1966 సంవత్సరంలో విడుదలైన రాజ్యం సంస్థ నిర్మించిన శకుంతల చిత్రం నుండి ఘంటసాల పాడిన "యాస్యత్యద్య శకుంతలేతి " అనే ఈ శ్లోకం రచన మహాకవికాళిదాసు, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు,బి. సరోజాదేవి, నాగయ్య, పద్మనాభం, గీతాంజలి. ఈ చిత్రానికి నిర్మాత శ్రీధరరావు-రాజ్యం మరియు దర్శకుడు కె.కామేశ్వర రావు.
కంఠః
స్తంభితబాష్పవృత్తికలుషశ్చింతాజడం దర్శనమ్।
వైక్లవ్యం
మమ తావదీదృశమిదం స్నేహాదరణ్యౌకసః
పీడ్యంతే
గృహిణః కథం ను తనయావిశ్లేషదుఃఖైర్నవైః॥
ఈ శ్లోకం మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం కావ్యంలోనిది. ఇది శార్దూల వృత్తంలో రచించబడింది. శకుంతలను పెంచిన కణ్వ మహర్షి ఆమెను అత్తవారింటికి పంపేటపుడు చూపిన భావాలను ఈ శ్లోకంలో కాళిదాసు వివరిస్తాడు. దీని అర్థము యీ విధంగా వుంటుంది.
”ఈరోజు శకుంతల అత్తవారింటికి వెళ్ళునని నా హృదయం మిక్కిలి దుఃఖంతో కూడుకొన్నది. కన్నీటిని అణచుకొన్నందుకు గొంతు డగ్గుత్తికతో వుంది. చింత వలన చూపానటం లేదు. పెంచిన అమ్మాయిని అత్తవారింటికి పంపుటకు అరణ్యవాసినైన నాకే ప్రేమ వలన యిట్టి అధైర్యము కలిగితే యిక గృహస్థులు, కని పెంచిన వారు తమ కుమార్తెను క్రొత్తగా భర్త యింటికి పంపుటకు యెంతటి వియోగదుఃఖాన్ననుభవిస్తారో... ఇదీ శకుంతలను దుష్యంతుని వద్దకు పంపుతున్నప్పుడు ఆమె పెంపుడు తండ్రియైన కణ్వమహర్షి దుఃఖించిన తీరు.”
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి