పాట: జి.కృష్ణమూర్తి
స్తోత్రం: వేదవ్యాస విరచితం
సంగీతం: రాజన్-నాగేంద్ర
గానం: ఘంటసాల, బృందం
గ్రహాల ప్రభావం మన నిత్య కర్మలపై, దైనందిన జీవితం లోని ఫలితాలపై ఉంటుందని చాలామంది నమ్మకం. మన జ్యోతిష శాస్త్రము ప్రకారం గ్రహాలు తొమ్మిది. అవి సూర్య, చంద్ర, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు గ్రహాలు. ఇందులో రాహువు, కేతువు ఛాయా గ్రహాలు. దక్షిణ భారత దేశంలో ముఖ్యంగా శివ కోవెలలో నవ గ్రహాలను ఈశాన్య దిక్కున ప్రతిష్టిస్తారు. సూర్యుడు కేంద్రంగా మిగిలిన ఎనిమిది గ్రహాలను 3 x 3 వరుసలో ప్రతిష్టిస్తారు. ఈ పోస్టులో ఘంటసాల మాస్టారు నవగ్రహ పూజా మహిమ కోసం గానం చేసిన "నవగ్రహ స్తోత్రం" యొక్క ఆడియో, సాహిత్యం పొందుపరుస్తున్నాను. అయితే నిత్యం వినే స్తోత్రానికి, సినిమాలోని సాహిత్యానికి స్వల్ప వ్యత్యాసం ఉన్నది.
సాకీ: శరణు శరణు గ్రహదేవులారా శరణు
మీ మహిమలను తెలుసుకున్నాను
దాసోహమన్నాను కనులు తెరిచాను
కనులు తెరిచాను
ప: నా మొరను మీరాలకించి
అపరాధము మన్నించి
కావరా మీ దయజూపి | నా మొరను |
చ: చేతులారా నేనే, చేసినానపచారం | చేతులారా |
దోషమంతా నాదే, దోషఫలమూ నాదే
కరుణతో నను ఆదరించిన నిరపరాధులకా యీ దందన | నా మొరను |
ఘం: సప్తాశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్ |
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
ఘం: శ్వేతాశ్వరథమారూఢం కేయూర మకుటోజ్వలమ్ |
జటాధర శిరోరత్నం తం చంద్రం ప్రణమామ్యహమ్ ||
ఘం: ధరణీగర్భసంభూతం విద్యుత్ కాంతి సమప్రభమ్ |
కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహమ్ ||
ఘం: ప్రియాంగుకలికా శ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ |
సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ ||
ఘం: దేవనాం చ ఋషీనాం చ గురుకాంచన సన్నిభమ్ |
బుద్ధిభూతం త్రిలోకేశం తం గురుం ప్రణమామ్యహమ్ ||
ఘం: హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుమ్ |
సర్వశాస్త్ర ప్రవక్తారం తం శుక్రం ప్రణమామ్యహమ్ ||
ఘం: నీలాంజన సమాభాసం రవి పుత్రం యమాగ్రజమ్ |
ఛాయా మర్తాండ సంభూతం తం శనిం ప్రణమామ్యహమ్ ||
ఘం: అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనమ్ |
సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ ||
ఘం: పలాశపుష్పసంకాశం తారకాగ్రహమస్తకమ్ |
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ ||
ఘం: ప్రణమామ్యహమ్, ప్రణమామ్యహమ్, ప్రణమామ్యహమ్
____________________________________________________
కృతజ్ఞతలు: వీడియో పొందు పరచిన శ్రీ బొల్లాప్రగడ సోమేశ్వర రావు గారికి.