1966 సంవత్సరంలో విడుదలైన రాజ్యం సంస్థ నిర్మించిన శకుంతల చిత్రం నుండి ఘంటసాల పాడిన "చల్లనివై శ్రమం బుడుపజాలిన" అనే ఈ పద్యం రచన కందుకూరి వీరేశలింగం పంతులు గారు, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, బి. సరోజాదేవి, నాగయ్య, పద్మనాభం, గీతాంజలి. ఈ చిత్రానికి నిర్మాత శ్రీధరరావు-రాజ్యం మరియు దర్శకుడు కె.కామేశ్వర రావు.
#000 | పద్యం: | చల్లనివై శ్రమంబుడుప జాలిన |
---|---|---|
నిర్మాణం: | రాజ్యం వారి | |
చిత్రం: | శకుంతల (1966) | |
రచన: | కందుకూరి వీరేశలింగం పంతులు | |
సంగీతం: | ఘంటసాల | |
గానం: | ఘంటసాల | |
ఉ: | చల్లనివై శ్రమంబుడుపజాలిన తామరపాకు వీవనల్ | |
మెల్లనగొంచు వీచుదునో మిక్కిలి శీతలమైన వాయువున్ | ||
సల్లలితారుణాబ్జ సదృశంబగు నీ చరణద్వయంబు నో | ||
పల్లవపాణి నా తొడలపైనిడి హాయిగ బట్టువాడనో |
శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు మహాకవి కాళిదాసు ప్రణీతమైన "అభిజ్ఞాన శాకుంతలము" సంస్కృత కావ్యాన్ని గద్యపద్యాత్మకముగా వారు చెన్నపురి (మద్రాసు) లోని దొరతనపువారి కళాశాలలో తెనుగు పండితునిగాయున్న సమయం (1931) లో "అభిజ్ఞాన శాకుంతలనాటకము" అను పేర రచించారు. అందుండి పై పద్యాన్ని 1966 లో విడుదలైన శకుంతల చిత్రంలో ఉపయోగించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి