1965 సంవత్సరంలో విడుదలైన రాజ్యలక్ష్మీ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన వీరాభిమన్యు చిత్రం నుండి ఘంటసాలపి.సుశీల తో పాడిన "చల్లని సామివినీవైతే " అనే ఈ యుగళం రచన ఆత్రేయ, స్వరపరచినది కె.వి.మహదేవన్. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, కాంతారావు, శోభన్బాబు, కాంచన, ఎస్.వరలక్ష్మి, జి.వరలక్ష్మి. ఈ చిత్రానికి నిర్మాత సుందర్లాల్ నహతా, డూండీ మరియు దర్శకుడు వి.మధుసూదనరావు.
#000 | పాట: | చల్లని సామివి నీవైతే |
---|---|---|
నిర్మాణం: | రాజ్యలక్ష్మీ ప్రొడక్షంస్ | |
చిత్రం : | వీరాభిమన్యు (1965) | |
సంగీతం : | కె.వి. మహదేవన్ | |
గీతరచయిత : | ఆచార్య ఆత్రేయ | |
నేపథ్య గానం : | ఘంటసాల, సుశీల | |
ప : | సుశీల: | చల్లని సామివి నీవైతే .. అల్లన ఆగుము జాబిల్లీ |
ఎదలో కరుణే నీకుంటే .. ఉదయం కానీకోయీ | ||
చల్లని సామివి నీవైతే .. అల్లన ఆగుము జాబిల్లీ | ||
ఎదలో కరుణే నీకుంటే .. ఉదయం కానీకోయీ | ||
చల్లని సామివి నీవైతే .. అల్లన ఆగుము జాబిల్లీ | ||
చ1: | ఘంటసాల: | ముక్కున ముక్కెర అందం కానీ |
ముచ్చటకది ప్రతిబంధం | ||
ముక్కున ముక్కెర అందం కానీ | ||
ముచ్చటకది ప్రతిబంధం | ||
మన ఆనందానికి అడ్డయ్యే ఏ | ||
అందమైనా ఎందులకూ? | ||
అందమైనా ఎందులకు?..ఊ... | ||
సుశీల: | రసమయ హృదయం నీదైతే | |
రతిరాజా కనుమూయకుము | ||
మా ప్రణయం పచ్చగ ఉండే వరకు | ||
రణభేరీ మ్రోగకుమూ | ||
చ2: | ఘంటసాల: | గాజులు చేతికి సొంపు..ప్రణయానికి అవి సడలింపు |
గాజులు చేతికి సొంపు..ప్రణయానికి అవి సడలింపు | ||
మన అనుబంధానికి అడ్డయ్యే | ||
ఈ ఆభరణాలు ఎందులకు? | ||
ఆభరణాలు ఎందులకు? | ||
సుశీల: | తీరని కోరిక నీదైతే, తారా చంద్రుని తరమకుము | |
ఈ తీయని వెన్నెల దోచుకుపోయే | ||
దినరాజును రానీయకుమూ | ||
చ3: | ఘంటసాల: | పదముల కందము అందియలూ |
అవి పలుమరు చేయును సందడులు | ||
పదముల కందము అందియలూ | ||
అవి పలుమరు చేయును సందడులు | ||
తలపులు పండే తరుణంలో | ||
ఈ సవ్వడులన్నీ ఎందులకు?... | ||
సవ్వడులన్నీ ఎందులకు? | ||
సుశీల: | చల్లని సామివి నీవైతే .. అల్లన ఆగుము జాబిల్లీ | |
ఎదలో కరుణే నీకుంటే .. ఉదయం కానీకోయీ | ||
చల్లని సామివి నీవైతే .. అల్లన ఆగుము జాబి...ల్లీ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి