1965 సంవత్సరంలో విడుదలైన రాజ్యలక్ష్మీ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన వీరాభిమన్యు చిత్రం నుండి ఘంటసాల పాడిన "పాలకడలివంటి " అనే ఈ పద్యం రచన సముద్రాల సీ., స్వరపరచినది కె.వి.మహదేవన్. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, కాంతారావు, శోభన్బాబు, కాంచన, ఎస్.వరలక్ష్మి, జి.వరలక్ష్మి. ఈ చిత్రానికి నిర్మాత సుందర్లాల్ నహతా, డూండీ మరియు దర్శకుడు వి.మధుసూదనరావు.
#000 | పద్యం: | పాలకడలి వంటి |
---|---|---|
నిర్మాణం: | రాజ్యలక్ష్మీ ప్రొడక్షంస్ | |
చిత్రం: | వీరాభిమన్యు (1965) | |
రచన: | సముద్రాల సీనియర్ | |
సంగీతం: | కె.వి.మహదేవన్ | |
గానం: | ఘంటసాల | |
పాలకడలి వంటి పాండవాగ్రజు మదిన్ | ||
కోపాగ్ని రగిలి భగ్గుమనునాడు | ||
గంధ గజేంద్రమ్ము కరణి భీముడు నిన్ను | ||
నీ సహోదరుల మ్రందించునాడు | ||
పరమేశునోర్చిన పార్థుడు గాండీవ | ||
మంది కర్ణుని దునుమాడునాడు | ||
మాయారణ విదుండు మా ఘటోత్కచుడు నీ | ||
బలగమ్ము గంగలో కలుపునాడు | ||
గీ॥ | ఎదిరి గెలువంగ నేర్తువే ఇందరేల | |
అభినవ త్రినేత్రమూర్తి వీరాభిమన్యు | ||
డొక్కడే చాలు సంగరమోర్చి గెలువ | ||
ఈ మహావీరులందెవ్వరేని అడ్డు | ||
రారు, నిను కావగాలేరు రాజ రాజ! |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి