చిత్రం: | భక్త రఘునాధ్ (1960) | |
రచన: | సముద్రాల రాఘవాచార్య | |
సంగీతం: | ఘంటసాల | |
గానం: | ఘంటసాల, బృందం | |
సాకీ: | ఘం: | మరచుటలేదు నీ స్మరణ మాకితరేఛ్చ మరేమి లేదు |
కాపురమును నమ్మలేదు, జలబుద్బుద సంపద కోరలేదు | ||
నీ చరణములాన దరిశన విచారమె మాత్రముగాని | ||
ఇంక ఏ అరమర లేదు, లేదూ.. | ||
భవదంఘ్రుల జూపగదే మహప్రభో.. మహప్రభో..ఓ..ఓ.. | ||
పల్లవి: | ఘం: | భవ తాపాలు బాపే నీపాద యుగళి చూపించుమా మాధవా.. |
రాధే శ్యామ్ రాధే శ్యామ్ | ||
భవ తాపాలు బాపే నీపాద యుగళి చూపించుమా మాధవా.. | ||
బృం: | రాధే శ్యామ్ రాధే శ్యామ్ | |
చరణం: | ఘం: | శృతి శిఖరాల మెలిగే పాదము |
బృం: | రాధే శ్యామ్ రాధే శ్యామ్ | |
ఘం: | యతి హృదయాల వెలిగే పాదము | |
బృం: | రాధే శ్యామ్ రాధే శ్యామ్ | |
ఘం: | శృతి శిఖరాల మెలిగే పాదము, యతి హృదయాల వెలిగే పాదము | |
నీ పాదారవిందము, ఆనంద కందము, జగదేక సుందరమూ.. | ||
బృం: | రాధే శ్యామ్ రాధే శ్యామ్ | |
చరణం: | ఘం: | విష నాగేంద్రు తలపై ఆడినా |
బృం: | రాధే శ్యామ్ రాధే శ్యామ్ | |
ఘం: | వ్రజ కాంతాళి వలచీ వేడినా | |
బృం: | రాధే శ్యామ్ రాధే శ్యామ్ | |
ఘం: | విష నాగేంద్రు తలపై ఆడినా, వ్రజ కాంతాళి వలచీ వేడినా | |
ఘన దనుజాళి వేచి, సురపాళి గాచిన, చరణాల చూపవయా.. | ||
బృం: | రాధే శ్యామ్ రాధే శ్యామ్ | |
రాధే శ్యామ్ రాధే శ్యామ్ | ||
రాధే శ్యామ్ రాధే శ్యామ్ | ||
రాధే శ్యామ్ రాధే శ్యామ్ |
కృతజ్ఞతలు:ఆడియో పొందుపరచిన ఘంటసాల గాన చరితకు, సమాచారం అందించిన ఘంటసాల గళామృతము - పాటల పాలవెల్లి మరియు వికి పీడియా బ్లాగులకు.