లీలామానుషరూపుడైన
శ్రీకృష్ణుని పై సముద్రాల రాఘవాచార్యులు గారు
చక్కని వర్ణన యిచ్చారు జయహే కృష్ణావతారా పాటలో.
తొలుత శ్రీకృష్ణుని జననంతో
ప్రారంభించి, రక్కసి పూతన మరియు
శకటాసుర సంహారం, ఆఖరున కంసవధతో
అంతమౌతుంది. మధ్య చరణాలలో శ్రీకృష్ణుని ఆగడాలను తల్లి యశోదతో గోపకాంతలు మొరపెట్టుకోవడం, కాళీయ మర్ధనం, గోపికల వలువలను వెన్నదొంగ దొంగిలించడం మొదలైన సంఘటనలతో పొందుపరిచారు. పిదప
శ్రీకృష్ణుడు చిటికెనవేలుతో గోవర్ధన
పర్వతాన్ని పైకెత్తడం, దేవేంద్రుని గర్వభంగం మరియు గోపస్త్రీలతో బృందావనంలో మురళీకృష్ణుడిగా అలరించడంతో చిత్రీకరించారు.
XXX
| #000 | పాట: | జయహే! కృష్ణావతారా | |
|---|---|---|---|
| నిర్మాణం: | తారకరామ పిక్చర్స్ | ||
| చిత్రం: | శ్రీకృష్ణావతారం (1967) | ||
| రచన: | సముద్రాల సీ. | ||
| సంగీతం: | టి. వి. రాజు | ||
| గానం: | ఘంటసాల, లీల, స్వర్ణలత, సరోజిని | ||
| ప: | ఘం: | జయహే! కృష్ణావతార నంద యశోదా పుణ్యావతారా | |
| జయహే! కృష్ణావతార | | జయహే | | ||
| పాపులనణచి సాధుల బ్రోవగ -2 | |||
| వ్రేపల్లె వెలసిన గోపకిశోరా | |||
| జయహే! కృష్ణావతా..రా... జయహే! కృష్ణావతారా | |||
| చ: | లీ: | ఎన్నో జన్మల పున్నెము పండీ, నిన్ను కంటిరా చిన్నారి తండ్రీ | | ఎన్నో | |
| స: | కన్నతల్లినీ కడుపెరుగదు నా | ||
| చన్ను కుడువ కనుమూసెదు రారా -2 | |||
| ఘం: | విషపూతన ప్రాణాపహారీ.. ఈ..ఈ.. -2 | ||
| శకటాసుర సంహారీ శౌరీ -2 | |||
| జయహే! కృష్ణావతారా... జయహే! కృష్ణావతారా | |||
| చ: | బృం: | కాపురమ్ము సేయలేమమ్మా.. వ్రేపల్లెలోనా | |
| కాపురమ్ము సేయలేమమ్మా | |||
| ఓ! యశోదా యీ పాపమెందు చూడలేదమ్మా | |||
| లీ: | పాలు వెన్న మనగనీడు, పడుచునొంటిగ చనగనీడు | ||
| కలిమి వుంటే కట్టి కుడుతురు, కన్న సుతునిటు విడుతురా | |||
| కాపురమ్ము సేయలేమమ్మా | |||
| ఘం: | జయహే! కృష్ణావతార నందకుమారా నవనీతచోరా | ||
| జయహే! కృష్ణావతారా... జయహే! కృష్ణావతారా | |||
| చ: | ఘం: | కాళింగ మడుగున కాళీయు పడగల | |
| కాలూని ధిమిధిమి నాట్యము చేసి | |||
| సర్పాధీశుని దర్పములణచిన -2 | |||
| తాండవ నాట్య వినోదా జయహే! కృష్ణావతారా.. | |||
| కాళియ మణిగణ రంజిత చరణ | |||
| జయహే! కృష్ణావతారా.. జయహే కృష్ణావతారా | |||
| చ: | లీ: | తనువులపై అభిమానము వీడినగాని | |
| తరుణులార నను జేర తరము కాదులే | |||
| స: | సిగ్గు వదలి ఇరు చేతులు జోడించండి -2 | ||
| చెల్లింతును మనసుదీర మీ కోరికల | |||
| ఘం: | జయహే! కృష్ణావతారా.. గోపకుమారీ వస్త్రాపహారా | ||
| జయహే! కృష్ణావతారా.. జయహే కృష్ణావతారా | |||
| చ: | లీ: | బాలుడితడనీ శైలము, చాల బరువని -2 | |
| మీ భయము వదలుకొండి, నా అండను చేరగరండి | |||
| మీకేలల్లాడదు నమ్మండి | |||
| భయము వదలుకొండి నా అండను చేరగరండి | |||
| మీకేలల్లాడదు నమ్మండి | |||
| ఘం: | గోవర్ధన గిరిధారీ..ఈ.. సురనాయక గర్వాపహారీ | ||
| జయహే! కృష్ణావతారా.. జయహే కృష్ణావతారా |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి