1966 సంవత్సరంలో విడుదలైన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన శ్రీకృష్ణతులాభారం చిత్రం నుండి ఘంటసాల పాడిన "ఓ చెలి కోపమా అంతలో తాపమా సఖీ " అనే ఈ ఏకగళం రచన దాశరథి, స్వరపరచినది పెండ్యాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, జమున, కాంతారావు, అంజలీదేవి, పద్మనాభం. ఈ చిత్రానికి నిర్మాత డి. రామానాయుడు మరియు దర్శకుడు కె.కామేశ్వర రావు.
Thanks to Sri Nukala Prabhakar garu for providing the video clip.
#000 | పాట: | ఓ చెలీ! కోపమా |
---|---|---|
చిత్రం: | శ్రీకృష్ణ తులాభారం (1969) | |
రచన: | పాట - సముద్రాల రాఘవాచార్య | |
పద్యం - నందితిమ్మన (పారిజాతాపహరణం నుండి) | ||
సంగీతం: | పెండ్యాల | |
గానం: | ఘంటసాల | |
ప : | ఓ చెలి! కోపమా అంతలో తాపమా | |
సఖీ నీ వలిగితే నే తాళజాలా | ||
ఓ చెలి! కోపమా అంతలో తాపమా | ||
సఖీ నీ వలిగితే నే తాళజాలా | ||
చ : | అందాలు చిందేమోము కందేను ఆవేదనలో.. | |
పన్నీట తేలించెదనే మన్నించవే... | ||
ఓ చెలి! కోపమా... అంతలో తాపమా... | ||
సఖీ నీ వలిగితే నే తాళజాలా | ||
ఓ చెలి! కోపమా అంతలో తాపమా.. | ||
సఖీ నీ వలిగితే నే తాళజాలా | ||
చ : | ఏనాడు దాచని మేను ఈ నాడు దాచెదవేల? | |
దరిచేరి అలరించెదనే దయచూపవే... | ||
ఓ చెలి! కోపమా అంతలో తాపమా | ||
సఖీ నీ వలిగితే నే తాళజాలా | ||
చ : | ఈ మౌనమోపగలేనే విరహాలు సైపగలేనే | |
తలవంచి నీ పదములకూ మ్రొక్కేనులే.... | ||
ఓ చెలి! కోపమా అంతలో తాపమా | ||
సఖీ నీ వలిగితే నే తాళజాలా | ||
నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కిన్కబూని తా | ||
చిన అది నాకు మన్ననయా, చెల్వగు నీ పదపల్లవమ్ము మ | ||
త్తను పులకాగ్ర కంటకవితానము తాకిన నొచ్చునంచు నే | ||
ననియెద! అల్క మానవుకదా యికనైన అరాళ కుంతలా! ఆ..ఆ. |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి