1965 సంవత్సరంలో విడుదలైన రాజ్యలక్ష్మీ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన వీరాభిమన్యు చిత్రం నుండి ఘంటసాల పాడిన "పరిత్రాణాయ సాధూనాం " అనే ఈ శ్లోకం భగవద్గీత లోనిది, స్వరపరచినది కె.వి.మహదేవన్. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, కాంతారావు, శోభన్బాబు, కాంచన, ఎస్.వరలక్ష్మి, జి.వరలక్ష్మి. ఈ చిత్రానికి నిర్మాత సుందర్లాల్ నహతా, డూండీ మరియు దర్శకుడు వి.మధుసూదనరావు.
గానం గాంధర్వం, గాత్రం అనన్యసాధ్యం, భావం అసాధారణం, భాష అతి సుందరం, ఉచ్చారణ సుస్పష్టం, అనుభూతి చర్విత చర్వణం.
21, జనవరి 2025, మంగళవారం
పరిత్రాణాయ సాధూనాం (శ్లోకం)- వీరాభిమన్యు చిత్రం నుండి ఘంటసాల
అనిమిష దైత్యకింపురుషులు (పద్యం) - వీరాభిమన్యు చిత్రం నుండి ఘంటసాల
#000 | పద్యం: | అనిమిష దైత్య కింపురుషులాదిగ |
---|---|---|
నిర్మాణం: | రాజ్యలక్ష్మీ ప్రొడక్షంస్ | |
చిత్రం: | వీరాభిమన్యు (1965) | |
రచన: | తిక్కన - మహాభారతం నుండి | |
సంగీతం: | కె.వి.మహదేవన్ | |
గానం: | ఘంటసాల | |
అనిమిష దైత్య కింపురుషులాదిగ ఎవ్వరు వచ్చి గాచినన్ | ||
దునుముదు రేపు సైంధవుని తోయజమిత్రుడు గ్రుంకకుండు ము | ||
న్నే నరవరేణ్యా, యిత్తెరగు నాకొనరింపగ రాకయున్న నే | ||
ననలము సొచ్చువాడ నృపులందరు చూడగ గాండీవమ్ముతో |
స్ధానుడె తోడుగా (పద్యం) - వీరాభిమన్యు చిత్రం నుండి ఘంటసాల
1965 సంవత్సరంలో విడుదలైన రాజ్యలక్ష్మీ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన వీరాభిమన్యు చిత్రం నుండి ఘంటసాల పాడిన "స్ధానుడె తోడుగా " అనే ఈ పద్యం రచన సముద్రాల సీ., స్వరపరచినది కె.వి.మహదేవన్. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, కాంతారావు, శోభన్బాబు, కాంచన, ఎస్.వరలక్ష్మి, జి.వరలక్ష్మి. ఈ చిత్రానికి నిర్మాత సుందర్లాల్ నహతా, డూండీ మరియు దర్శకుడు వి.మధుసూదనరావు.
#000 | పద్యం: | స్థాణుడె తోడుగా |
---|---|---|
నిర్మాణం: | రాజ్యలక్ష్మీ ప్రొడక్షంస్ | |
చిత్రం: | వీరాభిమన్యు (1965) | |
రచన: | సముద్రాల సీనియర్ | |
సంగీతం: | కె.వి.మహదేవన్ | |
గానం: | ఘంటసాల | |
స్థాణుడె తోడుగా ప్రమథసంఘముతో రణసీమ నిల్చినన్ | ||
ద్రోణు నెదిర్చి మొగ్గరము ధూళిగ జేసెద నాదు ధాటికిన్ | ||
త్రాణలు తప్పి పారు కురురాజును కర్ణుని దుస్ససేనునిన్ | ||
ప్రాణముతోడ బట్టికొని వచ్చెద ఇచ్చెద మీకు కాన్కగా! |
నీ సఖులన్ సహోదరుల (పద్యం) - వీరాభిమన్యు చిత్రం నుండి ఘంటసాల
1965 సంవత్సరంలో విడుదలైన రాజ్యలక్ష్మీ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన వీరాభిమన్యు చిత్రం నుండి ఘంటసాల పాడిన "నీ సఖులన్ సహోదరుల " అనే ఈ పద్యం రచన సముద్రాల సీ., స్వరపరచినది కె.వి.మహదేవన్. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, కాంతారావు, శోభన్బాబు, కాంచన, ఎస్.వరలక్ష్మి, జి.వరలక్ష్మి. ఈ చిత్రానికి నిర్మాత సుందర్లాల్ నహతా, డూండీ మరియు దర్శకుడు వి.మధుసూదనరావు.
#000 | పద్యం: | నీ సఖులన్ సహోదరుల |
---|---|---|
నిర్మాణం: | రాజ్యలక్ష్మీ ప్రొడక్షంస్ | |
చిత్రం: | వీరాభిమన్యు (1965) | |
రచన: | సముద్రాల సీనియర్ | |
సంగీతం: | కె.వి.మహదేవన్ | |
గానం: | ఘంటసాల | |
నీ సఖులన్ సహోదరుల నిన్ను నిమేషములో వధించి, నే | ||
నీ సభలో సమాధి యొనరింపగజాలుదు, కానీ మీ తలన్ | ||
వ్రాసె విధాత దుర్మృతిని పాండుకుమారుల చేత లోక సం | ||
త్రాసము నాపగా తరమె తప్పదు తప్పదు | ||
యుద్ధము బంధునాశనమున్ |
పాలకడలివంటి (పద్యం) - వీరాభిమన్యు చిత్రం నుండి ఘంటసాల
1965 సంవత్సరంలో విడుదలైన రాజ్యలక్ష్మీ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన వీరాభిమన్యు చిత్రం నుండి ఘంటసాల పాడిన "పాలకడలివంటి " అనే ఈ పద్యం రచన సముద్రాల సీ., స్వరపరచినది కె.వి.మహదేవన్. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, కాంతారావు, శోభన్బాబు, కాంచన, ఎస్.వరలక్ష్మి, జి.వరలక్ష్మి. ఈ చిత్రానికి నిర్మాత సుందర్లాల్ నహతా, డూండీ మరియు దర్శకుడు వి.మధుసూదనరావు.
#000 | పద్యం: | పాలకడలి వంటి |
---|---|---|
నిర్మాణం: | రాజ్యలక్ష్మీ ప్రొడక్షంస్ | |
చిత్రం: | వీరాభిమన్యు (1965) | |
రచన: | సముద్రాల సీనియర్ | |
సంగీతం: | కె.వి.మహదేవన్ | |
గానం: | ఘంటసాల | |
పాలకడలి వంటి పాండవాగ్రజు మదిన్ | ||
కోపాగ్ని రగిలి భగ్గుమనునాడు | ||
గంధ గజేంద్రమ్ము కరణి భీముడు నిన్ను | ||
నీ సహోదరుల మ్రందించునాడు | ||
పరమేశునోర్చిన పార్థుడు గాండీవ | ||
మంది కర్ణుని దునుమాడునాడు | ||
మాయారణ విదుండు మా ఘటోత్కచుడు నీ | ||
బలగమ్ము గంగలో కలుపునాడు | ||
గీ॥ | ఎదిరి గెలువంగ నేర్తువే ఇందరేల | |
అభినవ త్రినేత్రమూర్తి వీరాభిమన్యు | ||
డొక్కడే చాలు సంగరమోర్చి గెలువ | ||
ఈ మహావీరులందెవ్వరేని అడ్డు | ||
రారు, నిను కావగాలేరు రాజ రాజ! |
రంభా ఊర్వశి తలదన్నే - వీరాభిమన్యు చిత్రం నుండి ఘంటసాల,పి.సుశీల
1965 సంవత్సరంలో విడుదలైన రాజ్యలక్ష్మీ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన వీరాభిమన్యు చిత్రం నుండి ఘంటసాలపి.సుశీల తో పాడిన "రంభా ఊర్వశి తలదన్నే" అనే ఈ యుగళం రచన ఆరుద్ర, స్వరపరచినది కె.వి.మహదేవన్. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, కాంతారావు, శోభన్బాబు, కాంచన, ఎస్.వరలక్ష్మి, జి.వరలక్ష్మి. ఈ చిత్రానికి నిర్మాత సుందర్లాల్ నహతా, డూండీ మరియు దర్శకుడు వి.మధుసూదనరావు.
చల్లని సామివి నీవైతే (యుగళం) - వీరాభిమన్యు చిత్రం నుండి ఘంటసాల,పి.సుశీల
1965 సంవత్సరంలో విడుదలైన రాజ్యలక్ష్మీ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన వీరాభిమన్యు చిత్రం నుండి ఘంటసాలపి.సుశీల తో పాడిన "చల్లని సామివినీవైతే " అనే ఈ యుగళం రచన ఆత్రేయ, స్వరపరచినది కె.వి.మహదేవన్. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, కాంతారావు, శోభన్బాబు, కాంచన, ఎస్.వరలక్ష్మి, జి.వరలక్ష్మి. ఈ చిత్రానికి నిర్మాత సుందర్లాల్ నహతా, డూండీ మరియు దర్శకుడు వి.మధుసూదనరావు.
#000 | పాట: | చల్లని సామివి నీవైతే |
---|---|---|
నిర్మాణం: | రాజ్యలక్ష్మీ ప్రొడక్షంస్ | |
చిత్రం : | వీరాభిమన్యు (1965) | |
సంగీతం : | కె.వి. మహదేవన్ | |
గీతరచయిత : | ఆచార్య ఆత్రేయ | |
నేపథ్య గానం : | ఘంటసాల, సుశీల | |
ప : | సుశీల: | చల్లని సామివి నీవైతే .. అల్లన ఆగుము జాబిల్లీ |
ఎదలో కరుణే నీకుంటే .. ఉదయం కానీకోయీ | ||
చల్లని సామివి నీవైతే .. అల్లన ఆగుము జాబిల్లీ | ||
ఎదలో కరుణే నీకుంటే .. ఉదయం కానీకోయీ | ||
చల్లని సామివి నీవైతే .. అల్లన ఆగుము జాబిల్లీ | ||
చ1: | ఘంటసాల: | ముక్కున ముక్కెర అందం కానీ |
ముచ్చటకది ప్రతిబంధం | ||
ముక్కున ముక్కెర అందం కానీ | ||
ముచ్చటకది ప్రతిబంధం | ||
మన ఆనందానికి అడ్డయ్యే ఏ | ||
అందమైనా ఎందులకూ? | ||
అందమైనా ఎందులకు?..ఊ... | ||
సుశీల: | రసమయ హృదయం నీదైతే | |
రతిరాజా కనుమూయకుము | ||
మా ప్రణయం పచ్చగ ఉండే వరకు | ||
రణభేరీ మ్రోగకుమూ | ||
చ2: | ఘంటసాల: | గాజులు చేతికి సొంపు..ప్రణయానికి అవి సడలింపు |
గాజులు చేతికి సొంపు..ప్రణయానికి అవి సడలింపు | ||
మన అనుబంధానికి అడ్డయ్యే | ||
ఈ ఆభరణాలు ఎందులకు? | ||
ఆభరణాలు ఎందులకు? | ||
సుశీల: | తీరని కోరిక నీదైతే, తారా చంద్రుని తరమకుము | |
ఈ తీయని వెన్నెల దోచుకుపోయే | ||
దినరాజును రానీయకుమూ | ||
చ3: | ఘంటసాల: | పదముల కందము అందియలూ |
అవి పలుమరు చేయును సందడులు | ||
పదముల కందము అందియలూ | ||
అవి పలుమరు చేయును సందడులు | ||
తలపులు పండే తరుణంలో | ||
ఈ సవ్వడులన్నీ ఎందులకు?... | ||
సవ్వడులన్నీ ఎందులకు? | ||
సుశీల: | చల్లని సామివి నీవైతే .. అల్లన ఆగుము జాబిల్లీ | |
ఎదలో కరుణే నీకుంటే .. ఉదయం కానీకోయీ | ||
చల్లని సామివి నీవైతే .. అల్లన ఆగుము జాబి...ల్లీ |
అదిగో నవలోకం (యుగళం) - వీరాభిమన్యు చిత్రం నుండి ఘంటసాల,పి.సుశీల
1965 సంవత్సరంలో విడుదలైన రాజ్యలక్ష్మీ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన వీరాభిమన్యు చిత్రం నుండి ఘంటసాలపి.సుశీల తో పాడిన "అదిగో నవలోకం " అనే ఈ యుగళం రచన ఆరుద్ర, స్వరపరచినది కె.వి.మహదేవన్. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, కాంతారావు, శోభన్బాబు, కాంచన, ఎస్.వరలక్ష్మి, జి.వరలక్ష్మి. ఈ చిత్రానికి నిర్మాత సుందర్లాల్ నహతా, డూండీ మరియు దర్శకుడు వి.మధుసూదనరావు.
చూచి వలచి (యుగళం) - వీరాభిమన్యు చిత్రం నుండి ఘంటసాల,పి.సుశీల
1965 సంవత్సరంలో విడుదలైన రాజ్యలక్ష్మీ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన వీరాభిమన్యు చిత్రం నుండి ఘంటసాలపి.సుశీల తో పాడిన "చూచి వలచి " అనే ఈ యుగళం రచన ఆరుద్ర, స్వరపరచినది కె.వి.మహదేవన్. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, కాంతారావు, శోభన్బాబు, కాంచన, ఎస్.వరలక్ష్మి, జి.వరలక్ష్మి. ఈ చిత్రానికి నిర్మాత సుందర్లాల్ నహతా, డూండీ మరియు దర్శకుడు వి.మధుసూదనరావు.
తరతమ భేదంబు తలపక (పద్యం) - శకుంతల చిత్రం నుండి ఘంటసాల
1966 సంవత్సరంలో విడుదలైన రాజ్యం సంస్థ నిర్మించిన శకుంతల చిత్రం నుండి ఘంటసాల పాడిన "తరతమ భేదంబు తలపక ధర్మము " అనే ఈ పద్యం రచన సముద్రాల సీ., స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు,బి. సరోజాదేవి, నాగయ్య, పద్మనాభం, గీతాంజలి. ఈ చిత్రానికి నిర్మాత శ్రీధరరావు-రాజ్యం మరియు దర్శకుడు కె.కామేశ్వర రావు.
(ఈ
పై సమాచారం శ్రీ వి.వి.రామారావు గ్రంథస్థం చేసిన “జీవితమే సఫలము – సీనియర్ సముద్రాల
సినీగీతాలకు సుమధుర వ్యాఖ్య – మూడవ సంపుటి” నుండి స్వీకరించబడినది. శ్రీ వి.వి.రామారావు
గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.)
చెలియ! నీ మేను (పద్యం) - శకుంతల చిత్రం నుండి ఘంటసాల
శకుంతల చిత్రంలో దుష్యంతుడు (ఎన్.టి.ఆర్.) పై పద్యాన్ని శకుంతల (బి.సరోజాదేవి) తో అంటాడు.
(ఈ సమాచారము డా.వి.వి.రామారావు గారు గ్రంథస్థం చేసిన "జీవితమే సఫలము - సీనియర్ సముద్రాల సినీగీతాలకు సుమధుర వ్యాఖ్య - మూడవ సంపుటి" నుండి స్వీకరించబడినది. శ్రీ వి.వి.రామారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు)
చల్లనివై శ్రమంబుడుప (పద్యం) - శకుంతల చిత్రం నుండి ఘంటసాల
1966 సంవత్సరంలో విడుదలైన రాజ్యం సంస్థ నిర్మించిన శకుంతల చిత్రం నుండి ఘంటసాల పాడిన "చల్లనివై శ్రమం బుడుపజాలిన" అనే ఈ పద్యం రచన కందుకూరి వీరేశలింగం పంతులు గారు, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, బి. సరోజాదేవి, నాగయ్య, పద్మనాభం, గీతాంజలి. ఈ చిత్రానికి నిర్మాత శ్రీధరరావు-రాజ్యం మరియు దర్శకుడు కె.కామేశ్వర రావు.
#000 | పద్యం: | చల్లనివై శ్రమంబుడుప జాలిన |
---|---|---|
నిర్మాణం: | రాజ్యం వారి | |
చిత్రం: | శకుంతల (1966) | |
రచన: | కందుకూరి వీరేశలింగం పంతులు | |
సంగీతం: | ఘంటసాల | |
గానం: | ఘంటసాల | |
ఉ: | చల్లనివై శ్రమంబుడుపజాలిన తామరపాకు వీవనల్ | |
మెల్లనగొంచు వీచుదునో మిక్కిలి శీతలమైన వాయువున్ | ||
సల్లలితారుణాబ్జ సదృశంబగు నీ చరణద్వయంబు నో | ||
పల్లవపాణి నా తొడలపైనిడి హాయిగ బట్టువాడనో |
శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు మహాకవి కాళిదాసు ప్రణీతమైన "అభిజ్ఞాన శాకుంతలము" సంస్కృత కావ్యాన్ని గద్యపద్యాత్మకముగా వారు చెన్నపురి (మద్రాసు) లోని దొరతనపువారి కళాశాలలో తెనుగు పండితునిగాయున్న సమయం (1931) లో "అభిజ్ఞాన శాకుంతలనాటకము" అను పేర రచించారు. అందుండి పై పద్యాన్ని 1966 లో విడుదలైన శకుంతల చిత్రంలో ఉపయోగించారు.
20, జనవరి 2025, సోమవారం
యాస్యత్యద్య శకుంతలేతి (శ్లోకం) - శకుంతల చిత్రం నుండి ఘంటసాల
1966 సంవత్సరంలో విడుదలైన రాజ్యం సంస్థ నిర్మించిన శకుంతల చిత్రం నుండి ఘంటసాల పాడిన "యాస్యత్యద్య శకుంతలేతి " అనే ఈ శ్లోకం రచన మహాకవికాళిదాసు, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు,బి. సరోజాదేవి, నాగయ్య, పద్మనాభం, గీతాంజలి. ఈ చిత్రానికి నిర్మాత శ్రీధరరావు-రాజ్యం మరియు దర్శకుడు కె.కామేశ్వర రావు.
కంఠః
స్తంభితబాష్పవృత్తికలుషశ్చింతాజడం దర్శనమ్।
వైక్లవ్యం
మమ తావదీదృశమిదం స్నేహాదరణ్యౌకసః
పీడ్యంతే
గృహిణః కథం ను తనయావిశ్లేషదుఃఖైర్నవైః॥
ఈ శ్లోకం మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం కావ్యంలోనిది. ఇది శార్దూల వృత్తంలో రచించబడింది. శకుంతలను పెంచిన కణ్వ మహర్షి ఆమెను అత్తవారింటికి పంపేటపుడు చూపిన భావాలను ఈ శ్లోకంలో కాళిదాసు వివరిస్తాడు. దీని అర్థము యీ విధంగా వుంటుంది.
”ఈరోజు శకుంతల అత్తవారింటికి వెళ్ళునని నా హృదయం మిక్కిలి దుఃఖంతో కూడుకొన్నది. కన్నీటిని అణచుకొన్నందుకు గొంతు డగ్గుత్తికతో వుంది. చింత వలన చూపానటం లేదు. పెంచిన అమ్మాయిని అత్తవారింటికి పంపుటకు అరణ్యవాసినైన నాకే ప్రేమ వలన యిట్టి అధైర్యము కలిగితే యిక గృహస్థులు, కని పెంచిన వారు తమ కుమార్తెను క్రొత్తగా భర్త యింటికి పంపుటకు యెంతటి వియోగదుఃఖాన్ననుభవిస్తారో... ఇదీ శకుంతలను దుష్యంతుని వద్దకు పంపుతున్నప్పుడు ఆమె పెంపుడు తండ్రియైన కణ్వమహర్షి దుఃఖించిన తీరు.”
శెంగాయి కట్టిన సిన్నది - శకుంతల చిత్రం నుండి ఘంటసాల, బృందం
1966 సంవత్సరంలో విడుదలైన రాజ్యం సంస్థ నిర్మించిన శకుంతల చిత్రం నుండి ఘంటసాల పాడిన "శెంగాయి కట్టిన సిన్నది" అనే ఈ బృందం రచన కొసరాజు, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు,బి. సరోజాదేవి, నాగయ్య, పద్మనాభం, గీతాంజలి. ఈ చిత్రానికి నిర్మాత శ్రీధరరావు-రాజ్యం మరియు దర్శకుడు కె.కామేశ్వర రావు.
సరసన నీవుంటే జాబిలి నాకేల - శకుంతల చిత్రం నుండి ఘంటసాల,పి.సుశీల
1966 సంవత్సరంలో విడుదలైన రాజ్యం సంస్థ నిర్మించిన శకుంతల చిత్రం నుండి ఘంటసాల పాడిన "సరసన నీవుంటే జాబిలి నాకేల" అనే ఈ యుగళం రచన డా.సినారె, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, బి. సరోజాదేవి, నాగయ్య, పద్మనాభం, గీతాంజలి. ఈ చిత్రానికి నిర్మాత శ్రీధరరావు-రాజ్యం మరియు దర్శకుడు కె.కామేశ్వర రావు.
నీవు నేనూ కలసిననాడే - శకుంతల చిత్రం నుండి ఘంటసాల,పి.సుశీల
మదిలో మౌనముగా - శకుంతల చిత్రం నుండి ఘంటసాల
1966 సంవత్సరంలో
విడుదలైన రాజ్యం సంస్థ నిర్మించిన శకుంతల చిత్రం నుండి ఘంటసాల పాడిన "మదిలో మౌనముగా కదలె మధుర వీణా
మదిలో " అనే ఈ ఏకగళం రచన
డా.సినారె, స్వరపరచినది ఘంటసాల.
ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు,
బి. సరోజాదేవి, నాగయ్య, పద్మనాభం, గీతాంజలి. ఈ చిత్రానికి నిర్మాత
శ్రీధరరావు-రాజ్యం మరియు దర్శకుడు కె.కామేశ్వర రావు.
19, జనవరి 2025, ఆదివారం
దయచెయ్యండి దయచెయ్యండి - మాయాబజార్ చిత్రం నుండి ఘంటసాల,బృందం
1957 సంవత్సరంలో విడుదలైన విజయా సంస్థ నిర్మించిన మాయాబజార్ చిత్రం నుండి ఘంటసాలఘంటసాల,మాధవపెద్ది,పిఠాపురం,పి.సుశీల,రాణి,స్వర్ణలత బృందం పాడిన "దయచెయ్యండి దయచెయ్యండి" అనే ఈ బహుగళం రచన పింగళి, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, అక్కినేని, ఎస్.వి. రంగారావు, రేలంగి, ఆర్. నాగేశ్వరరావు, సి. ఎస్. ఆర్., ఆంజనేయులు, గుమ్మడి, సావిత్రి, ఛాయాదేవి, ఋష్యేంద్రమణి. ఈ చిత్రానికి నిర్మాత నాగిరెడ్డి-చక్రపాణి మరియు దర్శకుడు కె.వి.రెడ్డి.