1957 లో విడుదలైన తమిళ చిత్రం "తంగమలై రగస్యం" ను తెలుగులో రత్నగిరి రహస్యం గా డబ్ చేశారు. ఈ చిత్రంలో నడిగర్ తిలకం శివాజీ గణేశన్, జమునలు జంటగా నటించారు. ఇదే చిత్రాన్ని కన్నడం లో "రత్నగిరి రహస్య" అనే పేరున ఉదయకుమార్, జమున లతో పునర్నిర్మించారు. ఈ చిత్ర నిర్మాత-దర్శకులు శ్రీ బి.ఆర్.పంతులు గారు. ఆయన తెలుగు, తమిళ, కన్నడ చిత్రసీమలకు చిర పరిచితులు. శ్రీ పంతులు గారి శతజయంతి ఉత్సవం ఇటీవల కన్నడ చలనచిత్ర అకాడమీ వారు ఘనంగా జరిపారు. ఈ చిత్రంలో నాయికా నాయకులపై చిత్రీకరించిన ఒక చక్కని యుగళగీతం "కల్యాణం మన కల్యాణం". అయితే తెలుగులో ఘంటసాల, సుశీల గానం చేశారు. తమిళ, కన్నడ చిత్రాలలో టి.ఎం.సౌందరరాజన్, పి.లీల పాడారు. తెలుగు చిత్రానికి పాటలు వ్రాసినది మహాకవి శ్రీశ్రీ. సంగీతం సమకూర్చినది ఎం.ఎస్.రాజు మరియు టి.జి.లింగప్ప. లింగప్ప గారు సంగీత దర్శకత్వం వహించిన, మాస్టారు పాడిన తెలుగు చిత్రాలలో గాలిమేడలు (1962), పెంపుడు కూతురు (1963), కుల గౌరవం (1970) చెప్పుకోదగినవి. ఇందులో మొదటి రెంటికి దర్శకులు బి.ఆర్.పంతులు గారు. మాస్టారు పి.లీలతో పాడిన హిట్ సాంగ్ "ఓహో రాణి" పాట ఎం.ఎస్.రాజు గారు సంగీత దర్శకత్వం వహించిన దొంగల్లో దొర (1957) చిత్రం లోనిది.
చిత్రం: | రత్నగిరి రహస్యం - డబ్బింగ్ చిత్రం (1957) | |
రచన: | శ్రీశ్రీ | |
గానం: | ఘంటసాల, పి.సుశీల | |
సంగీతం: | ఎం.ఎస్.రాజు, టి.జి.లింగప్ప | |
పల్లవి: | సుశీల: | కల్యాణం మన కళ్యాణం |
రాజ కళ్యాణ వైభోగం కొనియాడుదాం | ||
ఉల్లాసం నిండారా ప్రేమించుదాం మనం ప్రేమించుదాం | ||
ఘంటసాల: | కళ్యాణం మన కళ్యాణం | |
రాజ కళ్యాణ వైభోగం కొనియాడుదాం | ||
ఉల్లాసం నిండారా ప్రేమించుదాం మనం ప్రేమించుదాం | ||
సుశీల: | ఓ..ఓ..ఓ.. | |
చరణం: | ఘంటసాల: | పూవుల తోట పూచిన బాట - 2 |
పులకించే సెలయేటి అలలూగు వేళ | ||
కళ్యాణం మన కళ్యాణం | ||
ఇద్దరు: | రాజ కళ్యాణ వైభోగం కొనియాడుదాం | |
ఉల్లాసం నిండారా ప్రేమించుదాం మనం ప్రేమించుదాం | ||
చరణం: | సుశీల: | హృదయాన రాజిల్లి చెలువారే ప్రేమ |
మన ముందు ఇకముందు ఎదురేది గాదా | ||
ఘంటసాల: | అహ్హహ్హాహ్హ.. | |
సుశీల: | హృదయాన రాజిల్లి చెలువారే ప్రేమ | |
మన ముందు ఇకముందు ఎదురేది గాదా-2 | ||
ఘంటసాల: | మితి మీరినా మతి మారునా - 2 | |
మది నిండే ఆనందం ఇదియే సుమా | ||
కళ్యాణం మన కళ్యాణం | ||
రాజ కళ్యాణ వైభోగం కొనియాడుదాం | ||
ఉల్లాసం నిండారా ప్రేమించుదాం మనం ప్రేమించుదాం | ||
సుశీల: | ఆ.ఆ..ఆ.. | |
చరణం: | సుశీల: | రాగం దీపించు జగమేలినావే |
ఘంటసాల: | సరితోడు నీడై జత చేరిపోవే | |
నీ మాటయే నా పాటగా | ||
ఏనాడూ ఈలాగే ప్రేమించుదాం | ||
కళ్యాణం మన కళ్యాణం | ||
ఇద్దరు: | రాజ కళ్యాణ వైభోగం కొనియాడుదాం | |
ఉల్లాసం నిండారా ప్రేమించుదాం మనం ప్రేమించుదాం |
కృతజ్ఞతలు: యూ ట్యూబ్ వీడియో సమకూర్చిన శ్రీ బొల్లాప్రగడ సోమేశ్వర రావు గారికి, చిత్ర సమాచారం తదితర వివరాలను సమకూర్చిన వికిపీడియా వారికి, ఘంటసాల గళామృతము పాటలపాలవెల్లి బ్లాగు శ్రీ కొల్లూరి భాస్కర రావు గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు.