్రాల సీనియర్
సంగీతం:
చిత్తూరు నాగయ్య, ఓగిరాల రామచంద్రరావు
పాడినవారు:
ఘంటసాల, యం.వి. రాజమ్మ
అభినయం:
ఘంటసాల, యం.వి. రాజమ్మ
ఘ:
తాం, తత్తాం తధీం తకధీం, ధిత్తాం ధిమిత ఝణు,
తధిమి తధిమి తద్దణత ఝణుత ధిమితాం
తకధీం తతాం, తకధీం తతాం, తకధీం తతాం
ప.
ఘ+జ:
ఆపరాని తాపమాయెరా, బాలేందుమౌళీ
జ :
ఆపరాని తా..పమాయెరా, బాలేందుమౌళీ
ప్రాపుగోరి చేరితిరా,
ప్రాపుగోరి చేరితిరా - రారా- నన్నేలుకోరా,
ఆపరాని తాపమాయెరా
ఘ:
సరిగసా సనిదమా సమాగరిస రిగమదని
గరిసనిద రిసానిదమ సదా రిగమ
చ.
ఘ+జ:
వలచి వలచి, మనసు నీకై, అలసి సొలసి పోయెనురా
జ :
వల.చి వల.చి మనసు నీకై, అలసి సొలసి పోయెనురా
బాలనురా-వగనాపగ జాలనురా, నీ సేవకురాలనురా, గైకొనరా
బాలనురా-వగనాపగ జాలనురా నీ సేవకురాలనురా
నెర నమ్మినార తమిదీర దరిజేరరార
ఆపరాని తాపమాయెరా
ఘ:
తధిమి తకిట ఝణుతాం, తత్తాం, తధిత్తాం
తధిమి తకిట ఝణుతాం, తత్తాం, తధిత్తాం
తద్ధి త్తరికిటతోం, తకిటథోం
తద్ధి త్తరికిటతోం, తకిటథోం
తద్ధి త్తరికిటతోం, తకిటథోం
చ.
ఘ+జ:
ఇందుకళాధరుడవని, సుందర నటరాజువని
ఇందుకళా.ధరుడవని, సుం.దర నటరాజువని
జ:
ఎందరినో, మున్నేలిన - అందా.లా. సామివని
వింటినిరా - నిన్నుజేర గంటినిరా - జంటకు
రమ్మంటినిరా - ఆర్తిదీర్తువని
వింటినిరా, నిన్నుజేర గంటినిరా
జంటకు రమ్మంటినిరా
ఘ:
తథిం తథిం
కృతజ్ఞతలు: పోస్టరునందించిన బొల్లాప్రగడ సోమేశ్వరరావు గారికి, సమాచారంఉ పొందుపరచిన వికిపీడియా మరియు ఘంటసాల గళామృతము వారికి, శ్రవణ ఖండికను పొందుపరచిన ప్రాజెక్టు ఘంటసాలకు, దృశ్యఖండికను అందించిన .... వారికి హృదయపూర్వక ధన్యవాదములు.
ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com