పాత తెలుగు సినిమాలు ఎన్ని సార్లు చూసినా ఇంకా చూడాలనిపిస్తాయి. అలాంటి మేటి చిత్రాలలో మరొక కళాఖండం 1959 లో విడుదలైన విజయా వారి అప్పుచేసి పప్పుకూడు. ఈ చిత్రంలో అన్ని పాటలూ, పద్యాలు బాగుంటాయి. ఈ సినిమాలో ఘంటసాల మాస్టారు, ఏ.ఎం.రాజా, పి.లీల, సుశీల గార్లు చక్కని పాటలు పాడారు. ఎన్.టి.ఆర్., సావిత్రి, జగ్గయ్య, జమున, ఎస్.వి.ఆర్., సి.ఎస్.ఆర్., గుమ్మడి, రేలంగి, గిరిజ - ఒకరేమిటి అంతా కలసి నవ్వులు పండించారు ఈ చిత్రంలో. అత్యంత అద్బుతంగా హాస్యరసాన్ని ఒలికించిన ఈ చిత్రంలో మాస్టారి ఏకగళ, యుగళ, బహుగళ గీతాలు, పద్యాలు దాదాపు పదమూడున్నాయి. సాలూరు వారి స్వర సారధ్యంలో ఘంటసాల, లీల గార్లు పాడిన "ఆనందం పరమానందం" ఒక చక్కని పాట. ఈ పాటను ఎన్.టి.ఆర్., సావిత్రి, ఎస్.వి.ఆర్., హాస్య నటుడు బాలకృష్ణ ల పై చిత్రీకరించారు. విని ఆనందించండి.
స్వర్గీయ శ్రీ ఎన్.టి.ఆర్. జన్మదిన సందర్భంగా..
చిత్రం: | అప్పుచేసి పప్పుకూడు (1959) | |
రచన: | పింగళి నాగేంద్ర రావు | |
సంగీతం: | సాలూరు రాజేశ్వర రావు | |
గానం: | ఘంటసాల, పి.లీల | |
పల్లవి: | ఘంటసాల: | ఆనందం పరమానందం |
లీల: | ఆనందం పరమానందం | |
ఘంటసాల: | బాలకృష్ణుని లీలలు గాంచుట భక్త కోటులకు బ్రహ్మానందం | |
లీల: | బాలకృష్ణుని లీలలు గాంచుట భక్త కోటులకు బ్రహ్మానందం | |
ఇద్దరు: | ఆనందం పరమానందం ఆనందం పరమానందం | |
చరణం: | ఘంటసాల: | యమునా తటమున గోపికలందరు కృష్ణుని వెదకుట ఆనందం |
లీల: | యమునా తటమున గోపికలందరు కృష్ణుని వెదకుట ఆనందం | |
ఘంటసాల: | ఎవరికి దొరకక మురళీలోలుడు రాధకె చిక్కుట పరమానందం | |
లీల: | ఎవరికి దొరకక మురళీలోలుడు రాధకె చిక్కుట పరమానందం | |
ఇద్దరు: | ఆనందం పరమానందం ఆనందం పరమానందం | |
చరణం: | ఘంటసాల: | వేణుగానమున శిశువులు, పశువులు తన్మయమందుట ఆనందం |
లీల: | వేణుగానమున శిశువులు, పశువులు తన్మయమందుట ఆనందం | |
ఘంటసాల: | కృష్ణుని ముందర జగమును మరచే రాధను గాంచుట బ్రహ్మానందం | |
ఇద్దరు: | కృష్ణుని ముందర జగమును మరచే రాధను గాంచుట బ్రహ్మానందం | |
ఆనందం పరమానందం ఆనందం పరమానందం | ||
ఘంటసాల: | బాలకృష్ణుని లీలలు గాంచుట భక్త కోటులకు బ్రహ్మానందం | |
ఇద్దరు: | బాలకృష్ణుని లీలలు గాంచుట భక్త కోటులకు బ్రహ్మానందం | |
ఆనందం పరమానందం ఆనందం పరమానందం |
కృతజ్ఞతలు: యూ ట్యూబ్ వీడియో సమర్పించిన బొల్లాప్రగడ సోమేశ్వర రావు గారికి, సమాచారం సేకరించిన ఘంటసాల గళామృతము - పాటల పాలవెల్లి బ్లాగు కొల్లూరి భాస్కర్ గారికి, వికిపీడియా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.